For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై చారలు మాయం చేసే 7 ఉత్తమ మార్గలు

|

చర్మం మీద మచ్చలు, చారలతో బాధపడుతున్నారా?మీ చర్మ మీద మచ్చలు లేదా చారలకు వివిధ కారణాలు ఉండవచ్చు. వంటచేసేప్పుడు, వేడి వేడి పాన్స్, కుక్కర్లు వంటివి చేతికి తగడం వల్ల బర్న్ స్కార్స్ లేదా బర్నింగ్ మచ్చలు అలాగే చర్మం మీద కనబడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కాలిన గాయాలు లేదా దెబ్బతగిలిన గాయాలు కూడా మచ్చలుగా, చారలుగా మారుతాయి. ఇలా చర్మం మీద పడ్డ వివిధ రకాలా మచ్చలు, చారలు మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అంతే కాదు, మొటిమలతో వచ్చే మచ్చలు కూడా మచ్చలకు ఏర్పడుటకు ప్రధాన కారణం అవుతుంది.

మొటిమలతో ఏర్పరడే మచ్చలు చారలుగా ఏర్పడకపోయినా, ఆ మచ్చలు కొంత వరకూ బాధ కలిగిస్తుంది. ఇటువంటి మచ్చలు, చారలను నివారించడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే ఖరీదైన క్రీములను ఉపయోగిస్తే మచ్చలు కొంత వరకూ తొలగిపోయినా, వాటి గుర్తులు చారలుగా చర్మం మీద అలాగే నిల్చి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉత్తమ హోం రెమడీస్ అప్లై చేయడం ద్వారా మచ్చలను మరియు ఛారలను లైట్ చేస్తుంది. లేదా పూర్తిగా మాయం చేస్తాయి. మరి ఆ ప్రభావంతమైన హోం రెమడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

అలొవెరా

అలొవెరా

ఎటువంటి చర్మ సమస్యకైనా అలొవెరా ఒక గొప్ప పరిష్కార మార్గం. అలొవెరా జెల్ ను ముకం మీద అప్లై చేయాలి. ఇది ఫేషియల్ స్కార్స్ ను మాయం చేస్తుంది. స్కిన్ స్కార్స్ ను నివారించడానికి అలోవెరా ఒక ఉత్తమ ఎంపిక.

బేకింగ్ సోడ

బేకింగ్ సోడ

మీ చర్మాన్ని బేకింగ్ సోడాతో ఎక్స్ ఫ్లోయేట్, లేదా స్ర్కబ్ చేయవచ్చు. ఇది ఖచ్చితంగా స్కార్స్ ను నివారిస్తుంది. బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో వేసి మెత్తగ పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను స్కార్ ఉన్న చర్మం మీద అప్లై చేసి, సర్కులర్ మోషన్ లో రుద్దాలి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాలకోసం ఇలా రెగ్యులర్ బేస్ లో చేయాలి.

తేనె

తేనె

తేనే ఇంట్లో సహజంగా మచ్చలు తగ్గించటం కోసం ఉపయోగకరంగా ఉంటుంది.తేనే చర్మ కణజాలం పునరుత్పత్తిలో సహాయపడి ఒక మాయిశ్చరైజర్ గా ఉంటుంది. చనిపోయిన చర్మం కణాలు మరియు కణజాలాలలో మచ్చలు ఉంటాయి. తేనే కొత్త చర్మం కణజాలంను పెంచి,తద్వారా మచ్చలను తగ్గించటానికి సహాయం చేస్తుంది. కొన్ని చుక్కల తేనె తీసుకోని నేరుగా మచ్చల ప్రాంతంలో రాయండి. క్రమం తప్పకుండా ఇలా చెయ్యడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని స్మూత్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

పసుపు

పసుపు

నీటిలో పసుపును మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. ఇది స్కిన్ స్కార్స్ నివారించడంలో ఉత్తమ రెమెడీగా నిరూపించుకోబడుతుంది మరియు ఇతర ఏ చర్మ సమస్యనైనా చాలా తేలికగా వదిస్తుంది.

మెంతులు

మెంతులు

స్కిన్ స్కార్స్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి, మరుసటి రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి మొత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. ఇది ముఖం మీద మచ్చలను, ఛారలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెంతి పేస్ట్ ను అప్లై చేసిన తర్వాత కొంత సమయం అలాగే ఉండాలి. తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బాదం ఆయిల్

బాదం ఆయిల్

బాదం ఆయిల్ ను స్కిన్ స్కార్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, మసాజ్ చేయాలి . రోజులు రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాదం ఆయిల్ స్కిన్ మరియు హెయిర్ కేర్ లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసం

అత్యంత ప్రభావవంతమైన సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా నిమ్మ ఉన్నది. నిమ్మకాయను అనేక మంది సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. ఇది మచ్చల గుర్తులు తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది. నిమ్మను ఉపయోగించి మచ్చల గుర్తులను తగ్గించటం అనేది ఒక సహజమైన మరియు సమర్థవంతమైన మార్గం. నిమ్మ కూడా చనిపోయిన చర్మం కణాలను తొలగించి కొత్త చర్మం యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మచ్చలను తగ్గించటానికి ఒక కాటన్ తీసుకోని నిమ్మరసంలో ముంచి మచ్చల యొక్క ప్రాంతం చుట్టూ రుద్దాలి. దీనిని ప్రతిరోజూ కొన్ని వారాల పాటు పునరావృతం చేయాలి. మీరు మచ్చలలో గణనీయమైన తేడాను చూస్తారు. బంగాళాదుంప మరియు టమోటా కూడా మచ్చలు తగ్గించగల మంచి సహజ బ్లీచింగ్ కారకాలుగా ఉన్నాయి.

English summary

Top 7 Ways To Lighten Scars


 Does a scar on your skin bother you? Probably you got that while you were removing the hot pan off the gas or, while you were checking your car. You might burn your hand in any incident and it turns into a scar after a while. Some of you may have scars that's been on your skin all your life. There are a number of reasons why scars become a part of your life.
Story first published: Wednesday, March 26, 2014, 15:06 [IST]
Desktop Bottom Promotion