For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజ్ పెటల్స్(రోజా పువ్వు రేకుల)తో నేచురల్ బ్యూటీ బెనిఫిట్స్

|

అమ్మాయి ల అందాన్ని పెంచడంలో అన్నిటికంటే గులాబీ ముందు ఉంటుంది. అందమైన గులాబీపువ్వును చూసి మన ముఖం కూడా అంత సుకుమారంగా ఉంటే బాగుండునని అనుకోని అమ్మాయిలు ఉండరు. అలాంటి వారికోసమేనన్నట్టు గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లను బ్యూటీషియన్‌ నిపుణులు తయారు చేసారు. గులాబీ రేకులతో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఈ ఐకానిక్ ఫ్లవర్ స్పెషల్ గా కొన్నిబ్యూటీ వండర్స్ ను క్రియేట్ చేస్తుంది.

పురాతన కాలం నుండి గ్రీకులు మరియు రోమన్స్ వారి సౌందర్య సాధానల్లో రోస్ పెటల్స్ ను విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా వారు ఉపయోగించే పెర్ఫ్యూమ్స్, మరియు బాంతింగ్ టబ్స్ లో ఉపయోగించుకొనే వారు. అంతే కాదు గుభాళించే రోజ్ పెటల్స్ మరియు రోజాపువ్వులను గదుల్లో అలంకరణగా కూడా అలకంరించుకొనేవారు. రోజాపువ్వు రేకులు, కాస్మొటిక్స్, మెడిసిన్స్ మరియు థెరఫీ ట్రీట్మెంట్స్ లో శాతాబ్దకాలం నుండి ఉపయోగిస్తున్నారు . రోజ్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని స్కిన్ రాషెష్, స్కిన్ బర్న్ మరియు ఇతర స్కిన్ సమస్యల నివారణకు రోజ్ పెటల్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాదు,వీటిని గొంతు నొప్పి, మరియు దగ్గు నివారణకు కూడా ఉపయోగిస్తున్నారు.

రోజ్ వాటర్ లో హెల్తీ మరియు బ్యూటి బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. మొటిమల నివారణకు , గొంతనొప్పి వంటి నివారణకు రోజ్ వాటర్ ను బాతింగ్ వాటర్ లో వేస్తుంటారు. చర్మం సౌందర్యంను పెంపొందించే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ లో రోజ్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందువల్ల ప్రస్తుత రోజుల్లో రోజువాటర్, రోజ్ డిస్టిలేట్, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ లేదా రోజ్ హిస్ సీడ్ ఆయిల్ వంటివాటలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గుభాళించే రోజా పువ్వు చర్మాన్ని కాంతివంతంగా మరియు తాగా మార్చుతుంది. కాబ్టటి, మీ చర్మాన్ని తాజాగా మరియు ఫ్రెష్ గా ఉంచుకోవడానికి రోజ్ వాటర్ ను ఉపయోగించుకోవాలి. రోజ్ పెటల్స్ తో మరికొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ...

1. యాంటీ బ్యాక్టీరియల్:

1. యాంటీ బ్యాక్టీరియల్:

నేచురల్ గా యాంటీ బ్యాక్టీరియల్ ఎసెన్షియల్ ఆయిల్ మెటిమలు మరియు మచ్చలను నివారిస్తాయి . రోజ్ వాటర్ ఫేస్ వాష్ గాను మరియు ఫెస్ క్లెన్సర్ గాను ఉపయోగించుకోవచ్చు.

2. యాంటీ ఇన్ఫ్లమేటరీ:

2. యాంటీ ఇన్ఫ్లమేటరీ:

రోజాపువ్వు ఐకానిక్ రెడ్ కలర్, రోజ్ ఆయిల్స్ చర్మంమీద వాపుతో కూడిన మొటిమలు లేదా ఎర్రగా మారిన చర్మను నివారిస్తుంది . రోజాపువ్వులోని సున్నిత లక్షణాలు చర్మ సమస్యలను దురద మరియు తామర వంటివి నివారిస్తుంది. రోజ్ పెటల్ పేస్ట్ చేసి, ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. రోజాపువ్వు రేకులను నీటిలో రెండు మూడు గంటలు నానబెట్టి, తర్వాత పేస్ట్ చేసి, అందులో తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. యాంటీఆక్సిడెంట్స్:

3. యాంటీఆక్సిడెంట్స్:

రోజాపువ్వుల్లో విటమిన్ సి, మరియు ఫవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఈ ముఖ్యమైన విటమిన్స్ స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. సన్ బర్న్ కు చర్మం టాన్ కాకుండా రక్షిస్తుంది.

4. మాయిశ్చరైజింగ్:

4. మాయిశ్చరైజింగ్:

రోస్ లో ఉండే నేచురల్ ఆయిల్స్ చర్మం మాయిశ్చరైజర్ కు సహాయపడుతుంది. చర్మం స్మూత్ గా మార్చడానికి సహాయపడుతుంది. సెన్షిటివ్ స్కిన్ కలిగిన వారికి రోజ్ గ్రేట్ గా సహాయపడుతుంది.

5. నేచురల్ ఫ్రాగ్రెంట్:

5. నేచురల్ ఫ్రాగ్రెంట్:

చాలా వరకూ సువాసన భరిత ప్రొడక్ట్స్ లో రోజ్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు . ఇది ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ను అందిస్తుంది.

6. రిలాక్సింగ్:

6. రిలాక్సింగ్:

ఆరోమాటిక్ రోజ్ ను ఉపయోగించడం వల్ల ఇది మనస్సుకు ప్రశాంతతకు కలిగిస్తుంది. రోజ్ పెటల్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో విరివిగా ఉపయోగిస్తున్నారు

7. టానింగ్:

7. టానింగ్:

రోస్ లో ఉండే టానింగ్ ప్రొపర్టీస్, నేచురల్ ఆస్ట్రిజెంట్స్ చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది.చర్మానికి గ్లోయింగ్ కాంప్లెక్షన్ అందిస్తుంది.

English summary

7 Natural Beauty benefits for Rose Petals

Rose is not alone a symbol of love. it has more beauty benefits. Its natural beauty elements gives glowing face and more beauty.
Story first published: Saturday, February 14, 2015, 15:47 [IST]
Desktop Bottom Promotion