For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖం, ముక్కు మీద బ్లాక్స్ హెడ్స్ ను మాయం చేసే సాల్ట్ చిట్కాలు

|

ఏదైనా గాయాలు తగిలినప్పుడు వెంటనే వాటి మీద పసుపు, కాఫీ పొడి వంటి యాంటీ సెప్టిక్ పదార్థాలను పెడుతుంటారు. అలాంటి వాటిలో ఉప్పు కూడా ఒకటి. మనం రెగ్యులర్ గా తయారుచేసుకొనే వంటలకు మంచి రుచిని అందివ్వడం మాత్రమే కాదు గాయలను మాన్పడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల వంటలు రుచికరం మరియు హెల్తీ మరియు ఇది ఎనర్జిటిక్ గా పనిచేస్తుంది.READ MORE: బ్లాక్ హెడ్స్ ను నివారించే వండర్ ఫుల్ హోం రెమెడీస్

అంతే కాదు ఉప్పు మనకు ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యంను అందిస్తుంది. కాబట్టి, మీరు ఫేషియల్ స్ర్కబ్బింగ్ ను తయారుచేసుకొన్నప్పుడు తప్పనిసరిగా అందులో సాల్ట్ ను జోడించండి. సాల్ట్ సౌందర్యం పెంచడంలో అద్భుతమైన ఫలితాలను చూపించినా ఆశ్చర్యపడాల్సి అవసరం కూడా లేదు. READ MORE: మిమ్మల్ని తెల్లగా మార్చే 20 నేచురల్ ఫేస్ ఫ్యాక్స్

సాల్ట్ చాలా రఫ్ గా ఉంటుంది కాబట్టి, దాన్ని అప్లై చేయడానికి ముందు మిక్సీలో వేసి మెత్తగా చేసి తర్వాత చర్మానికి అప్లైచేయాలి . కొద్దిగా గరుకుగా ఉండే సాల్ట్ చర్మంలో దాగి ఉన్న మురికిని తొలగిస్తుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ మరియు బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి కొన్ని హోం మేడ్ రెమెడీస్ ను ఈ క్రింది స్లైడ్ లో తెలపడం జరిగింది. ఇవి బ్లాక్ హెడ్స్ ను నివారించడం మాత్రమే కాదు ఇది చర్మం యొక్క క్వాలిటీని మెరుగుపరుస్తుంది...

 రోజ్ వాటర్ అండ్ సాల్ట్:

రోజ్ వాటర్ అండ్ సాల్ట్:

ఒక చెంచా సాల్ట్ ను బౌల్లో వేసి అందులో ఒక చెంచా రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన వెంటనే అది కరిగిపోకనే ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో కొద్దిగా అలాగే అప్లై చేయాలి . సాల్ట్ బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది . అలా చర్మానికి మంచి గ్లోను అందిస్తుంది . ఈ బ్యూటి టిప్స్ ను వారానికొకసారి అప్లై చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు.

సాల్ట్ మరియు షుగర్:

సాల్ట్ మరియు షుగర్:

సాల్ట్ మరియు షుగర్ రెండు ఒక్కొక్కో చెంచా తీసుకొని రెండింటిని మిక్స్ చేసి అందులో కొద్దిగా రోజో వాటర్ లేదా పాలు మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత తడి కాటన్ వస్త్రంతో తుడిచేస్తే ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగింపబడుతాయి.

 సాల్ట్ మరియు తేనె:

సాల్ట్ మరియు తేనె:

ఒక చెంచా తేనెలో రెండు చెంచాల సాల్ట్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఇది ముఖం మీద బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . ఈ బ్యూటీ చిట్కాను వారానికి రెండు సార్లు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

 శెనగపిండి మరియు సాల్ట్ :

శెనగపిండి మరియు సాల్ట్ :

ఒక మిక్సింగ్ బౌల్లో ఒక చెంచా శెనగపిండి, సాల్ట్ మరియు ఒక చెంచా పాలను మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత తొలగించడం వల్ల చర్మంలోని బ్లాక్ హెడ్స్ తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

నిమ్మరసం మరియు సాల్ట్ :

నిమ్మరసం మరియు సాల్ట్ :

ముందుగా నిమ్మతొక్కను తీసుకొని ముఖానికి మర్దన చేసి ఆ తడి మీదనే నిమ్మతొక్కను సాల్ట్ లో డిప్ చేసి ముఖం మీద అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. ఇలా 10 నిముసాల చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా 8రోజులు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

సాల్ట్ మరియు పేస్ట్ :

సాల్ట్ మరియు పేస్ట్ :

టూత్ పేస్ట్ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పేస్ట్ లో కొద్దిగా సాల్ట్ వేసి ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. ఇది డ్రై మరియు ఇచ్చీ స్కిన్ ను నివారిస్తుంది . ఇది ఒక ఎఫెక్టివ్ బ్లాక్ హెడ్స్ ను తొలగించే చిట్కా.

ఉప్పు మరియు పెరుగు:

ఉప్పు మరియు పెరుగు:

పెరుగులో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు కాలిన గాయలను మాన్పుతుంది.

English summary

7 Salt Recipes To Remove Blackheads:Beauty Tips in Telugu

Salt also provides us with healthy looking skin. Which is why it is an important ingredient to add whenever you do a facial or prepare a body scrub. This little ingredient does wonders in making you look beautiful and stunning.
Story first published: Saturday, June 20, 2015, 12:41 [IST]
Desktop Bottom Promotion