For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖ సౌందర్యానికి టమోటో రసాన్ని ఎలా ఉపయోగించాలి..

|

భారతీయ వంటకాల్లో తప్పనిసరి టమోటోలు. జ్యూసీ గా ఉండే ఎర్రని టమోటోలు చూడగానే నోరూరిస్తూ వెంటనే తినేయాలనిపిస్తుంది. మన వంటగదిలో ఉండే ఈ ఎర్రని జ్యూసీ వెజిటేబుల్ టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా పెంచే ఒక అద్భుతమైన సౌందర్య రాశి. టమోటోలోని సౌందర్య ప్రయోజనాలు కొన్ని మనకు తెలిసినవే. టమోటోల్లో లైకోపిన్ దీన్ని మనం యాంటీఆక్సిడెంట్ గా భావిస్తాం. ఎర్రని టమోటోలో ఉండే లైకోపిన్ మన చర్మాన్నిశుభ్రపరచడంలో మరియు మెరిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మరియు ఇది సూర్యరశ్మి నుండి వెలువడే హానికరమైన రేడియన్స్ ను చర్మానికి తగలకుండా చేస్తుంది.

టమోటోలోని అద్భుతమైన సౌందర్య గుణగణాలు ఏంటంటే ముడుతలు ఏర్పడకుండా వ్యతిరేకంగా పనిచేస్తుంది, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది మొటిమలు రాకుండా నివారిస్తుంది మరియు వృద్ధాప్యం లక్షణాలు రాకుండా చర్మానికి రక్షణ కల్పిస్తుంది. టమోటో రసంను ముఖానికి అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉంచితే, ఈ పవర్ ఫుల్ రెడ్ ఫ్రూట్ వల్ల ప్రతి రోజూ ఉదయం 200గ్రాముల ఉడికించిన టమోటోను తీసుకుంటే మీరు అన్ని వేళల యవ్వనంగా కనబడేలా నిర్ధారిస్తుంది. ఇది అద్భుతమైనది మాత్రమే కాదు?టమోటోలోని లైకోపిన్ కంటెంట్ చర్మక్యాన్సర్ ప్రమాదాన్నికలగనివ్వకుండా పోరాడటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి ఈ ఎర్రని టమోటో పండులోని అద్భుతమైన బ్యూటీ ప్రయోజనాలు పరిశీలించి, ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకొని మీలోని అన్నిరకాల చర్మ సమస్యలకు గుడ్ బై చెప్పండి...

1. గ్లోయింగ్ స్కిన్:

1. గ్లోయింగ్ స్కిన్:

ముఖానికి టమోటో జ్యూస్ అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు టమోటోను మద్యకు కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగి మార్పును గమనించండి.

2. మొటిమలు నివారణకు:

2. మొటిమలు నివారణకు:

టమోటో జ్యూస్ మెటిమలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతు. అందుకు ముందుగా ఐస్ క్యూబ్ తో ముఖం మీద మర్దన చేయాలి. 15నిముషాల తర్వాత టమోటో ముక్కలతో ముఖం మీద మర్దన చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇలా మొటిమలను కనబడకుండా మాయం అయ్యే వరకూ పూర్తిగా చేయాలి.

3. కాలిన గాయాలను మాన్పుతుంది:

3. కాలిన గాయాలను మాన్పుతుంది:

చర్మ సమస్యల్లో మరొకటి, కాలిన గాయాలను మాన్పుతుంది. టమోటో లేదా టమోటో రసాన్ని కాలిన గాయాల మీద అప్లై చేసినప్పుడు కాలిన గాయాలను మాన్పుతుంది.

4. చర్మంను మెరిసేలా చేస్తుంది :

4. చర్మంను మెరిసేలా చేస్తుంది :

చర్మం మీద ఏర్పడ మచ్చలు, చారలు తొలగించి చర్మం కాంతివంతగా కనబడేలా చేస్తుంది. అందుకు టమోటో రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తుండాలి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. కాంతివంతంగా మార్చుతుంది:

5. కాంతివంతంగా మార్చుతుంది:

టమోటో జ్యూస్ తో డార్క్ స్కిన్ నివారించుకోవచ్చు. ఒక బౌల్లో, టమోటో జ్యూస్ ను తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం మరియు బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. 10నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

6. చర్మం రంద్రాలు:

6. చర్మం రంద్రాలు:

టమోటోజ్యూస్ వల్ల మరో ఎఫెక్టివ్ బెనిఫిట్ , చర్మ రంద్రాలు ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇది ఒక నేచురల్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది మరియు చర్మ రంద్రాలు లేకుండా స్వచ్చంగా కనబడేలా చేస్తుంది.

7. జిడ్డును నివారిస్తుందిం

7. జిడ్డును నివారిస్తుందిం

టమోటోలో ఉండే అసిడ్ మరియు ఆస్ట్రిజెంట్స్ ముఖంలో జిడ్డును నివారిస్తుంది . చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిస్తుంది. టమోటోను రెండుగా కట్ చేసి గుజ్జును ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

8. చర్మంను శుభ్రం చేస్తుంది:

8. చర్మంను శుభ్రం చేస్తుంది:

టమోటో జ్యూస్ చాలా స్ట్రాంగ్ . ఇది మీకు ఒక ఇన్ స్టాంట్ లుక్ ను అందిస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. టమోటోను పంచదారలో డిప్ చేయాలి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.

9. బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

9. బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

టమోటో జ్యూస్ ను మీ ముఖం మీద అప్లై చేసి శుభ్రం చేసుకోవడం ద్వారా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. టమోటో రసంలో కొద్దిగా వాల్ నట్ పౌడర్ మిక్స్ చేసి అప్లై చేయడం ద్వారా బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా నివారిస్తుంది.

10. చర్మంను తేమగా ఉంచుతుంది:

10. చర్మంను తేమగా ఉంచుతుంది:

టమోటో జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం తేమగా ఉంచతుంది. టమోటో జ్యూస్ ను అప్లై చేసి కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

10 Ways To Use Tomato Juice On Face

Out of all the kitchen ingredients in your home tomato is one of the best you can use to remove all kinds of skin problems. The juice of the tomato is so strong that it has the ability to remove a dark skin tan and to also deaden the unwanted hair.
Story first published: Thursday, February 26, 2015, 12:37 [IST]
Desktop Bottom Promotion