For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకుకూర జ్యూస్ : ప్రకాశించే, కాంతివంతమైన చర్మం

|

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత ఆరోగ్యకరమో అందరికీ తెలిసిన విషయమే. ఆకుకూరలు మన శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ మరియు ఐరన్ వంటివి పోషకాంశలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంను ఆరోగ్యంగా మార్చడం మాత్రమే కాదు, ఇది మీ చర్మం ఆరోగ్యంగా కనబడుటకు కూడా సహాయపడుతుంది.

ఉడికించిన ఆకుకూరల్లో కెరోటినాయిడ్స్, అమినో యాసిడ్స్, పొటాషియం, మరియు ఐయోడిన్ మరియు విటమిన్ ఎ, కె, సి మరియు బి కాంప్లెక్స్ లు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో కనుగొన్న ఈ ఆల్కలైన్ మినిరల్స్ మన శరీరంలో పిహెచ్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మాంసాహారంలో లోని ప్రోటీలను, ఆకుకూరలను తీసుకోవడం వల్ల మీ శరీరం అదే స్థాయిలో ప్రోటీనులను గ్రహిస్తుంది. ప్రోటీనులు వివిధ మార్గాల్లో నిల్వ ఉన్నాయి. అది జీవితానికి చాలా అవసరం.

కాబట్టి, ఉడికించిన మరియు ఉడికించని ఆకు కూరలు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకుకూరల గురించి మరో వెర్షన్ ఏమిటంటే, అది మీ చర్మం మరియు శరీరంను కాంతివంతంగా మార్చుతుంది. ఆకుకూరలతో తయారుచేసిన జ్యూస్ వివిధ రకాలుగా మీకు మరియు మీశరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. మరియు ఆరోగ్యప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇది మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ను నివారించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుకూరల జ్యూస్ తో చర్మానికి కొన్ని మంచి ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

మొటిమల నివారణకు మంచి చికిత్స వంటింది:

మొటిమల నివారణకు మంచి చికిత్స వంటింది:

ఆకుకూరల జ్యూస్ మొటిమల నివారణకు ఒక ఉత్తమ పరిష్కారం. ఇది మీలో మొటిమల సమస్యను నివారిస్తుంది. దాంతో చర్మం క్లియర్ గా ఉంటుంది. పచ్చికూరాకును మొత్తగా పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. 15-20నిముషాలు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ చర్మంలో మురికి, జిడ్డు, నూనెను తొలగించి, క్లియర్ స్కిన్ ఇస్తుంది. చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఆకుకూరల జ్యూస్ ను త్రాగడం కూడా, మొటిమల నివారణకు ఒక మంచి మార్గం. ఆకుకూరల జ్యూస్ కు టమోటో, క్యారెట్, కీరదోస మరియు రెడ్ పెప్పర్ వంటివి జోడించి జ్యూస్ చేసి తీసుకోవచ్చు.

యాంటీ ఏజింగ్:

యాంటీ ఏజింగ్:

ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని రాడికల్స్ ను తొలగిస్తాయి. ప్రీరాడికల్స్ వల్ల చిన్న వయస్సులోనే వయస్సైన వారిలా కనిపించేలా మీ చర్మాన్ని అలా మార్చి వేస్తాయి. ఆకుకూరల జ్యూస్ ఇది నివారించి వ్రుద్దాప్య ఛాయలను ధరిచేరనివ్వకుండా చేస్తుంది. అలాగే ఇది ప్రకాశించే కాంతివంతమైన యంగ్ స్కిన్ అంధిస్తుంది.

టానింగ్ నుండి రక్షణ కల్పిస్తుంది:

టానింగ్ నుండి రక్షణ కల్పిస్తుంది:

ఇది చర్మానికి మరో ప్రయోజనం. ఆకుకూరల్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ బికాంప్లెక్స్ టానింగ్ ను నివారిస్తుంది మరియు సూర్యరశ్మినుండి మీ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి, మీరు ఆకుకూరల జ్యూస్ ను తీసుకుంటే, చర్మానికి టానింగ్ నుండి రక్షణ కల్పించవచ్చు.

కాంప్లెక్షన్ బెనిఫిట్స్:

కాంప్లెక్షన్ బెనిఫిట్స్:

ఆకుకూరల్లో విటమిన్ కె మరియు ఫొల్లేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది క్లియర్ స్కిన్ అంధివ్వడానికి సహాయపడుతుంది. అది మొటిమలు లేని చర్మాన్ని అందిస్తుంది . ఇది డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. మీరు డ్రై మరియు ఇచ్చి స్కిన్ కలిగి ఉన్నట్లైతే ఆకుకూరలు ఈ సమస్య నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అలాగే ఇది అద్భుతమైన కాంప్లెక్షన్ ను అంధిస్తాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ఆకుకూరల జ్యూస్ ను చేర్చుకోండి.

చర్మానికి ఉత్తమ మర్మత్తు చేస్తుంది:

చర్మానికి ఉత్తమ మర్మత్తు చేస్తుంది:

ఆకుకూరల్లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఎ చర్మ కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది మరియు విటమిన్ సి స్కిన్ సెల్స్ ఆరోగ్యానికి సహాయపడుతుంది . మీకు ప్రకాశించే, కాంతివంతమైన చర్మం పొందాలని కోరుకుంటే, ఆకుకూరల జ్యూస్ ను తీసుకోవాలి.

English summary

Will Spinach Juice Give You Glowing Skin?

Remember Popeye? He used to claim that there is nothing like spinach in the whole world. Give him spinach and he would instantly sprout muscles to save his lady love! But, then he was not wrong.
Desktop Bottom Promotion