For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖ ఛాయను మెరుగుపరిచే మన పెరిటిలోని ఆకులు: తెలుగు టిప్స్

|

ప్రతి ఒక్కరు అందంగా కనబడాలి కోరుకుంటారు. ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి అన్ని విధాల ప్రయత్నిస్తుంటారు. ముఖ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి సాధారణంగా చాలా మంది రసాయన క్రీములను వాడుతుంటారు, కానీ వీటికి బదులుగా, సహజ ఔషదాలను వాడటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక్కడ తెలిపిన కొన్ని పెరిటి మొక్కల యొక్క ఆకులు మీ ముఖ ఛాయను మెరుగుపరచుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి

READ MORE: పొడిగా..రఫ్ గా ఉన్న జుట్టు నివారించే చిట్కాలు

ఈ కాస్మోటిక్ షాపులు, ఉత్పత్తులు రాకమునుపు కూడా అందం, అందంగానే ఉండేది. కాస్మోటిక్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అందంగా కనిపిస్తారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇవేవి అందుబాటులో లేని రోజుల్లో మానవులు తమ అందానికి మెరుగులు దిద్దుకునేందుకు పూర్తిగా మొక్కలు, వాటి ఉత్పత్తులపై ఆధార పడేవారు. పెరడులో వాటిని పెంచుకునే వారు. మరి అలాంటి మొక్కల్లో కొన్నింటిని మీకోసం ... మీ అందాన్ని పెంచుకోవడం కోసం.....

పుదీనా:

పుదీనా:

పుదీనా ఆకులను అలాగే తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ రంద్రాలను మరియు ముఖాన్ని శుభ్రం చేస్తుంది.

వేప

వేప

శక్తివంతమైన ఔషధాలలో ఒకటైన వేప ముఖ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండటం వలన మొటిమలు, తామర, సోరియాసిస్, చుండ్రు వంటి వాటికి వ్యతిరేఖంగా పని చేస్తుంది. వీటితో పాటుగా చక్కటి మరియు ఆరోగ్యకర ముఖఛాయను అందిస్తుంది. అంతే కాదు వేపఆకులు నీటిలో వేసి మరిగించి ఆనీటితో వారానికొకసారి స్నానం చేయడం మంచిది . ఇది చర్మానికి చల్లగా మార్చుతుంది మరియు స్కిన్ కాంప్లెక్షన్ మెరుగుపరుస్తుంది మరియు మొటిమలను నివారిస్తుంది.

తులసీ

తులసీ

వాతావరణ కాలుష్యాల వలన చర్మం ప్రకాశవంత రహితంగా మరియు ముఖ ఛాయను జీవ రహితంగా మార్చుతుంది. ఈ సమస్యను తులసీ సహజంగా తగ్గించి వేస్తుంది. తులసీ ఆకులతో చేసిన టీతో కడిగి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి. చర్మాన్ని నిర్విషీకరణకు గురి చేసి, ముఖ ఛాయను మెరుగుపరుస్తుంది.

కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకును జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తుంటాము . డార్క్ స్పాట్స్ నివారించడానికి కూడా కారిపట్టా ఉపయోగస్తుంటారు. దీన్ని ఎలా తయారుచేస్తారంటే, గుప్పెడు కరివేపాకును నీటిలో వేసి చిటికెడు పసుపు మిక్స్ చేసి నీటిలో వేసి బాగా మరిగించి తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఇది డార్క్ స్పాట్స్ నివారించడంలో చాల గ్రేట్ గా సహాయపడుతుంది.

తమలపాకు:

తమలపాకు:

తమలపాకు యొక్క బ్యూటీ బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. తమలపాకును మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా కొబ్బరి పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి తర్వాత శుభ్రం చేసుకుంటే స్కిన్ కంప్లెక్షన్ నివారిస్తుంది . అయితే ఇది సెన్సిటివ్ చర్మానికి అంత మంచిది కాకపోవచ్చు.

మెంతి:

మెంతి:

మెంతిఆకలును మెంటి మచ్చలను నివారిస్తుంది . మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల మచ్చలు మొటిమలు నిధానంగా తగ్గుముఖం పడుతాయి.

కొత్తిమీర:

కొత్తిమీర:

కొత్తిమీర డ్రై స్కిన్ నివారించండంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు గుప్పెడు కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి అందులోకొద్దిగా తేనె, మరియు నిమ్మరసం మిక్స్ చేసి డ్రై స్కిన్ కు అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద

కలబంద

ఈ సహజ ఔషదాన్ని కాలిన గాయాలను మాన్పిస్తుంది, అంతేకాకుండా, ఇది చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. తేనె కలిపిన కలబందతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ను వాడండి. కొన్ని నిమిషాలలోనే మీ చర్మానికి తేమను అందించి, మీరు అందంగా కనబడేలా చేస్తుంది.

డాండోలియన్

డాండోలియన్

డాండోలియన్ అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ 'C' లను కలిగి ఉంటుంది. కావున ఇది ఫ్రీ రాడికల్ లతో పోరాడటమే కాకుండా, చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఔషదం చర్మాన్ని ఆరోగ్యంగా మార్చి, ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా చేస్తుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

ఆస్ట్రిజెంట్ (రక్తస్రావ నివారణ) మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన పురాతన కాలం నుండి వాడుతున్నారు. రోజులో కొన్ని సార్లు, కాటన్ ను ముక్కను తీసుకొని రోజ్ వాటర్ లో ముంచి, ముఖానికి అద్దండి. ఇది మీ చర్మాన్ని అన్ని రకాల మెరుగుపరుస్తుంది.

English summary

Beauty Benefits Of 10 Leaves: Telugu Beauty Tips

Those healthy leaves that mothers use for seasoning your favourite dish, are also beneficial for beauty purposes. Mint leaves, neem or margo, basil, fenugreek and even betel leaf has the ability to make all those marks disappear from your face and body.
Story first published: Thursday, July 2, 2015, 17:36 [IST]
Desktop Bottom Promotion