For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ ఛర్మ ఛాయను ఫెయిర్ గా మార్చే నేచురల్ ఫేస్ ప్యాక్స్

|

రాత్రికి రాత్రే అందంగా ఫెయిర్ గా మారిపోతే ఎలా ఉంటుంది? అనుకొనే మహిళలు కూడా చాలా మందే ఉంటారు. అయితే ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇది సాధ్యంకాకపోవచ్చు . ఆయిల్ స్కిన్ కలవారిలో మీరు ఒకరైతే, కొన్ని ఫెయిర్ నెస్ ఫేస్ ప్యాక్ లు మనం ఇంట్లోనే నేచురల్ గా తయారుచేసుకొని ప్రయత్నించవచ్చు. హెల్తీ ఫ్రూట్స్ మరియు ఇతర వంటిగది పదార్థాలతో హోం మేడ్ ఫేస్ ప్యాకులను తయారుచేసుకోవచ్చు . ఈ హోం మేడ్ ఫెయిర్ నెస్ క్రీమ్ లను ఉపయోగించడం వల్ల ఇవి ఖచ్చితంగా మీ యొక్క స్కిన్ టోన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించుకోవడానికి ముందు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం. ముఖంలో ఎక్సెస్ ఆయిల్ ను కాటన్ తీసుకొని పూర్తిగా శుభ్రంగా తొలగించుకోవాలి. ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల ముఖం మీద ఫేస్ ప్యాక్ ఎక్కువ సమయం ఉండటానికి సమాయపడుతుంది. అలాగే కొంత మంది బ్యూటీషియన్స్ అభిప్రాయం ప్రకారం మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్స్ లో డైరీ ప్రొడక్ట్స్ (పాలు, పెరుగు, చీజ్) ను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఫేస్ ప్యాక్స్ ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల ముఖం మరింత ఆయిలీగా తయారవుతుంది.

ఈ ఫెయిర్ నెస్ ఫేస్ ప్యాక్స్ రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ విటమిన్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా క్లియర్ గా మార్చుతుంది. ఆయిల్ స్కిన్ కోసం కొన్ని బెస్ట్ ఫెయిర్ నెస్ ఫేస్ క్రీమ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బొప్పాయి ఫేస్ ప్యాక్ :

బొప్పాయి ఫేస్ ప్యాక్ :

స్కిన్ టోన్ మెరుగు పరచడంలో చాలా గ్రేట్ ఫేస్ ప్యాక్ ఇది. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ కోసం కొద్దిగా పెరుగు మిక్స్ చేసుకోవాలి.

నిమ్మరసంతో ఫేస్ ప్యాక్ :

నిమ్మరసంతో ఫేస్ ప్యాక్ :

నిమ్మరసం రెండో బ్లీచింగ్ ఫెయిర్ నెస్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల మీ స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది.

 ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్:

ఇండియన్ స్కిన్ వారికి ఓట్ మీల్ ఒక మంచి ఫేస్ ప్యాక్ . ఈ ఫేస్ ప్యాక్ మీరు ముఖానికి అప్లై చేస్తే ముఖంలో డెడ్ స్కిన్ తొలగిపోవడంతో పాటు, చర్మం ఫేయిర్ గా మారుతుంది.

బంగాళదుంప గుజ్జుతో ఫేస్ ప్యాక్:

బంగాళదుంప గుజ్జుతో ఫేస్ ప్యాక్:

మధ్యాహ్నా సమయంలో బంగాళదుంప ఒక మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇండియన్ స్కిన్ కు బంగాళదుంప పేస్ట్ ఫెయిర్ నెస్ ఫేస్ ప్యాక్ . అలాగే మొటిమల యొక్క మచ్చలను నివారించడంలో ఇది ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ ఫేస్ ప్యాక్.

టమోటో పేస్ట్:

టమోటో పేస్ట్:

టమోటో పేస్ట్ ను మీ ముఖ్యానికి ప్యాక్ లా అప్లై చేయడ వల్ల , ఫేసియల్ హెయిర్ తేలికపరుస్తుంది. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు కొద్దిగా నిమ్మరసం ఉపయోగించి అప్లై చేయాలి.

బాదం ఫేస్ ప్యాక్:

బాదం ఫేస్ ప్యాక్:

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ుంటుంది. ఇది చర్మానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . నీళ్ళలో రాత్రంతా నానబెట్టి, ఉదయం మిక్సీలో వేసి కొద్దిగా పాలు వేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. క్రమంగా ఫెయిర్ స్కిన్ పొందవచ్చు.

 శెనగపిండి:

శెనగపిండి:

శెనగపిండి మరో ఫెస్ ప్యాక్. మీరు ఒక వారంలో ఫెయిర్ గా కనిపించాలని కోరుకుంటున్నట్లైతే మీరు శెనగపిండితో ప్యాక్ ను వారం రోజులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. శెనగపిండిని ఫేస్ ప్యాక్ గా ఉపయోగించేటప్పుడు, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేయాలి.

పుదీనా ఫేస్ ప్యాక్:

పుదీనా ఫేస్ ప్యాక్:

పుదీనా ఆకలు మీ చర్మాన్ని కూల్ గా మార్చుతుంది. పుదీనాను ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల ఇది చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది. దాంతో చర్మఛాయాలో మార్పు తీసుకొస్తుంది.

అరటి ఫేస్ ప్యాక్:

అరటి ఫేస్ ప్యాక్:

రెండు అరటిపండ్ల ఉడకించి, పొట్టు తీసి, అరటిపండు గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మేత్తగా పేస్ట్ లా చేయాలి . ఈ గుజ్జుకు కొద్దిగా క్రీమ్ అప్లై చేసి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గంధం ఫేస్ ప్యాక్:

గంధం ఫేస్ ప్యాక్:

అన్ని రకాల ఇండియన్ స్కిన్స్ కు గంధం ఫేస్ ప్యాక్ బాగా నప్పుతుంది. గంధంకు కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ఫెయిర్ గా మారుతుంది.

ఎగ్ ఫేస్ ప్యాక్:

ఎగ్ ఫేస్ ప్యాక్:

గుడ్డు మరో బ్యూటీఫుల్ హోం మేడ్ పదార్థం. ఇందులో ప్రోటీనులు అధికంగా ఉండటం వల్ల, చర్మాన్ని చాలా అద్భుతంగా మార్చుతుంది. ఫ్లేవ్ లెస్ స్ట్రక్చర్ ను అందిస్తుంది.

క్యారెట్ ఫేస్ ప్యాక్:

క్యారెట్ ఫేస్ ప్యాక్:

రెండు క్యారెట్స్ ను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు వేసి, రెండింటిని బాగా మిక్స్ చేసి తర్వాత అప్లై చేయాలి. ఈ ఫెయిర్ నెస్ ఫేస్ ప్యాక్ స్కిన్ కంప్లెక్సన్ ను మెరుగుపరుస్తుంది.

కోకనట్ ఫేస్ ప్యాక్:

కోకనట్ ఫేస్ ప్యాక్:

కోకనట్ ఒక ఉత్తమ హోం రెమెడీ, మన ఇండియన్ స్కిన్ టోన్ కు చాలా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది . ఈ హోం మేడ్ ఫెయిర్ నెస్ క్రీమ్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల ముఖానికి మంచి ఛర్మరంగును అందిస్తుంది. మరియు చర్మంను సాఫ్ట్ గా మార్చుతుంది.

English summary

13 Fair Face Packs For Indian Skin

Do you want to become fair overnight but your oily face doesn't allow it? If yes, then we have a handful of fair face packs for oily skin you can now try at home. With the combination of healthy fruits and other kitchen ingredients, using these homemade fairness face packs can actually help to improve your skin tone.
Desktop Bottom Promotion