For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల కొరకు టాప్ ఫేషియల్ కేర్ టిప్

|

సాధారణంగా స్త్రీలతో పోల్చితే పురుషుల యొక్క చర్మం చాలా కఠినంగా రఫ్ గా ఉంటుంది. అందుకే పురుషులు కూడా వారి చర్మం యొక్క అందాన్ని కాపాడుకోవడం కోసం తగిన శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. స్త్రీలతో పోల్చినప్పుడు పురుషుల యొక్క చర్మంలో చాలా త్వరగా నూనె చేరిపోతుంటుంది. నూనె గ్రంథులు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా జిడ్డుగా మారుతుంటుంది. ఇటువంటి జిడ్డు చర్మం, దానికి తోడు చర్మం రఫ్ గా ఉండటం వల్ల పురుషుల యొక్క చర్మం తెలియకుండానే అనేక చర్మ సమస్యలను ఎదుర్కొంటుంది.

ఈ సమస్యను నివారించాలంటే విటమిన్ల లోపం లేకుండా చేసుకోవాలి. అందుకు విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారాలు తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల మొత్తం చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అలాగే ఎక్స్ టర్నల్ గా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, చర్మంను మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవడం పురుషులకు ఎంతో అవసరం. అందుకు అవసరం అయ్యే కొన్ని ఫేషియల్ కేర్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఫేషియల్ కేర్ టిప్స్ ను అనుసరించడం ద్వారా పురుషుల యొక్క చర్మం కూడా సాఫ్ట్ గా హెల్తీగా ఉంటుంది.

Top facial Care Tips For Men

1. క్లీనింగ్, మాయిశ్చరైజింగ్, మరియు టోనింగ్: పురుషు చర్మ సంరక్షణలో ఒక టాప్ ఫేషియల్ కేర్ టిప్ ఇది, క్లీనింగ్, మాయిశ్చరైజింగ్ మరియు టోనింగ్ వల్ల అమ్మాయిల చర్మం వలే సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ఉంటుంది. ఈ మూడు పద్దతులు, స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా చాలా అవసరం అయినవి . స్త్రీల కంటే పురుషులు చర్మంలో నూనె గ్రంధులు ఎక్కువగా ఉండటం వల్ల చర్మంలో జిడ్డు ఎక్కువగా ఏర్పడుతుంది. ఇది చాలా సర్వ సాధారణ సమస్య. అందుకు ప్రధాన కారణం కాలుష్యం, పొగ మరియు ఇతర పొల్యుషన్. ఈ మూడు స్టెప్స్ అనుసరిస్తే పురుషులు కూడా వారి చర్మాన్ని సాఫ్ట్ గా మరియు హెల్తీగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పురుషులు ఆయిల్ క్లియర్ ఫేష్ వాష్ ను ఉపయోగించాలి.ః

2. కళ్ళ ముడుతలను నివారించడానికి ఐ క్రీమ్ : పురుషుల్లో కళ్ళ చుట్టూ ముడుతలు ఏర్పడటం సాధరణం. కాబట్టి, ముడుతలను నివారించుకోవడానికి ఐ క్రీమ్ ను అప్లై చేయండి. డీహైడ్రేషన్ కారణం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న చర్మం మీద ముడుతలకు కారణం అవుతుంది . కళ్ళ చుట్టూ ఐ క్రీమ్ ను అప్లై చేయడం ద్వారా, కళ్ళ క్రింద చర్మం అలసినట్లు అనిపించదు. కాబట్టి రోజులో ఒకటి రెండు సార్లు ఐక్రీమ్ ను ఉపయోగించుకోవచ్చు.

3. ఎక్స్ ప్లోయేట్: ఇది మరో ముఖ్యమైన ఫేషియల్ ఐ కేర్ టిప్. ఎక్స్ ఫ్లోయేట్ వల్ల కళ్ళ క్రింద ఉన్న చర్మం నుండి డల్ నెస్ ను నివారిస్తుంది. కాబట్టి మీరు ప్రతి రోజూ చర్మం ను ఎక్స్ ఫ్లోయేట్ చేయండి మరియు అవాంఛిత డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడం వల్ల చాలా అవసరం. అందుకు ఒక మన్నికైన స్ర్కబ్బింగ్ ను వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. పగిలిన పెదాలను నివారించడానికి లిప్ గార్డ్స్ : పెదాల పగుళ్ళు సహజం . పెదాలకు రెగ్యులర్ గా లిప్ బామ్ ను అప్లై చేయడం వల్ల పగిలిన పెదాలను నివారించవచ్చు . మంచి ఫలితాల కోసం హై ఎస్ పి ఎఫ్ కలిగిన లిప్ బామ్ ను ఉపయోగించాలి. ఈ నాలుగు విలువైన చిట్కాలు పురుషులు క్రమం తప్పకుండా పాటించినట్లైతే తప్పకుండా మెచ్చుకోదగ్గ ఫలితాలను పొందవచ్చు..

English summary

Top facial Care Tips For Men

It is a known fact that men's skin in more coarse and rough in comparison to a women's. This makes it necessary for men to take good care of their skin, for the skin of men accumulates more oil than the skin of women. Also, The coarseness and roughness of the skin makes men more susceptible to common skin problems- many of which emanate from deficiency of vitamins.
Story first published: Monday, June 9, 2014, 16:50 [IST]
Desktop Bottom Promotion