For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ & గ్లోయింగ్ స్కిన్ కోసం:10 సూపర్ ఫుడ్స్

|

మీరు రెగ్యులర్ గా ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు?ఆహారం ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ప్రభావితం చేస్తుందన్న విషయం మీకు తెలుసా? కొన్ని ఆహారాలు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే, మరికొన్ని ఆహారాలు శరీర సౌష్టవం, చర్మం సౌదర్యం, కేశ సౌందర్యం మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీ చర్మ నాణ్యతను తెలుపుతుంది. ఉదాహారణకు మీరు తీసుకొనే ఆహారం ఆయిల్ ఫుడ్ అయితే, అప్పుడు ఖచ్చితంగా మీ చర్మం మొటిమలకు, మచ్చలకు దారితీస్తుంది. అదే విధంగా ఆరోగ్యకరమైన ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరం మొత్తం ఆరోగ్యం మరియు కాంతివంతమైన చర్మంకు గొప్పగా సహాయపడుతాయి. కాబట్టి, ఈ విషయాన్ని గుర్తించుకొని హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే, లైఫ్ ఎంజాయ్ చేయండి .

13 నేచురల్ హోం మేడ్ ఫేస్ ప్యాక్: తెల్లగా మారడానికి:క్లిక్ చేయండి

అటువంటి టాప్ 10 ఫుడ్స్ ఇక్కడ హెల్తీ స్కిన్ కోసం....

పెరుగు:

పెరుగు:

పెరుగులో టన్నుల్లో ప్రోటీనులు, విటమిన్స్, మరియు క్యాల్షియం ఉన్నాయి. ఇది ముఖం, కళ్ళ వద్ద ముడుతలతో పోరాడటానికి ఫర్ ఫెక్ట్ పదార్థం. మీరు కను బరుతు తగ్గాలనుకొనే ప్లాన్ లో ఉన్నట్లైతే, మీరు రెగ్యులర్ గా పెరుగు తీసుకుంటే, బరువు తగ్గడంతో పాటు, మీ చర్మం ప్రకాశవంతంగా, సున్నితంగా మార్చడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

మీరు మీ చర్మంలో మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నట్లైతే, జస్ట్ గ్రీన్ టీని రెగ్యులర్ గా ప్రతి రోజూ సిప్ చేయండి. తర్వాత మీ చర్మంలో మ్యాజికల్ ఎఫెక్ట్ ను గమనించండి. గ్రీన్ టీలో గ్రేట్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మం ను ఫ్యూరిఫై చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది . కాబట్టి, రెగ్యులర్ గా తీసుకొనే కాఫీ, టీలకు చెక్ పెట్టి, గ్రీన్ టీకి అలవాటు చేసుకొని డిఫరెన్స్ ను చూడండి.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది మరియు సన్ డ్యామేజ్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. స్ట్రాబెర్రీస్ లో ఆల్ఫా హైడ్రాక్సి ఆసిడ్, ఇది డెడ్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ పండ్లు తిని మీ చర్మం యొక్క కణాలను మెరుగుపరుచుకోవచ్చు.

వాల్ నట్స్ :

వాల్ నట్స్ :

ఈ అద్బుతమైన ఎండు ఫలంలో నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ చర్మం కాంతివంతంగా కనబడుటకోసం, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కాబట్టి, వారానికొకసారైనా ఒక గుప్పెడు వాల్ నట్స్ ను తినండి. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ఒక టాప్ ఫుడ్.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని మర్మత్తు చేస్తుంది. మీకు చాలా సున్నితమైన చర్మం ఉంటే, క్యారెట్ చర్మ సమస్యలన్నింటిని నివారిస్తుంది . క్యారెట్ ను పచ్చిగా అలాగే తినడం లేదా క్యారెట్ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మీ చర్మం తేమగా, సాఫ్ట్ గా మరియు స్మూత్ గా తయారువుతుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లును బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు . దీన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్, చర్మకణాల పునరుద్దరణకు మరియు మీ చర్మాన్ని ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచడానికి మరియు మీరు యవ్వనంగా కనబడటానికి సహాయపడుతుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ఫిష్ లో హెల్తీ ఫ్యాట్ కలిగి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి, సూర్య రశ్మినుండి రక్షణ కల్పిస్తాయి మరియు ఆరోగ్యకరమైన చర్మకణాల నిర్వాహణకు సహాయపడుతుంది. మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మీ చర్మ రంధ్రాలు మూసుకుపోయినట్లైతే, సాల్మన్ ఫిష్ తినడం ఒక మంచి మార్గం.

బాదం:

బాదం:

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది సన్ డ్యామేజ్ ను నుండి చర్మాన్ని రక్షిస్తుంది మరియు చర్మయొక్క ఎలాసిటిని నిర్వహిస్తుంది. బాదంలో చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మీ బ్రేక్ ఫాస్ట్ లో చాలా సులభంగా యాడ్ చేసుకోవచ్చు . బ్రేక్ ఫాస్ట్ సెరల్స్, స్నాక్ బార్స్ మరియు సలాడ్స్ లో యాడ్ చేసుకోవచ్చు.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

తృణధాన్యాలు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది. శరీరం మరియు చర్మాన్ని శుభ్రం చేస్తుంది. మీ రెగ్యులర్ డైట్ లో తృణధాన్యాలు చేర్చుకొని మీ జీర్ణక్రియను మెరుగుపరుచుకొని, చర్మ యొక్క నాణ్యతను పెంచుతుంది .

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ మీ చర్మాన్ని సున్నితంగా మార్చడం మాత్రమే కాదు, హానికరమైన యూవీ కిరణాలను నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది. డార్క్ చాక్లెట్ చర్మానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. చాక్లెట్ ను ఎంపిక చేసుకొనేటప్పుడు బార్ చాక్లెట్ ను ఎంపిక చేసుకోవాలి. అందులో కోక కంటెంట్ ఎక్కువ ఉంటుంది. డార్క్ చాక్లెట్ చాలా వ్యసనపరులుగా మార్చుతుంది కానీ, చర్మానికి మంచి ప్రయోజనాలను అంధిస్తుంది.

English summary

Top 10 Super Foods For Healthy Skin

You are what you eat’- this statement is true in many ways. Your skin speaks volumes about what you eat. If you indulge in oily food, your skin will definitely experience an acne outbreak. On a similar note, healthy food leads to a healthy and glowing skin. Remember to eat healthy and enjoy your life.
Desktop Bottom Promotion