For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రైడల్ స్కిన్ కేట్ టిప్స్ (కాబోయే పెళ్ళికుమార్తెకు)చిట్కాలు

|

ప్రస్తుతం వెడ్డింగ్(పెళ్ళిళ్ళ) సీజన్. పెళ్ళిలో ప్రతి ఒక్కరూ అందంగా కనబడాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెళ్ళికూతురు అందంగా కనబడాలని పెళ్ళికి ముందు నుండే ప్రిపేర్ అవుతుంటారు. మేకప్ కోసం మరియు అందాన్ని మెరుగుపరచడం కోసం పెళ్ళికి కొద్దిరోజులుగా ఉందనంగానే సలూన్ మరియు స్కిన్ క్లీనిక్స్ కు వెళుతుంటారు. అయితే చర్మం అందాన్ని మెరుగుపరచడం కోసం పెళ్ళికి ముందు అర్జెంట్ గా ఇలా వెల్లి వేలకు వేలు ఖర్చుచేయడం కంటే కొన్ని బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్ ను, అది కూడా హోం రెమడీస్ ఉపయోగించడం అందులో కొన్ని టెక్నిక్స్ ను అనుసరించడం చాలా అవసరం.

పెళ్ళి కోసం కొన్ని బ్యూటీ టిప్స్ ను, పెళ్ళికి కొన్ని వారాల ముందు నుండే ప్రారంభించినట్లైతే మీరు నేచురల్ గ్లోను పొందవచ్చు. కాబట్టి, పెళ్ళికూతురు అయ్యేవారు, ఈ క్రింది తెలిపిన నేచురల్ స్కిన్ కేర్ టిప్స్ ను ఫాలో అయితే ప్రకాశవంతమైన కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.

 Skin Care Tips For The Bride To Be

1. నిద్రించడానికి ముందు తప్పకుండా చేయాల్సిందే: ప్రీ బ్రైడల్ టిప్స్ లో రెగ్యులర్ గా చేయాల్సినది నిద్రించడానికి ముందు క్లెన్సర్ లేదా టోనర్ ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అందువల్ల చర్మంలో పేరుకొన్న మురికి తొలగిస్తుంది, మూసుకుపోయిన చర్మరంధ్రాలను శుభ్రం చేస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ నిద్రించే ముందు తప్పనిసరిగా ముఖంను శుభ్రం చేసుకోవాలి.
2. ఆరోగ్యంగా తినాలి: స్కిన్ స్ట్రక్చర్ మరియు క్వాలిటీని పెంచేది మంచి ఆహారమే. బ్రైడల్ స్కిన్ కేర్ చిట్కాల్లో ఒక ముఖ్యమైన చిట్కా ఇది. పెళ్లికూతురు కాబోయేవారు, మంచి పౌష్టికారంను తీసుకోవాలి. ఉదాహారణకు సలాడ్స్ మరియు పండ్లు వంటివి మీ చర్మాన్ని మరింతా సాఫ్ట్ గా స్మూత్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుతాయి . అందువల్ల పెళ్ళికూతురు కాబోయే వారు స్పైసీ మరియు ఆయిల్ ఫుడ్స్ ను నివారించాలి

3. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి: ప్రీబ్రైడ్ బ్యూటి టిప్ లో మరో ముఖ్యమైన చిట్కా శరీరం ఫిట్ గా ఉంచుకొనేందుకు, పెళ్ళికి ముందు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకొనేందుకు రెగ్యులర్ వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం వల్ల చర్మం రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. మన శరీరంలో ప్రతి ఒక్క భాగం నుండి చెమటి పట్ట, చర్మం శుభ్రపడాలంటే వ్యాయామం ఒక్కటే ఉత్తమ మార్గం కాబట్టి, కాబోయే పెళ్ళికుమార్తెలు జిమ్ లేదా యోగా, డ్యాన్సింగ్ మరియు ఏరోబిక్స్ వంటివి ఎంపిక చేసుకోవచ్చు.

4. నేచురల్ ఫేస్ ప్యాక్ లను వేసుకోవాలి: ప్రీ బ్రైడ్ బ్యూటీ టిప్ నేచురల్ ఫేస్ ప్యాక్ లను వేసుకోవాలి. పండ్లు మరియు పెరుగు, ముల్తానీ మట్టి మరియు నేచురల్ గా అందుబాటులో ఉండే పదార్థాలతో ఫేస్ ప్యాక్ లు వేసుకోవాలి. ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ లు మీ చర్మాన్ని స్మూత్ గా మరియు సాఫ్ట్ గా మార్చుతుంది. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను ఇంట్లోనే దినం మార్చి దినం వేసుకోవచ్చు . ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి, కాంతివంతం చేస్తాయి.
5. అన్ని రకాల టాక్సిన్స్ ను నివారించాలి: చర్మానికి హాని కలిగించే ఆల్కహాల్ మరియు నికోటిన్ వంటి వాటిని పెళ్ళికి ముందు నివారించాలి. ఉదాహరణకు స్మోకింగ్ చేయడం వల్ల చర్మం మీద బ్లాక్ ప్యాచ్ లు ఏర్పడుతాయి. స్కిన్ స్ట్రక్చర్ ను రఫ్ గా మార్చుతాయి అందువల్ల మీరు త్వరగా పెళ్ళి చేసుకోబోతున్నట్లైతే మీరు అందంగా కనిపించిలంటే, మీరు టాక్సిన్ రిలేటెడ్ అలవాట్లన్నింటిని పూర్తిగా ఒక నెల ముందే మానేయాలి . ఈ బ్యూటీ టిప్స్ ప్రీ బ్రైడల్ స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ అనుసరించవచ్చు.

English summary

Skin Care Tips For The Bride To Be

It is the wedding season and there are women who want to look their best in their wedding. There is a rush in the salons and skin clinics for make up and beautification. But you do not necessarily need to spend big bucks to make your skin beautiful before marraige. Instead you can take help of beauty tips for pre bridal which consist of some bridal skin care tips that uses home remedies.
Story first published: Saturday, May 17, 2014, 13:05 [IST]
Desktop Bottom Promotion