For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి చర్మం కోసం ఇంటిలో చేసుకొనే 10 బ్యూటీ చిట్కాలు

By Super
|

మేము అనేక రకాల చర్మాలను చూసాం. వాటిలో పొడి చర్మం చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. పొడి చర్మానికి స్థిరంగా మరియు సాధారణ తేమ అవసరం. చర్మానికి తగినంత తేమ మరియు జిడ్డు లేకపోతే చర్మం త్వరలోనే పొడిగా మారుతుంది. చర్మం తేమగా ఉండటానికి సబ్బులు,ఫేస్ వాష్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశిలించాలి. పొడి చర్మం శీతాకాలంలో పొట్టుగా రాలి సమస్యాత్మకంగా ఉంటుంది. చర్మం ఆరిపోయి మరియు మృత పొరలు ఉపరితలం నుండి బయటకు వస్తాయి.

పొడి చర్మం కోసం అనుకూలమైన చర్మ ఉత్పత్తులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అందువల్ల వాటిని అడ్డుకోవటానికి నూనెలు మరియు బ్యూటీ ప్రయోజనాలను జోడించాలి. అందువలన,ఇంట్లో అందం చిట్కాలు మరియు ఇంటి నివారణల కోసం వెళ్ళటం మంచి మార్గం. ఇవి తక్కువ ధర,తక్షణమే అందుబాటులో ఉండటం మరియు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఈ వ్యాసంలో పొడి చర్మం కోసం ఇంట్లో చేసుకొనే 10 బ్యూటీ చిట్కాల జాబితా ఉంది.

ప్రక్షాళన ఆయిల్

ప్రక్షాళన ఆయిల్

ఈ నూనెలో ఉండే శుభ్రపరచే లక్షణాల కారణంగా పొడి చర్మంనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఉండే చర్మ పొడిదనం పోవటానికి ఆముదము రాయాలి. ఆలివ్ నూనె 3 భాగాలు మరియు ఆముదము 1 భాగంను తీసుకోని బాగా కలిపి,మీ ముఖం మీద ఈ మిశ్రమాన్ని రాస్తే పొరలుగా ఉండే చర్మ మరమ్మతుకు సహాయపడుతుంది. నూనెను కొంచెం వేడి చేస్తే అది మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. నూనె రాసిన తర్వాత వేడి టవల్ తీసుకుని ముఖం మీద ఉంచాలి. అప్పుడు నూనె చర్మంలోకి బాగా ఇంకుతుంది. తద్వారా చర్మం నునుపుగా మరియు మృదువుగా మారుతుంది. ఇతర నూనెల కంటే ఆముదము ఎక్కువగా చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోతుంది.

తేనె ప్యాక్

తేనె ప్యాక్

తేనె పొడి చర్మం కోసం చాలా బాగా పనిచేస్తుంది. తేనె చర్మం యొక్క ముడుతలను పోగొట్టి సిల్కీ మరియు మృదువుగా ఉంచుతుంది. తేనె మరియు నారింజ రసం మిశ్రమంను చర్మం మీద రుద్ది,10 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. ఇది ఇంటి రెమడీ లో చాలా గొప్పగా ఉంటుంది.

ఎగ్ ప్యాక్

ఎగ్ ప్యాక్

గుడ్డులో ఆరోగ్యకరమైన చర్మం కోసం అవసరమైన ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ఇది పొడి చర్మం కోసం ఉత్తమ హోమ్మేడ్ బ్యూటీ చిట్కాలలో ఒకటి. ఈ ప్యాక్ తయారుచేయటానికి,గుడ్డు నుండి తెలుపు,పసుపు సొనలను వేరుచేయాలి. ఆ తరువాత,గుడ్డు పచ్చసొన తీసుకొని బాగా కలిపి,దానిలో ఒక టేబుల్ స్పూన్ నారింజ రసం,ఒక టేబుల్ స్పూన్ ఆముదం,ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,ఒక టేబుల్ స్పూన్ తేనే, కొన్ని చుక్కల రోజ్ వాటర్,కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి ఉదయం స్నానానికి ముందు రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చాక్లెట్ ప్యాక్

చాక్లెట్ ప్యాక్

చాక్లెట్ ఒక రుచికరమైన మరియు తీపి ఎక్కువగా ఉంటుంది. చర్మం మీద ద్రవ చాక్లెట్ పోస్తే చర్మం మృదువుగా మరియు నున్నగా ఉంటుంది. అంతేకాక పొడిచర్మంనకు గ్లో ఇస్తుంది. చాక్లెట్ ప్యాక్ తయారుచేయటానికి ఐదు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్,ఐదు టేబుల్ స్పూన్ల తేనే,రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి,రెండు టేబుల్ స్పూన్ల అవోకాడో గుజ్జు తీసుకోని బాగా కలపాలి. ఈ ప్యాక్ ను ప్రతి రోజు పొడి చర్మం ఉన్నవారు వేసుకొని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

శనగ పిండి ప్యాక్

శనగ పిండి ప్యాక్

శనగ పిండి పొడి చర్మాన్ని తేమగా ఉంచటానికి మరియు ఫైన్ లైన్లు మరియు ముడుతలను తొలగించటానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ తయారుచేయటానికి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో ఒక టీ స్పూన్ పసుపు,ఒక టీ స్పూన్ తేనే,కొంచెం పాలు కలపాలి. దీనిలో కొన్ని నిమ్మచుక్కలు పిండాలి. ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మామిడి మాస్క్

మామిడి మాస్క్

బాగా పండిన మామిడికాయను తీసుకోని తొక్క నుండి గుజ్జును వేరుచేయాలి. గుజ్జును మిక్సర్ లో వేసి మెత్తగా చేయాలి. ఒక స్పూన్ మెత్తని గుజ్జులో ఒక స్పూన్ తేనే, మూడు స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట అయిన తర్వాత కడగాలి. అప్పుడు మీ చర్మం తేమ మరియు గ్లో వస్తుంది.

గుడ్డు మరియు నూనె మాస్క్

గుడ్డు మరియు నూనె మాస్క్

ఒక గుడ్డు తీసుకోని దానిలో ఒక స్పూన్ తేనే కలిపి,బాగా మిక్స్ చేయాలి. దానిలో రోజ్ వాటర్,కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఖచ్చితంగా మిక్స్ అయిందని నిర్ధారించుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి,పొడిగా ఆరాక వెచ్చని నీటితో కడగాలి. అలాగే పెరుగు ప్యాక్ ను కూడా అనుసరించవచ్చు.

అరటి మాస్క్

అరటి మాస్క్

రెండు అరటి పండ్లను తీసుకోని తొక్క తీసి మిక్సర్ లో వేసి మెత్తని గుజ్జుగా చేయాలి. దీనిని ముఖం మీద బాగా స్ప్రెడ్ చేసి ఒక గంట తర్వాత నీటితో శుభ్రం చేయాలి.

అవోకాడో మాస్క్

అవోకాడో మాస్క్

అవోకాడో నుండి తీసిన రసంలో పెరుగు కలపాలి. దీనికి ఒక స్పూన్ తేనే కూడా కలపాలి. దీనిని చర్మం పొడిగా ఉన్న ప్రాంతాలలో రాసి ఆరిన తర్వాత కడగాలి.

పెరుగు ప్యాక్

పెరుగు ప్యాక్

రెండు స్పూన్స్ పెరుగు తీసుకోని దానిలో తేనే కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఒక గంట తర్వాత శుభ్రంగా కడగాలి.

పొడి చర్మం కోసం ఈ సహజమైన బ్యూటీ చిట్కాలు,శీతాకాలంలో కూడా పొడి చర్మ బాధలను తగ్గిస్తాయి.

English summary

Top 10 Homemade Beauty Tips For Dry Skin

Out of the numerous skin types that we have, dry skin is easily the most problematic. It needs constant and regular moisturizing, and the moisturizers need to be oily enough or the skin will dry up really soon.
Desktop Bottom Promotion