For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యంలో పసుపుతో టాప్ 5 బ్యూటీ రిసిపిలు

|

పసుపు - చర్మాన్ని సం రక్షించే పదార్దాలలో, పసుపు ఎంతో ముఖ్యమైనది. ఇది మన చర్మంలోని జిడ్డు తనాన్ని తొలగించి, దద్దుర్లు, మొటిమల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది మన చర్మాన్ని నిగారింపచేసి ఎంతో అందంగా మరియు మృదువుగా మారుస్తుంది.

పసుపులోని గుణాలు చర్మాన్ని శుబ్రపరిచి, పనికిరాని అంటే సరిగా లేని చర్మాన్ని తోలగించి కొత్తగా, అందమైన మరియు, ఎంతో మృదువైన చర్మాన్ని ఇస్తుంది.
ఈ పసుపుతో చేసిన "ఫేస్ ప్యాక్" మొటిమల్ని నిర్మూలించి, చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది.

ఇది మీ శరీరంలోని మలినాలని, దుమ్ము, ధూళిని, మరియు బ్యాక్టీరియా ని తొలగించి యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తుంది. పసుపు మీ చర్మంలోని జీవం కోల్పోయిన కణాలని తొలగించి, శుబ్రపరిచి, ఎంతో కాంతివంతమైన, మరియు తేజోవంతమైన చర్మాన్ని ఇస్తుంది. మన చర్మం లోని రంద్రాలని దుమ్ము మరియు మలినాల నుండి శుబ్రపరిచి, సహజత్వంతో కూడిన చర్మాన్ని ఇస్తుంది.

Top 5 Beauty Recipes Using Turmeric

1. పసుపు మరియు ఓట్స్ పిండితో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"
కావలసినవి :
పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),
ఓట్స్ పిండి: 4-5 స్పూన్లు,
తేనె: 3-4 స్పూన్లు,
పచ్చి పాలు: 4-5 స్పూన్లు

తయారుచేసుకునే విధానం :
పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, పాలు తేనే మన ముఖంలోని తేమను కాపాడతాయి, పసుపు మన ముఖం పై ఉన్న మచ్చలు, మోటిమలను శుబ్రం చేసి, ఎంతో కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది.
ఈ చిట్కా పొడిగల చర్మం ఉండి మొటిమలతో బాధపడేవారికి ఎంతో మంచి ఫలితాలని ఇస్తుంది.

2. పసుపు & పెరుగుతో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"
కావలసినవి :
పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),
పెరుగు: 1\2 కప్పు
పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,సుర్యుని వేడి వల్ల మాడిన, లేదా రంగు మారిన చర్మం అందంగా మారుతుంది, ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా కాళ్ళు, చేతులకు కూడా రాసుకుని 15-20 నిమిషాల తర్వాత శుబ్రపరుచుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

3. పసుపు మరియు గంధముతో (sandal) తయారు చేసిన "ఫేస్ ప్యాక్"
కావలసినవి :
పసుపు: 3-4 చిటికెలు (కొద్దిగా),
గంధపు పొడి (sandal wood powder) 1-2 టేబుల్ స్పూన్లు,
పాలు: 1-2 స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి రాసుకుని 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ చర్మంలోని నల్లదనం మొత్తం పోయి ఎంతో కాంతివంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

4. పసుపు మరియు తేనెతో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"
కావలసినవి :
పసుపు: 2 చిటికెలు (కొద్దిగా),
తేనె 2-3 టేబుల్ స్పూన్లు
పన్నీరు 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని 10-15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, మీ ముఖం పై ఉన్న ముడతలు పోయి మృదువైన చర్మాన్ని పొందుతారు.

5. పసుపు మరియు నిమ్మరసంతో తయారు చేసిన "ఫేస్ ప్యాక్"
కావలసినవి:
పసుపు 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం 1-2 టేబుల్ స్పూన్లు

పైన సూచించినవన్నీ ఒక గిన్నేలొ కలిపి పేస్టులా చేసుకోవాలి, దానిని మీ ముఖానికి, మెడకి రాసుకుని 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రం చేసుకుంటే, ఈ మిశ్రమం ఒక బ్లీచింగ్ లా ఉపయోగపడి మీ ముఖానికి కాంతినిస్తుంది.
పైన సూచించినవి అన్నీ మీ చర్మ సౌందర్యాన్ని కాపడటానికి ఎంతో ఉపయోగపడతాయి, అందమైన చర్మం పొందాలంటే పైన సూచించిన పాటించండి, మెరుగైన ఫలితాలు పొందుతారు.

English summary

Top 5 Beauty Recipes Using Turmeric

Turmeric is part of the ginger family and well known for adding flavour and colour to Indian dishes. However, it also has many other hidden talents! Effective and inexpensive, turmeric has dozens of beauty benefits including brightening the skin complexion, preventing breakouts and reducing the appearance of stretch marks.
Story first published: Wednesday, February 12, 2014, 15:51 [IST]
Desktop Bottom Promotion