For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజ పద్దతుల్లో ఆయిల్ స్కిన్ నివారించడానికి 13 మార్గాలు

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కొంటున్నారు . చర్మం ఆయిల్ అధికంగా ఉన్నప్పుడు, మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్, మరియు ఇతర చర్మం సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. చర్మం అదనపు నూనెను ఉత్పత్తి చేయడానికి అనేక కారణాలున్నాయి. టీనేజర్స్ లో ఆయిల్ స్కిన్ ఏర్పడటానికి ప్రధాన కారణం హార్మోనుల్లో మార్పులు. అదేవిధంగా వేడి, అధికంగా స్మోక్ చేయడం, ప్రెగ్నెన్సీ, మోనాపాజ్ మొదలగునవి ఆయిల్ స్కిన్ కు ప్రధాన కారణాలు.

కారణం ఏదైనప్పటికి, ఆయిల్ స్కిన్ ఒక చిరాకు తెప్పించే ఒక బాధాకరమైన సమస్య. అయితే ఆయిల్ స్కిన్ వల్ల మరో ఉపయోగం కూడా ఉన్నది, చర్మం ముడుతలు పడదు, వయస్సును తెలియనివ్వదు. అయితే ఎక్కవుగా ఆయిల్ స్కిన్ ఉన్నవారిలో చర్మం మీద మొటిమలు మొదలుకొని, చర్మ రంధ్రాల వరకూ మరియు చర్మానికి మేకప్ ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి, మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, చర్మంలో అదనపు నూనెను సమర్థవంతంగా వదిలించుకోవడా చాలా అవసరం. ఆయిల్ స్కిన్ వదలించుకోవడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. అయితే సమస్యను నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అందుకు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు . ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ హోం రెమడీస్...

1. నీళ్ళు:

1. నీళ్ళు:

వేడినీళ్ళు చర్మాన్ని డ్రైగా మార్చుతుంది. కాబట్టి, మీ చర్మంను వేడి నీళ్ళ లేదో గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . దాంతో చర్మంలోని అదనపు నూనెను నివారించుకోవచ్చు.

2. టమోటో:

2. టమోటో:

టమోటోలు నేచురల్ ఆస్ట్రిజెంట్. కాబట్టి, టమోటోను కట్ చేసి, ఆ ముక్కలతో ముఖం మరియు మెడ మీద మర్ధన చేయాలి . టమోటో రసంకు కొద్దిగే తేనె మిక్స్ చేసి మాస్క్ లా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు.

3. ఎసెన్షియల్ ఆయిల్స్:

3. ఎసెన్షియల్ ఆయిల్స్:

ఆయిల్ స్కిన్ నేచురల్ గా నివారించుకోవడం ఎలా? ల్యావెండర్ ఆయిల్ ను ఉపయోగించాలి. కొద్దిగా ల్యావెండర్ నూనెను స్పాంజ్ బాల్స్ మీద పోసి, ఆ కాటన్ బాల్స్ తో ముఖం అంతా మర్దన చేసుకోవాలి.

4. కీరదోసకాయ:

4. కీరదోసకాయ:

కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి, ఆ ముక్కలతో ముఖం మీద మర్ధన చేయాలి. కీరదోసకాయ రసానికి నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి . ముఖానికి అప్లై చేసిన తర్వాత రాత్రంతా అలాగే ఉంచడం ల్ల మంచి ఫలితం పొందవచ్చు.

5. ఓట్స్ :

5. ఓట్స్ :

ఆయిల్ స్కిన్ నేచురల్ గా నివారించడానికి ఓట్స్ ఒక ఉత్తమ మార్గం. వేపనీళ్ళతో ప్యాక్ వేసుకోవాలి. ఓట్స్ అదనపు నూనెను నివారిస్తుంది. వేపనీళ్ళు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

6. ఆపిల్స్:

6. ఆపిల్స్:

స్కిన్ ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ఇంటి నివారణ చిట్కా. ఎందుకంటే ఇందులో యాంటీ సెప్టిక్ విలువలు కలిగి ఉంటాయి. మరియు మీ చర్మాన్ని చల్లగా ఉంచుతుంది . ఆపిల్ ను తురుమి ముఖం మీద అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

7. గుడ్డు:

7. గుడ్డు:

ఎగ్ వైట్ చర్మంలోని నూనెను కంట్రోల్ చేస్తుంది. ముఖం మీద ఎగ్ వైట్ ను వేసి ముఖం అంతా అప్లై చేయాలి. మీరు ఇంకా కొన్ని చుక్కల నిమ్మరసంను కూడా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

8. పాలు:

8. పాలు:

పాలు ఒక అద్భుతమైన నేచురల్ ఆయిల్ ఫ్రీ క్లెన్సర్. చల్లటి పాలలో కొద్దిగా కాటన్ డిప్ చేసి, దాంతో ముఖం మొత్తం అప్లై చేయాలి. ఇంకా పాలలో ఎసెన్షియల్ ఆయిల్స్(సాండిల్ వుడ్ లేదా ల్యావెండర్ ) ను కూడా మిక్స్ చేయవచ్చు .

9. నిమ్మరసం:

9. నిమ్మరసం:

ఆయిల్ స్కిన్ నేచురల్ గా తగ్గించుకోవడానికి నిమ్మరసం ఒక ఉత్తమ ఎంపిక . ఇది ఆయిల్ స్కిన్ ను నేచురల్ గానే తగ్గిస్తుంది . డిస్టిల్డ్ వాటర్ లో కొన్ని చుక్కలను నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

10. కలబంద:

10. కలబంద:

మొటిమలు మచ్చలు ఉన్న చర్మంకు ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీ. ఫ్రెష్ గా ఉండే ఆలోవెరాను కట్ చేసి ముఖాని అప్లై చేయాలి. ఇంకా కలబంద ఆకును బాయిల్ చేసి, తేనె చేర్చి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తు మంచి ఫలితం ఉంటుంది.

11. పెరుగు:

11. పెరుగు:

ఆయిల్ స్కిన్ నేచురల్ గా కంట్రోల్ చేయడానికి ఇది మరో ఉత్తమ మార్గం . పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలోని నేచురల్ గా షోషించబడి, చర్మంలోని తేనెను గ్రహింస్తుంది. కాబట్టి, పెరుగును ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత కడిగేసుకోవాలి.

12. తేనె:

12. తేనె:

చర్మ రంద్రాలను శుభ్రం చేయడానికి ఇది ఒక మంచి క్లెన్సర్ వంటింది మరియు ఎక్సెస్ ఆయిల్ ను కంట్రోల్ చేస్తుంది . ఫేస్ ప్యాక్ లలో తేనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో కూడా తేన అద్భుతంగా సహాయపడుతుంది.

13. మట్టి:

13. మట్టి:

ముల్తాని మట్టని తేనె, వెనగపిండిలో మరియు కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మంలోని అదనపు నూనెను గ్రహించుకోవడం మాత్రమే కాదు, మీ చర్మానికి కాంతివంతంగా మార్చుతుంది.

English summary

13 Ways to Reduce Oily Skin Naturally

Do you know oily skin gets less wrinkles than dry to normal skin? It hides your age better. However, oily skin leads to various problems such as acne, pimples, blackheads and whiteheads. Moreover, the greasy look hides your natural beauty.
Story first published: Monday, January 26, 2015, 14:06 [IST]
Desktop Bottom Promotion