For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే బట్టర్ ఫేస్ ప్యాక్

|

బట్టర్ స్నాక్స్ మరియు జంక్ ఫుడ్ మరియు వంటలకు ఉపయోగించే బట్టర్ వంటలకు ఎంత అద్భుతమైన రుచిని అందిస్తుందో అందరికి తెలిసిన విషయమే. బటర్ ను బ్రెడ్ కు అప్లై చేసి తీసుకోవడం మాత్రమే కాదు, అదే బటర్ ను చర్మానికి అప్లై చేస్తే తక్షణం చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది . బటర్ ను మీరు బ్యూటీ ప్యాక్ లలో ఉపయోగించినప్పుడు మీరు చూసే ఫలితం మీకు ఆశ్చర్యం కలిగించబచ్చు. ఆయిల్ స్కిన్ నివారించడంలో ఇది చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. అలాగే డ్రై స్కిన్ నివారించడంలో ఇది ఒక నేచురల్ హోం రెమెడీ .

బటర్ ను మీ చర్మానికి అప్లై చేసినప్పుడు, బటర్ తో పాటు మరికొన్ని పదార్థాలను కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బటర్ ను చర్మానికి ఉపయోగించడం వల్ల మొదట మీ చర్మం జిడ్డుగా అనిపిస్తుంది. అయితే కేవలం బటర్ ను మాత్రమే అప్లై చేయకుండా...బటర్ తో పాటు ఇత పదార్థాలను కూడా మిక్స్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు గమనించవచ్చు.

చర్మ సమస్యలను నివారించడంలో ఇది ఒక నేచురల్ హోం ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. అయితే బటర్ ను మీరు బ్యూటీ ప్రొడక్ట్ గా చర్మానికి అప్లై చేయడానికి ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయాలి. మరి ఈ బటర్ తో ఫేస్ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో చూద్దాం...

బటర్ -ఆలివ్ ఆయిల్:

బటర్ -ఆలివ్ ఆయిల్:

ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ తీసుకొని అందులో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ స్టెంట్ గ్లో మెరుగుపరుస్తుంది.

బటర్ -పాలు:

బటర్ -పాలు:

ఆయిల్ స్కిన్ కు ఉత్తమ ఫేస్ ప్యాక్ బటర్ ఫేస్ ప్యాక్ ఒక బౌల్ మిల్క్ లో కొద్ది బటర్ మిక్స్ చేసి , ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బటర్ -క్రీమ్:

బటర్ -క్రీమ్:

బటర్ ను ఫ్రెష్ క్రీమ్ తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడ వల్ల ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది. ఇలా వారానికి ఒకసారి ముఖాని అప్లై చేసి మసాజ్ చేస్తే ముఖంలో మంచి గ్లో వస్తుంది.

పెరుగు:

పెరుగు:

బటర్ ను ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ కు వేసుకోవడం వల్ల డ్రై స్కిన్ నివారిస్తుంది.

బట్టర్ -కొబ్బరి నూనె:

బట్టర్ -కొబ్బరి నూనె:

కొద్దిగా కొబ్బరి నూనెతీసుకొని అందులో 2 చెంచాలా బటర్ ను మిక్స్ చేయాలి. తర్వాత ఫేస్ కు ప్యాక్ గా వేసుకొని కాటన్ తో తురడి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 బటర్ మరియు బాదం:

బటర్ మరియు బాదం:

గుప్పెడు బాదంను పొడి, చేసి అందులో 3టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. కొద్ది సమయంలోనే ప్రకాశవంతమైన చర్మఛాయను మీరు పొందవచ్చు.

 క్యారెట్ అండ్ బటర్:

క్యారెట్ అండ్ బటర్:

క్యారెట్ ను తీసుకొని మెత్తగా తురుమాలి. అందులోని రసం పిండుకొని దీన్ని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించాలి. అంతే మీకు తక్షణ చర్మ సౌందర్యంను అందిస్తుంది.

బటర్ -ఉప్పు:

బటర్ -ఉప్పు:

బట్టర్ లో రెండు మూడు చెంచాలా ఉప్పు చేర్చి బాగా మిక్స చేసి ముఖానికి పట్టించి బాగా స్ర్కబ్ చేయాలి . ఇది ఒక గ్రేట్ ఫేస్ ప్యాక్ లా పనిచేస్తుంది. ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

బటర్ మరియు బొప్పాయి:

బటర్ మరియు బొప్పాయి:

బొప్పాయిను గుజ్జులా చేసి అందులో రెండు చెంచాలా బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి ఎండిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

బటర్ మరియు బిట్టర్ పల్ప్:

బటర్ మరియు బిట్టర్ పల్ప్:

కాకరకాయ రసానికి కొద్దిగా బటర్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆయిల్ స్కిన్ నివారిస్తుంది.

Desktop Bottom Promotion