For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుచ్చకాయ ఫేస్ ప్యాక్ మరియు సౌందర్య ప్రయోజనాలు

|

వాటర్ మెలోన్(పుచ్చకాయ) మోస్ట్ పాపులర్ సమ్మర్ ఫూట్. పేరుకు సమ్మర్ ఫ్రూట్ అయినా, వింటర్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో వాటర్ మెలోన్ అందుబాటులో ఉంటుంది. పుచ్చకాయలోని అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ పుచ్చకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మరియు ఇందులో చాలా వరకూ జీరో ఫ్యాట్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది . ఇందులో హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

వాటర్ మెలోన్ లో నేచురల్ టోనర్ వంటి అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. మరియు ఇందులో యాంటీయాక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండటం వల్ల వృద్దాప్యంను నివారిస్తుంది. వాటర్ మెలోన్ లో ఇంకా విటమిన్ ఎ అధికంగా ఉండి ఇది ఆయిల్ స్కిన్ నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అలాగే ఈ పుచ్చకాయలో 95%నీరు కలిగి ఉండటం వల్ల శరీరానికి తగినంత నీరు అంది, చర్మానికి తగినంత తేమ అందడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా మరియు షైనీగా మెరుస్తుంటుంది. చర్మ సౌందర్యం పెంచుకోవడంలో అనేక ఫేస్ ప్యాక్ లలో ఈ పుచ్చకాయను ఉపయోగిస్తుంటారు. అనేక సౌందర్య పదార్థలైన పెరుగు, శెనగపిండి, తేనె మరియు పాలు వంటి వాటిలో పుచ్చకాయను చేర్చి హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకోవచ్చు.

పుచ్చకాయతో తయారుచేసే ఫేస్ ప్యాక్ లు కొద్ది నిముషాల్లోనే తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పండు యొక్క ఖరీదు తక్కువ మరియు మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. మరి మీకోసం ఇక్కడ వాటర్ మెలోన్ ఉపయోగించి కొన్ని బెస్ట్ ఫ్రూట్ ఫేస్ మాస్క్ లు ఇవ్వబడ్డాయి, వీటిని ఉపయోగించి చర్మంను ప్రకాశవంతంగా మార్చుకోండి...

వాటర్ మెలోన్ ఫేస్ మాస్క్:

వాటర్ మెలోన్ ఫేస్ మాస్క్:

జ్యూసీగా ఉండే ఈ రెడ్ ఫ్రూట్ ను నేరుగా ముఖానికి అప్లై చేయొచ్చు. పుచ్చకాలోని విత్తనాలు తీసేసి, మెత్తగా చేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకొనే ముందు ముఖాన్ని శుభ్రం కడిగి తర్వాత ఈ వాటర్ మెలోన్ పేస్ట్ ను అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

పుచ్చకాయ-తేనె:

పుచ్చకాయ-తేనె:

ఈ రెండింటి కాంబినేషన్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు, కాంతివంతంగా మార్చుతుంది. పుచ్చకాలో గింజలు తీసేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ ను నేచురల్ గా తొలిగిస్తుంది. మరియు ఇది చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.

పుచ్చకాయ-పెరుగు :

పుచ్చకాయ-పెరుగు :

చర్మం మృదువుగా మరియు ప్రకాశవంతంగా ఉండాలంటే, పెరుగును బాగా బీట్ చేసి తర్వాత అందులో పుచ్చకాయ జ్యూస్ ను వేసి మిక్స్ చేయాలి . ఈ రెండింటి మిశ్రమం మరింత రెడ్ గా తయారవుతుంది ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇందులోని ల్యాక్టిక్ యాసిడ్ మరియు ఎంజైమ్స్ మీ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్, శుద్ది చేస్తుంది

పుచ్చకాయ-అవొకాడో:

పుచ్చకాయ-అవొకాడో:

అనేక బ్యూటీ బెనిపిట్స్ కలిగినటువంటిది అవొకాడో. కొంచె అవొకాడోను మ్యాష్ చేసి అందులో వాటర్ మెలోన్ జ్యూస్ ను మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత శుబ్రం చేసుకోవాలి. అవొకాడోలో ఆంటీయాక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండం వల్ల చర్మానికి తగినంత పోషణను అందిస్తుంది మరియు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

వాటర్ మెలోన్ మరియు షుగర్ :

వాటర్ మెలోన్ మరియు షుగర్ :

చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలను అందివ్వటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది . ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రం చేస్తుంది చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేసి శుభ్రం చేసి ప్రకాశవంతంగా మార్చుతుంది. పుచ్చకాయను చిదిమి అందులో షుగర్ వేసి ముఖాన్ని అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. 5నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

పుచ్చకాయ-పాలు:

పుచ్చకాయ-పాలు:

ఇది నేచురల్ స్కిన్ టోనర్. ఇది చర్మాన్ని క్లీన్ చేస్తుంది. మరియు చర్మరంధ్రాలను ఓపెన్ చేస్తుంది. మరియు సన్ టాన్ తగ్గిస్తుంది . ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల ఒక అందమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.

పుచ్చకాయ-కీరదోసకాయ:

పుచ్చకాయ-కీరదోసకాయ:

సులభంగా మీరు గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే, ఈ రెండింటి కాంబినేషన్లో ఫేస్ ప్యాక్ ను వేసుకోవాలి . పుచ్చకాయ, కీరదోసకాయ రసాన్ని పెరుగు మరియు పాలపౌడర్ మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

పుచ్చకాయ-అరటి పండు:

పుచ్చకాయ-అరటి పండు:

ఈ వాటర్ మెలోన్ ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు నివారించబడుతుంది . వాటర్ మెలోన్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, మరో ప్రక్క అరటి పండులో విటమిన్ బి2, బి6 మరియు బి12 అధికంగా ఉండి ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . ఇది చర్మం కాంతివంతంగా తేమగా, సాఫ్ట్ గా మొటిమలు లేని చర్మాన్ని అందిస్తుంది.

Story first published: Wednesday, August 20, 2014, 17:48 [IST]
Desktop Bottom Promotion