For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛామన ఛాయ యొక్క చర్మ సౌందర్యాన్ని పెంచే నిమ్మరసం

|

మన ఇండియన్స్ కు ఆరోగ్య పరంగా మరియు సౌందర్యం పరంగా నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇండియన్ బ్యూటీ టిప్స్ లో నిమ్మరసం చాలా ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఎవరైతే డస్కీ స్కిన్(చామన ఛాయ)ను కలిగి ఉంటారో వారు, నిమ్మరసంను ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మార్చుకోవచ్చు. నిమ్మరసం ఒక స్టాండర్డ్ బ్లీచింగ్ ఏజంట్ . దీన్ని సున్నితమైన చర్మం మీద సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.

అయితే, డ్రై స్కిన్ ఉన్నవారు, నిమ్మరసంను చర్మ సంరక్షణకు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే సిట్రస్ యాసిడ్ చర్మంను బర్న్ చేస్తుంది. నిమ్మరసం సన్ టాన్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది టమోటో కంటే నిమ్మరసం మరింత ఉత్తమమైనది కాబట్టి, మన ఇండియన్ బ్యూటీ టిప్స్ లో నిమ్మరసాన్ని సౌందర్యం మెరుగు పరుచుకోవడంలో విరివిగా ఉపయోగిస్తుంటారు.

READ MORE: పీరియడ్స్ సమయంలో చర్మం అందంగా కనబడాలంటే?

నిమ్మరసంకు మన ఇంట్లో ఉండే ఇతర పదార్థాలను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల ఇది మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మసౌందర్యం కోసం నిమ్మరసంను ఉపయోగించినప్పుడు చర్మ రంద్రాలు తెరచుకొని, శుభ్రం చేయడం వల్ల మొటమలు, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి . చర్మ సంరక్షణలో నిమ్మరసంను ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటే...కొన్నినేచురల్ మరియు సురక్షితమైన సులభ మార్గాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.....

నిమ్మరసం మరియు తేనె

నిమ్మరసం మరియు తేనె

నిమ్మరసంకరు కొద్దిగా తేనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి నేచురల్ గ్లో మరియు సాఫ్ట్ నెస్ ను అందిస్తుంది .

లెమన్ మరియు టమోటో

లెమన్ మరియు టమోటో

రెండు బ్లీచింగ్ ఏజెంట్స్ ను ఉపయోగించడం వల్ల సమస్య నివారించబడుతుంది. టమోటో రసంలో ఒక నిమ్మపండు యొక్క రసాన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి కొద్దిసేటి తర్వాత శుభ్రం చేసుకవోాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఈ చిట్కాకు దూరంగా ఉండాలి.

నిమ్మరసం మరియు పెరుగు

నిమ్మరసం మరియు పెరుగు

పెరుగు మరో బ్లీచింగ్ ఏజెంట్, మరియు మన్నికైనది. మీ స్కిన్ టోన్ మెరుగుపరుచుకోవాలన్నా లేదా చర్మంను తెల్లగా మార్చుకోవాలన్నా, ఈ ఫర్ఫెక్ట్ కాంబినేషన్ ను ఉపయోగించాలి.

నిమ్మ మరియు జామ

నిమ్మ మరియు జామ

జామకాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మరసంకు జామకాయ గుజ్జు మిక్స్ చేసి, దీన్ని ముఖానికి పట్టించాలి . 15నిముషాల తర్వాత కడిగేసుకుంటే ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది.

నిమ్మ మరియు గ్రీన్ టీ

నిమ్మ మరియు గ్రీన్ టీ

గ్రీన్ టీ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది . గ్రీన్ టీలో ఉన్న గుణాలు చర్మంను తెల్లగా మార్చుతుంది. ముఖం మీద ఛారలు లేకుండా నివారిస్తుంది . నిమ్మరసంను జోడించడం వల్ల ఇది ప్రొసెస్ ను మరింత వేగవంతం చేస్తుంది.

నిమ్మ మరియు చల్లటి నీరు

నిమ్మ మరియు చల్లటి నీరు

నిమ్మరసంలో కొద్దిగా చల్లని నీరు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . ఇది చర్మంలోని మొటిమలను సమస్యను నివారిస్తుంది. ఇది ఒక సురక్షితమైన హోం రెమెడీ .

నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్

నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్లో ఉండే లక్షనాలు చర్మానికి చాలా మేలు చేస్తుంది . ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి ముఖానికి అప్లై చేయాలి . ఇది ముఖం మీద ఏర్పడ మొటిమలతాలుకు మచ్చలు నివారించబడుతాయి. మరియు ఇది ముడతల యొక్క లైన్స్ ను కూడా నివారిస్తుంది.

నిమ్మరసం మరియు ఓడ్కా

నిమ్మరసం మరియు ఓడ్కా

మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి నిమ్మరసం మరియు ఓడ్కాను ఉపయోగించుకోచ్చు . ఒక నిమ్మకాయ యొక్క రసంలో ఒక చెంచా వోడ్కాను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి.

ఛామన ఛాయ యొక్క చర్మ సౌందర్యాన్ని పెంచే నిమ్మరసం

ఛామన ఛాయ యొక్క చర్మ సౌందర్యాన్ని పెంచే నిమ్మరసం

నిమ్మరసం మరియు బాదం ఆయిల్ చర్మం తెల్లగా మార్చుకోవడానికి బాదం ఆయిల్ మరియు నిమ్మరసంను విరివిగా ఉపయోగించాలి. స్కిన్ వైట్ గా మార్చుకోవడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ మార్గం. ఎందుకంటే, బాదం ఆయిల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది . ఇది చర్మంను సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ఉంచుతుంది.

నిమ్మరసం మరియు ఓట్ మీల్

నిమ్మరసం మరియు ఓట్ మీల్

డ్రై స్కిన్ మరియు బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో ఓట్ మీల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంకు ఒక ఫర్ఫెక్ట్ గ్లో అందిస్తుంది. నిమ్మరసంతో ఇది ఒక అద్భుత హోం రెమెడీ.

నిమ్మరసం మరియు కొబ్బరి నూనె

నిమ్మరసం మరియు కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను చర్మానికి ఉపయోగిస్తే ఇది ఒక పాజిటీవ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. కొబ్బరి నూనె చర్మంను సాఫ్ట్ గా మరియు తేమగా మార్చడంతో పాటు మార్క్స్ అండ్ స్కార్స్ ను తేలికగా మార్చేస్తుంది.

నిమ్మ మరియు టీ ట్రీ ఆయిల్

నిమ్మ మరియు టీ ట్రీ ఆయిల్

ఉదయం నిద్రలేవగానే నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేయాలి. టీట్రీ ఆయిల్లో నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మరియు మెడకు అప్లై చేయడం వల్ల మెడ మీద మరియు చర్మం మీద ఉండే డార్క్ లైన్స్ తొలగిపోతాయి .

English summary

12 Ways To Use Lemon For Your Skin

Lemon beauty tips in India. Lemon is one of the basic ingredients which is loved by all women in India. Those who are blessed with dusky skin should use lemon to improve their tone. Lemon is a standard bleaching agent which can be safely used on sensitive skin.
Desktop Bottom Promotion