For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడే అలోవెర జెల్ టిప్స్

|

అలోవెర(కలబందను)ఓ నేచర్ గిఫ్ట్ గా మనం భావిస్తాము. ఎందుకంటే ఇందులో అనేక ఔషధగుణాలు, కాస్మోటిక్ మరియు ఫుడ్ విలువలున్నాయి. మీకు తెలసా చర్మ సంరక్షణలో అలోవరె దిబెస్ట్ ఔషధ మొక్క. గ్రేట్ బ్యూటీబెనిఫిట్స్ ఉన్నాయి. తెలుసుకోవాలంటే ఆర్టికల్ చదవాల్సిందే..

ప్రస్తుత రోజుల్లో అలోవెరా జెల్ లేదా మొక్కలో ఉండే బ్యూటీ బెనిఫిట్స్ మరియు కాస్మోటిక్ బెనిఫిట్స్ తెలుకొన్న తర్వాత చాలా మంది అలోవెర జెల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఇది మన ఇండోర్ గార్డెన్ మొక్క కాబట్టి, ఫ్రెష్ గా ఇల్లలోనే పెంచుకోవడం మొదలుపెట్టేస్తున్నారు.

ఈ అలోవెర మొక్క యొక్క పొడవాటి ఆకులో జెల్ నిండి ఉంటుంది. జిగటగా ఉండే ఈ జెల్ ఒక అద్భుతమైన మ్యాజిక్ చేస్తుంది. ఈ జెల్లో వాటర్ మరియు విటమిన్స్, మినిరల్స్ మరియు యాక్టివ్ మెటీరియల్స్ పుష్కలంగా ఉన్నాయి.

Read more at: కలబంద ఆరోగ్యానికి ఏవిధంగా పనిచేస్తుంది

బెస్ట్ ఐడియా ఏంటేంటో ఇన్ని మెడిసినల్ మరియు కాస్మోటిక్ వాల్యూస్ ఉన్న అలోవెరాను చర్మానికి ప్యాక్ లా వేసుకోవడమే. ఎందుకంటే హోం రెమెడీస్ ఎల్లప్పుడు దిబెస్ట్ గా ఉంటాయి. కెమికల్ కాస్మోటిక్స్ వలే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

అలోవెర్-లెమన్ ప్యాక్ :

అలోవెర్-లెమన్ ప్యాక్ :

అలోవెర జెల్లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల వేసవి సీజన్ సాధారణ సమస్యయైన సన్ టాన్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత చిటెకెడు పసుపు మిక్స్ చేసి కూడా ప్యాక్ లో వేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది.

అలోవెర-రోజ్ వాటర్ ప్యాక్:

అలోవెర-రోజ్ వాటర్ ప్యాక్:

అలోవెర-రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై, 5నిముషాలు మసాజ్ చేసి, 20నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ మరియు మచ్చలను తొలగిస్తుంది.

 అలోవెర-కీరదోసకాయ:

అలోవెర-కీరదోసకాయ:

ఒక టీస్పూన్ అలోవెర జెల్ కు ఒక చెంచా కీరదోసకాయ పేస్ట్ మరియు ఒ క చెంచా చీజ్, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత హైడ్రేషన్ పొందవచ్చు .

అలోవెర -తెనే ప్యాక్:

అలోవెర -తెనే ప్యాక్:

ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా పాలు తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇంకా పసుపు మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మ రంద్రాలను శుభ్రం చేసి చర్మానికి తక్షణం గ్లో అందిస్తుంది.

 అలోవెర-మ్యాంగో ప్యాక్ :

అలోవెర-మ్యాంగో ప్యాక్ :

బాగా పండిన మామిడి పండు గుజ్జులో అలోవెర జెల్ మిక్స్ చేసి , అందులోనే నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసి మొత్తం శారీరానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత స్నానం చేయాలి . ఇలా చేయడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది మరియు ఫ్రెష్ గా ఫీలవుతారు.

అలోవెర-పెరుగు ప్యాక్

అలోవెర-పెరుగు ప్యాక్

అలోవెర జెల్లో కొద్దిగా పెరుగు, కీరదోసకాయ గుజ్జు మరియు జాస్మిన్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల ఇది చర్మంలోని మలినాలను మరియు ఆయిల్స్ తొలగిస్తుంది.

అలోవెర -ఆలివ్ ఆయిల్

అలోవెర -ఆలివ్ ఆయిల్

అలోవెర జెల్లో కొద్దిగా బట్టర్ మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్, ముఖానికి అప్లై చేయడం వల్ల ముకాన్ని తేమగా మరియు మాయిశ్చరైజ్ గా, కాంతివంతంగా మార్చుతుంది

అలోవెర-బాదం

అలోవెర-బాదం

అలవెర జెల్లో కొద్దిగా బాదం పౌడర్ ను మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా వేసుకొన్న20నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే చర్మానికి తగిన పోషణ అందిస్తుంది. మరియు యంగ్ గా కనబడేలా చేస్తుంది.

అలోవెర-గుడ్డు

అలోవెర-గుడ్డు

అలోవెర జెల్లో కొద్దిగా ఎగ్ వైట్ వేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖంలో ముడుతలనే ఉండవు.

అలోవెర-బొప్పాయి

అలోవెర-బొప్పాయి

బొప్పాయి గుజ్జులో కొద్దిగా అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి శుభ్రం చేసుకుంటే, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

అలోవెర -మిల్క్ క్రీమ్

అలోవెర -మిల్క్ క్రీమ్

అలోవెర జెల్లో కొద్దిగా మిల్క్ క్రీమ్ మరియు పసుపు వేసి పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకుంటే, చర్మానికి తగినంత తేమను అందిస్తుంది.

అలోవెర-టమోటో

అలోవెర-టమోటో

అలోవెర ఆకును రఫ్ గా పేస్ట్ చేసి అందులో టమోటో గుజ్జు వేసి మిక్స్ చేసి ముఖాని పట్టిస్తే, ముఖాన్ని కాంతివంతం చేస్తుంది, వేసవిలో సన్ టాన్ తొలగిస్తుంది.

English summary

12 Aloe Vera Beauty Tips In Summer

Aloe vera is considered as nature’s gift. It is like a small package with many medicinal, cosmetic and food values. But do you know aloe vera pack for skin is one of the best thing. Read on to find more.
Story first published: Saturday, April 25, 2015, 15:50 [IST]
Desktop Bottom Promotion