For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చల్లనమ్మ ఇంట్లో ఉంటే, సౌందర్యం మనవెంటే

|

వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో చల్లని పానియాలతో పాటు చల్లచల్లని పెరుగు, మజ్జిగ కూడా అందుబాటులో ఉంటాయి. అలా ప్రతి ఇంట్లో పెరుగు ఉంటే సౌందర్యం వారి వేంటే ఉంటుంది. ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకొనే పెరుగు, మజ్జిగలో ఎన్నోరకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. దీన్ని పూర్వ కాలంనుంచే మన దేశంలో అందనికి మెరుగులు దిద్దేదిగా మన దేశంలో వాడుతున్నారు. ముఖ్యంగా పెరుగును ముఖకాంతిని పెంచేందుకు ఎక్కువగా వాడుతారు. చర్మాన్ని దుమ్ము,ధూళి, హానికరమైన సూర్యకిరణాల ప్రభావం నుంచి కాపాటంలో పెరగుకు మించిందిలేదు.

పెరుగు నిమ్మరసం

పెరుగు నిమ్మరసం

పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు, చేతులకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతంగా అవుతుంది.

పెరుగు-ఉప్మా రవ్వ:

పెరుగు-ఉప్మా రవ్వ:

పెరుగు-ఉప్మా రవ్వ: పెరుగులో కొద్దిగా పంచదార కానీ లేదా ఉప్మారవ్వగానీ వేసి బాగా కలిపి, ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

శనగపిండి-పెరుగు:

శనగపిండి-పెరుగు:

శనగపిండి-పెరుగు: పెరుగులో శనగపిండి కలిపి నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే చర్మం, ముఖం మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి.

ముల్తానీ మట్టి-పెరుగు:

ముల్తానీ మట్టి-పెరుగు:

ముల్తానీ మట్టి-పెరుగు: ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే మంచి క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.

 పంచదార-పెరుగు:

పంచదార-పెరుగు:

పంచదార-పెరుగు: 5 టీ ప్పూన్లు పెరుగులో ఒక టీస్పూన్ పసుపు, మరో టీస్పూన్ చక్కెర కలిపి ముఖానికి పట్టిస్తే ఎండ ప్రభావంతో దెబ్బతిన్న చర్మం ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తొలిగిపోతాయి.

ఐస్ క్యూబ్స్ :

ఐస్ క్యూబ్స్ :

ఐస్ క్యూబ్స్ : ఎండలో తిరిగి బయటి నుండి ఇంటికి తిరిగి రాగానే ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది.

నిమ్మరసం-పెరుగు-గోధుమ పిండి:

నిమ్మరసం-పెరుగు-గోధుమ పిండి:

నిమ్మరసం-పెరుగు-గోధుమ పిండి: రెండు స్సూన్ల పెరుగులో ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూను గోధుమ పిండి కలిపి మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చెమట పొక్కులు పోయి మొహం తేటగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు గోధుమపిండి బదులు శెనగపిండి కలుపుకోవాలి.

 టమోటో-పెరుగు:

టమోటో-పెరుగు:

టమోటో-పెరుగు: ఎండవల్ల చర్మం కమిలిపోయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల టమోటారసంలో ఒక టేబుల్ స్పూను పెరుగు కలిపి మొహానికి, చేతులకు పట్టించి పావుగంట తర్వాత చల్లటినీటితో కడగాలి. ఎర్రబడిన చర్మం చల్లబడి మెత్తగా ఉంటుంది.

కేశ సౌందర్యానికి పెరుగు:

కేశ సౌందర్యానికి పెరుగు:

కేశ సౌందర్యానికి పెరుగు: పెరుగుతో శరీరంపై మర్దనా చేయడంవల్ల మంచి కాంతి, తెలుపు వస్తుంది. అలాగే కేశాలు(వ్రెంటుకల)రక్షణకు పెరుగును వాడుతారు. పెరుగును తలకు పట్టించి, గంట తరువాత తలస్నానం చేయడం వల్ల కేశాలు నిగనిగలాడడమే కాకుండా ఒత్తుగా మారుతాయి. ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు తొలగి, జుట్టు అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

వేసవి ఆరోగ్యానికి పెరుగు

వేసవి ఆరోగ్యానికి పెరుగు

ఎండాకాలంలో పెరుగు తినటం వలన మంచి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపులో మంటను అరికడుతుంది. పెరుగు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం దృఢత్వాన్ని, బలాన్ని సంతరించుకుంటుంది. బలమైన, చక్కని ఆరోగ్యానికి పెరుగు దివ్యమైనది. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పెరుగు అమోఘంగా చర్మాన్ని శుభ్రపరుస్తుంది కాబట్టి సౌందర్య పోషకులు చాలామంది దీన్ని అందాన్ని పెంచేందుకు సౌందర్య వర్ధినిగా వాడుతారు. ఎండదెబ్బతిని వాడిపోయిన చర్మానికి సహజ కాంతిని కలిగిస్తుంది.

Story first published: Wednesday, May 14, 2014, 12:05 [IST]
Desktop Bottom Promotion