For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలు

|

వాతావరణం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కాలాన్ని బట్టి వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మన శరీరంలో, చర్మంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. వేసవి వచ్చిందంటే చాలు శరీవేడి తాపానికి గురవుతుంది. వర్షాలకాలంలో చర్మం ఇన్ఫెక్షన్. చలికాలంలో చర్మం పొడిబారడం, రాషెష్, గీతలు పడటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఆయా కాలానికి అనుగుణంగా మన చర్మాన్ని రక్షించుకోవడం మన బాధ్యత.

తొలకరి జల్లులు... చర్మం మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ కు తగిన విధంగా తలెత్తే ఇబ్బందులను తట్టుకోవడానికి ఒక సమగ్రమైన ఆల్ రౌండ్ స్కిన్ కేర్ రొటీన్ అవసరం మండే ఎండల నుండి వర్షాలు ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే... అదే సమయంలో చర్మ సంరక్షణ అనేది కూడా ఈ సీజన్‌లో అంతే ప్రధానం. ఈ సీజన్ లో క్లీనింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ వంటి వాటికి న్యూట్రోజెనా డీప్‌ క్లీన్‌ ఫేషియల్‌ ఆయిలీ స్కిన్‌ కైనా, డల్‌ స్కిన్‌ కైనా ఇవి నప్పుతాయి. చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మం కాంతి వంతంగా, మృదువుగా మారేలా చేస్తాయి. అంతే కాదు వీటితో పాటు మాన్ సూన్ లో పాటించాల్సిన మరికొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా...

ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించాలి

ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారించాలి

వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షణ చాలా సాధరణమైన సమస్య . కాబట్టి, ఎక్కువ సమయం మీ చర్మాన్ని తేమగా ఉంచకండి, గోరువెచ్చని నీటితో స్నానం మరియు యాంటీఫంగల్ క్రీమ్స్, సోపులు మరియు టాల్కం పౌడర్లు ఉపయోగించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందవచ్చు . వర్షాకాలంలో చాలా సాధారణంగా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ పాదాలకు, రింగ్ వార్మ్ మరియు తడి దుస్తులు ధరించడం వల్ల దురద వంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంది.

చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి

చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి

వర్షాకాలంలో చర్మాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకోవాలి. సోపు కాకుండా ఫేస్ వాష్ లిక్విడ్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి . ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన .జిడ్డు, దుమ్ము, ధూళిని నిర్మూలిస్తుంది.

స్కిన్ టోనింగ్

స్కిన్ టోనింగ్

స్కిన్ టోన్ చేయడానికి నాన్ ఆల్కాహాలిక్ స్కిన్ టోనర్స్ ను ఉపయోగించాలి. టోనర్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేసి, మెయింటైన్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది .

డ్రైస్కిన్ మాయిశ్చరైజ్ (తేమ)గా ఉంచాలి

డ్రైస్కిన్ మాయిశ్చరైజ్ (తేమ)గా ఉంచాలి

వర్షాకాలంలో మీ చర్మం మరీ పొడిబారినట్లు కనిబడుతుంటే, మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ తో పాటు, రోజ్ వాటర్, గ్లిజరిన్ లేదా బాదం ఆయిల్ మిక్స్ చేసి నిద్రించే ముందు అప్లై చేయాలి.

ఆయిల్ స్కిన్ ను క్లీన్ గా ఉంచుకోవాలి

ఆయిల్ స్కిన్ ను క్లీన్ గా ఉంచుకోవాలి

మీకు డ్రైస్కిన్ కలిగి వైట్ హెడ్స్ లేదా బ్లాక్ హెడ్స్ తో ఇబ్బందిపడుతున్నట్లైతే అందుకు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించాలి . తర్వాత సిట్రస్ ఫేస్ ప్యాన్ ను వేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల కూడా ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.

మీ చర్మాన్ని రక్షించే విధంగా కవర్ చేసుకోవాలి

మీ చర్మాన్ని రక్షించే విధంగా కవర్ చేసుకోవాలి

వర్షాలు, మోడం ఉండటం వల్ల, చర్మం కేవలం సూర్యుని నుండి మాత్రమే రక్షించడం కాదు, వర్షకాలంలో మేగం మద్యనుండి మన మీద పడే సూర్యుని యొక్క హానికరమైన యూవీ కిరణాల నుండి కూడా మన చర్మాన్ని రక్షించుకోవాలి. అందుకు సన్ స్క్రీన్ లోషన్ (యస్ పిఎప్)తప్పనిసరిగా అప్లై చేయాలి.

ఎక్స్ ప్లోయేట్

ఎక్స్ ప్లోయేట్

వర్షకాలంలో ప్రతి రోజూ డెడ్ స్కిన్ ను తొలగించాలి. అందుకు స్కిన్ స్ర్కబ్ ను ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించి మీ చర్మం కాంతివంతంగా మరియు మెరుస్తుండేలా చేసుకోవాలి.

తగినన్ని నీళ్ళు త్రాగాలి

తగినన్ని నీళ్ళు త్రాగాలి

వర్షాకాలంలో వాతావరణంలో తేమవల్ల దాహం వేయకున్నా కనీసం రోజుకు ఏడెనిమిది గ్లాసులు తప్పనిసరిగా త్రాగాల్సి ఉంటుంది . చర్మంను ఎల్లప్పుడు తేమగా ఉంచుకోవడం చాలా అవసరం.

తరచూ తలస్నానం చేయాలి

తరచూ తలస్నానం చేయాలి

వర్షాకాలంలో తేమ మరియు చెమట వల్ల జుట్టు త్వరగా ఇన్ఫెక్షన్ కు దుమ్ము, ధూళికి గురౌతుంది కాబట్టి, పొల్యుషన్ నుండి రక్షణ పొందడానికి వారంలో రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి.

ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నివారించాలి

ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నివారించాలి

ఎవరికైతే చాలా సున్నిత చర్మతత్వం కలిగి ఉంటారో, అటువంటి వారు ఎక్కువ అలంకరణ ఆభరణాలు ధరించడం నివారించాలి. అలాగే గిల్ట్ నగలను పెట్టుకోవడం కూడా తగ్గించాలి. వాతవరణంలోని వేడి, తేమ వల్ల చర్మం పగుళ్ళకు దారితీస్తుంది. కాబట్టి, చర్మానికి తగినంత గాలి తలిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary

Top 10: Skin care tips for the monsoon

The bright sweat-causing sun has given way to cloudy skies and soaring levels of humidity. The monsoon is here and has brought with it a lot of joy and enthusiasm. With every downpour, your spirits are relished and revived. our skin, however, does not experience the same enthusiasm and instead suffers from oiliness or dehydration brought on by monsoon.
Story first published: Tuesday, July 8, 2014, 17:02 [IST]
Desktop Bottom Promotion