For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యం కోసం బ్యూటీ ప్యాక్స్

By Super
|

సాంప్రదాయ భారతీయ వివాహ వేడుకలో ఎన్నో ఆచారాలున్నాయి. అటువంటి ఆచారాలలో హల్దీ సెరెమనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాబోయే వధువుకు వివిధ రకాల సహజసిద్ధమైన పదార్థాల కలయికతో పసుపుకు ప్రాధాన్యమిస్తూ తయారయిన అబ్టాన్ అనే ఫేస్ ప్యాక్ తో నలుగు పెడతారు.

వివాహ సందర్భంగా వధువు చర్మాన్ని కాంతివంతంగా తయారుచేయడానికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ట్యాన్ ను తొలగించి చర్మపు రంగుకు నిగారింపును తీసుకువస్తుంది. ఒక్కసారి ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తే చాలు ఎన్నో బెనిఫిట్స్ కనిపిస్తాయి. మరి ఇంత అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తే కలిగే లాభాలను ఊహించండి మరి.

కాబట్టి, హల్దీ సెరెమనీకి ముందుగానే చర్మాన్ని కాంతివంతంగా తీర్చిదిద్దుకునేందుకు సహజసిద్ధమైన పద్దతులను వివరిస్తున్నాము. మిలమిల మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడానికి ఈ పద్దతులను పాటించండి.

కాబోయే పెళ్ళికూతురుకి గంధం ఫేస్ ప్యాక్స్ ఇస్తుంది అమేజింగ్ లుక్

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్

ఓట్ మీల్ ఫేస్ ప్యాక్

మీ వివాహ వేడుకకు బేబీ సాఫ్ట్ చర్మంతో మీరు సిద్ధంగా ఉండడానికి ఈ పద్దతిని పాటించండి

ఇంగ్రీడియెంట్స్

ఓట్ మీల్

మసూర్ దాల్

రా రైస్

ఆల్మండ్స్

రోజ్ వాటర్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

ఒక కప్పు మసూర్ దాల్పా, పావు కప్పు బియ్యాన్ని, ఎనిమిది లేదా తొమ్మిది బాదమ్ లను విడివిడిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు, ఈ మూడు పొడులను ఒక కాపులో పోసి అరకప్పు ఓట్ మీల్ ను కలపండి. చిటికెడు పసుపును కూడా కలపండి. వీటిలో రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ ను తయారుచేయండి. మీ శరీరానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కాసేపు ఈ మిశ్రమం ఆరే వరకు ఉండాలి. పేస్ట్ ఒకసారి ఆరాక సున్నితంగా స్క్రబ్ చేయాలి. నార్మల్ వాటర్ తో కడిగేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్నవారు ఈ మిశ్రమంలో పాల మీగడను అప్లై చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మిల్క్ పౌడర్ అబ్టాన్

మిల్క్ పౌడర్ అబ్టాన్

డ్రై స్కిన్ కలిగిన వారికి ఉపయోగపడే అబ్టాన్

ఇంగ్రీడియెంట్స్

మిల్క్ పౌడర్

శనగపిండి

బాదం పొడి

పసుపు

పాల మీగడ

నిమ్మ రసం

రోజ్ వాటర్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

మిల్క్ పౌడర్, శనగ పిండి, బాదం పొడిని ఒక్కొక్కటీ రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. వీటన్నిటినీకి ఒక చిటికెడు పసుపును కలపాలి. ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ పాల మీగడ, నిమ్మరసం, కొన్ని చుక్కలు రోజ్ వాటర్ ను కలపాలి. కొన్ని ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ ను కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అలాగే మీ శరీరంపై సున్నితంగా అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. కొద్ది సేపటి తరువాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఈ నేచురల్ బ్యూటీ మిక్స్ ను కనీసం వారానికి మూడు సార్లు అప్లై చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

నట్టీ అబ్టాన్

నట్టీ అబ్టాన్

శీతాకాలంలో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఈ ప్యాక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం

ఇంగ్రీడియెంట్స్

బాదాం, జీడిపప్పు, పిస్తా

బియ్యం

ఎండిన నారింజ తొనలు

కుంకుమ పూవు

స్వీట్ ఆల్మండ్ ఆయిల్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

ఈ బ్యూటీ ప్యాక్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 15 బాదాం, జీడిపప్పు, పిస్తా పలుకులను గ్రైండ్ చేయండి. అలాగే, మరోపక్క పావు కప్పు అవిసె గింజలు, మసూర్ దాల్, ఎండిన నారింజ తొనలు, ఓట్స్ ను గ్రైండ్ చేయాలి. ఈ పొడిని ఒక పొడి బౌల్ లో వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు కుంకుమ పూవు అలాగే 10-12 స్వీట్ ఆల్మండ్ ఆయిల్ డ్రాప్స్ ను కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి తేనె, రోజ్ వాటర్ లతో థిక్ స్క్రబ్ ని తయారుచేసుకోవాలి. ఈ బ్యూటీ ప్యాక్ ని ముఖానికి అలాగే శరీరానికి పట్టిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

శనగపిండి, గోధుమ పొట్టు బ్యూటీ ప్యాక్

శనగపిండి, గోధుమ పొట్టు బ్యూటీ ప్యాక్

కాంతివంతమైన చర్మ సౌందర్యం కోసం ఈ బ్యూటీ ప్యాక్ ను ట్రై చేయండి

ఇంగ్రీడియెంట్స్

శనగపిండి

గోధుమ పొట్టు

పాల మీగడ లేదా పెరుగు

పసుపు

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

శనగపిండి, గోధుమ పొత్తు, పాల మీగడ లేదా పెరుగు, చిటికెడు పసుపును కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. వీటిని ఒక బౌల్ లో కొద్ది సేపు ఉంచాలి. ఈలోగా, నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి.

గంధంతో బ్యూటీ ప్యాక్

గంధంతో బ్యూటీ ప్యాక్

ట్యాన్ ను తొలగించి చర్మానికి కాంతిని అందించే గుణం ఇప్పుడు చెప్పుకోబోయే బ్యూటీ ప్యాక్ లో ఉంది. వేసవి కాలంలో ఈ పద్దతి కాబోయే వధువుకు ఎంతో ఉపయోగకరం. ఈ ప్యాక్ లో ఉండే గంధం, రోజ్ వాటర్ లు శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇచ్చి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి.

ఇంగ్రీడియెంట్స్

గంధం పొడి

శనగ పిండి

పసుపు

పచ్చి పాలు

రోజ్ వాటర్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

కాబోయే వధువుకు సహజసిద్ధమైన చర్మసౌందర్యానికి ఫేస్ ప్యాక్స్

గంధం పొడి, శనగపిండి, పసుపును కలపాలి. ఇందులో రోజ్ వాటర్, పచ్చి పాలను కలిపి స్మూత్ పేస్ట్ లా తయారు చేయాలి. పేస్ట్ మరీ థిక్ గా ఉండకూడదు. ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి అప్లై చేసి కాసేపాగి నార్మల్ వాటర్ తో కడగాలి.

బ్యూటీ ప్యాక్స్ ను తరచూ అప్లై చేయడం వల్ల సన్ ట్యాన్ నుంచి అలాగ్ అనీవన్ స్కిన్ టోన్ నుంచి చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. కాబోయే వధువుకు మెరిసే చర్మం సొంతమవుతుంది. కాబట్టి, లేడీస్, హల్దీ సెరెమనీ వరకు వెయిట్ చేయకుందే ఇప్పట్నుంచే ఈ బ్యూటీ ప్యాక్స్ ను తయారు చేసుకుని వాడి మెరుగైన చర్మాన్ని పొందండి.

English summary

5 Best Ubtans For Brides To Get Glowing Skin Naturally

There are a lot of rituals without which, a traditional Indian wedding is incomplete. And, one such ritual is the haldi ceremony. In this ceremony, the bride-to-be is anointed with ubtan, a face pack made of various natural ingredients.
Story first published: Wednesday, January 7, 2015, 10:43 [IST]
Desktop Bottom Promotion