For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాహాన్నితీర్చడమేకాదు, అందాన్ని కూడా వేగంగా పెంచతుంది

దాహాన్నితీర్చడమేకాదు, అందాన్ని కూడా వేగంగా పెంచతుంది

|

పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. మండే ఎండల్లో పుచ్చకాయ తింటే ఎంత చల్లగా ఉంటుందో, దానిని ముఖానికి రాసుకుంటే అంత హాయిగా ఉంటుంది. ముఖాన్ని తాజాగా ఉంచడానికి అదెంతో ఉపయోగపడుతుంది. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

READ MORE: సమ్మర్ ఫేవరెంట్ ఫ్రూట్ వాటర్ మెలోన్ లోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

అందరూ అనుకున్నట్లు పుచ్చకాయ వేసవి తాపాన్ని తేర్చే ఒక జూసీ ఫ్రూట్ మాత్రమే కాదు, మన చర్మ సంరక్షణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని వేడి నుంచి రక్షిస్తూనే చర్మ వ్యాధులు సోకకుండా ఒక మంచి మందులా ఉపయోగపడుతుంది. ఇందులో 93% నీటి నిల్వలతో పాటుగా మల్టీవిటమిన్లు విటమిన్ A, విటమిన్ B6 మరియు విటమిన్ C లు సమృద్ధిగా ఉన్నాయి. ఇది మన చర్మం యొక్క దాహాన్ని తీర్చి శాంత పరచడమే కాకుండా, వేడి వల్ల చర్మంలో చిన్న చిన్న సమస్యలు ఉన్ననూ శుభ్రం చేసి సంరక్షిస్తుంది.

చర్మ సంరక్షణలో వాటర్ మెలోన్ లోని మరికొన్ని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..

చర్మ సంరక్షణకు

చర్మ సంరక్షణకు

కాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.

మొటిమలను నివారిస్తుంది

మొటిమలను నివారిస్తుంది

వేసవి కాలంలో ముఖానికి వాటర్ మెలోన్(పుచ్చకాయ)తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. మీరు కనుక మొటిమలతో బాధపడుతుంటే, వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్ రెగ్యులర్ గా వేయండి.

బ్లాక్ హెడ్స్

బ్లాక్ హెడ్స్

చర్మ రక్షణలో బాగంగా ముఖం, ముక్కు మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్ ను తొలగించడం సహాయపడుతుంది.

వృద్దాప్య ఛాయలను పోగొడుతుంది

వృద్దాప్య ఛాయలను పోగొడుతుంది

వాటర్ మెలోన్ లో ఉండే లైకోపిన్, విటమిన్ సి మరియు విటమిన్ ఎ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే యాంటీఆక్సిడెంట్స్ కూడా ముడతలను, కళ్ళ క్రింద చారలను తొలగిస్తుంది.

ఆయిల్ చర్మాన్ని తొలగిస్తుంది

ఆయిల్ చర్మాన్ని తొలగిస్తుంది

ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మలోపల ఉన్న నూనె మగ్రంధులను తగ్గిస్తుంది. దాంతో ముఖంలో జిడ్డు కూడా తగ్గి ముఖం తాజాగా ఉంటుంది.

స్కిన్ హైడ్రైషన్

స్కిన్ హైడ్రైషన్

చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది: వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.

నేచురల్ టోనర్

నేచురల్ టోనర్

ఈ ఎర్రని, జ్యూసీ ఫ్రూట్ నేచురల్ ఆస్ట్రిజెంట్ చర్మం రంగును మార్చుతుంది. అందుకు ఈ కర్జూజ గుజ్జును ముఖానకి మర్ధనా చేయాలి. ఈ తాజా వాటర్ మెలోన్ లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిల్ చర్మానికి నేచురల్ గా పనిచేస్తుంది.

స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది

స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది

వాటర్ మెలోన్ లో నీటిశాతం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్కిన్ ఎలాసిటి పెంచుతుంది మరియు ముడుతలను, ఫైన్ లైన్స్ ను నివారించి చర్మంను క్లియర్ గా ఉంచుతుంది.

వడదెబ్బ

వడదెబ్బ

ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతే కాదు ఇందులో బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బీ-కాంప్లెక్స్‌ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

కేశ సంరక్షణకు

కేశ సంరక్షణకు

పుచ్చకాయలో ఉండే సిలికాన్ మరియు సల్ఫర్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. పాలకూర, క్యారెట్ రసాలకు కాస్త కీర రసం కలపి తరచు తాగితే శీరోజాలు చక్కగా పెరుగుతాయి.

జుట్టు పెరుగుదలకు

జుట్టు పెరుగుదలకు

వాటర్ మెలోన్(పుచ్చకాయ) శరీరంలోనే కాదు, తలలో కూడా బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. దాంతో జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

జుట్టు చిట్లడం నివారిస్తుంది

జుట్టు చిట్లడం నివారిస్తుంది

పుచ్చకాయను రెగ్యులర్ గా తింటే, శరీరానికి మరియు కేశాలకు కావల్సినంత తేమను అంధివ్వడంతో జుట్టు చిట్లకుండా ఉంటుంది.

స్ర్కబ్బింగ్

స్ర్కబ్బింగ్

స్క్రబ్‌ని తయారుచేయాలానుకుంటే కప్పు పుచ్చకాయ గుజ్జుకి పంచదార, నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో పెట్టండి. రోజూ దీనితో ముఖం రుద్దుకుంటే మురికి పూర్తిగా పోతుంది. ఈ మిశ్రమాన్ని వారం వరకూ వాడుకోవచ్చు.

పాదాలు:

పాదాలు:

మృదువైన పాదాల్ని కూడా పుచ్చకాయతో పొందొచ్చు. అర కప్పు పుచ్చకాయ రసాన్ని తీసుకుని దానికి కొంచెం బాదంపొడి, కొంచెం పెరుగు కలిపి పాదాలకి రాసి మర్దన చేసి కాసేపాగి కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే పాదాలు మృదువుగా మారతాయి.

English summary

Watermelon Benefits for Skin Beauty

Watermelon is a seasonal fruit that can be enjoyed in this season. As summer is knocking the door, you have to prepare your skin to fight sun tan and sweat. Drinking watermelon juice not only keeps you hydrated but also helps get a radiant skin.
Desktop Bottom Promotion