For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో చర్మ సౌందర్యం మెరుగుపరిచేసే సిట్రస్ సాల్ట్ స్ర్కబ్స్

|

చర్మ సంరక్షణకు ఎక్స్ ఫ్లోయేషన్ చాలా మంచిది. కనీసం వారానికి రెండు సార్లు స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్స్ చాలా మేలు చేస్తాయి. నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్స్ వల్ల చర్మంకు చాల మేలు జరుగుతుంది. ముఖ్యంగా చర్మ సమస్యలు, స్కిన్ రాషెస్ మరియు కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల చర్మం మీద రాషెస్ వంటివన్నీ నివారించబడుతాయి.

READ MORE:వర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలు

ఈ సిట్రస్ సాల్ట్ స్క్రబ్స్ వర్షాకాలంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అంతే కాదు చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుతాయి. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. ఈ సిట్రస్ సాల్ట్ స్ర్కబ్స్ ను ఉపయోగించడం వల్ల ముఖం ఫ్రెష్ గా మరియు అందంగా మరియు సాప్ట్ గా కనబడుతుంది. చర్మం శుభ్రపరచడంలో సిట్రస్ సాల్ట్ స్ర్కబ్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది సన్ టాన్ ను చాల ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

READ MORE: వర్షాకాలంలో చర్మం కాంతివంతంగా, స్వచ్చంగా ఉంచే చిట్కాలు

అంతే కాదు, వర్షాకాలంలో వచ్చే మొటిమలను ఎఫెక్టివ్ గా నివారించడంలో సిట్రస్ సాల్ట్ స్ర్కబ్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. సిట్రస్ పండ్లలో ఉండే ఎసిడిక్ యాసిడ్ వల్ల మొటిమలు మరియు మచ్చలు తొలగింపబడుతాయి . కాబట్టి వర్షాకాలంలో మొటిమలను సమస్యను నివారించుకోవడానికి సిట్రస్ సాల్ట్ స్ర్కబ్స్ ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందండి...

లెమన్ సాల్ట్ స్ర్కబ్:

లెమన్ సాల్ట్ స్ర్కబ్:

రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు ఒక చెంచా ఉప్పు మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి ఈ సిట్రస్ స్క్రబ్ ను ముఖానికి పట్టించాలి. ఈ సింపుల్ సాల్ట్ స్ర్కబ్స్ టాన్ ను తొలగిస్తుంది మరియు డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. ఇలా ఒక నెలలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 లైమ్ సాల్ట్ స్ర్కబ్:

లైమ్ సాల్ట్ స్ర్కబ్:

ఫ్రెష్ లైమ్ నుండి తొక్క తొలగించి ఫ్రూట్ ను మిక్సీ జార్ లో వేసి మెత్గగా పేస్ట్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి ముఖానికి అప్లై చేసి తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లైమ్ స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది మరియు నెలలో రెండు సార్లు ఉపయోగిస్తే మచ్చలను తొలగిస్తుంది.

గ్రేప్ ఫ్రూట్:

గ్రేప్ ఫ్రూట్:

గ్రేట్ ఫ్రూట్ సాల్ట్ స్ర్కబ్ కోసం గ్రేప్ ఫ్రూట్ ను చిక్కగా పేస్ట్ చేసి అందులో మూడు చెంచాల సాల్ట్ మిక్స్ చేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ సిట్రస్ సాల్ట్ స్ర్కబ్ ఫేషియల్ హెయిర్ ను తొలగిస్తుంది బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది.

ఆరెంజ్ సాల్ట్ స్ర్కబ్:

ఆరెంజ్ సాల్ట్ స్ర్కబ్:

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక బౌల్లో ఆరెంజ్ ను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఉప్పు మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి . ఈ సిట్రస్ సాల్ట్ స్ర్కబ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొటిమలను రాత్రికి రాత్రే మాయం చేస్తుంది.

పైనాపిల్ సాల్ట్ స్ర్కబ్:

పైనాపిల్ సాల్ట్ స్ర్కబ్:

పైనాపిల్లో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఫ్రూట్ ను హెల్తీ సిట్రస్ సాల్ట్ స్ర్కబ్బర్ గా ఉపయోగిస్తుంటారు. పైనాపిల్ గుజ్జులో ఉప్పు మరియు తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఈ హెల్తీ స్ర్కబ్ ఆయిలీ స్కిన్ ను నివారిస్తుంది. అంతేకాదు దీన్ని వారానికొకసారి అప్లై చేయాలి.

మాద్రిన్ సాల్ట్ స్ర్కబ్:

మాద్రిన్ సాల్ట్ స్ర్కబ్:

మాద్రిన్ సాల్ట్ స్ర్కబ్ . ఇందులో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. మాద్రిన్ తో సిట్రస్ సాల్ట్ స్ర్కబ్ ను తయారచేయడం. ఈ పండును మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె మరియు ఉప్పు మిక్స్ చే ముఖానికి అప్లై చేయాలి. ఇది సన్ బర్న్, సన్ టాన్ నివారిస్తుంది .

English summary

6 Citrus Salt Scrubs For Monsoon: Beauty Tips in Telugu

These citrus salt scrubs are good for the monsoon season as it helps to keep your skin hydrated, removes the dead cells and even makes your face feel soft and beautiful. Citrus salt scrubs are highly beneficial for cleansing the skin surface too and due to the presence of lemon your sun tan will be removed naturally and at its own pace.
Story first published: Monday, June 29, 2015, 12:47 [IST]
Desktop Bottom Promotion