For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుచ్చకాయతో వేసవి చర్మ సమస్యలన్నీ మాయం..

|

వేసవికాలంలో విరివిగా లభించే పళ్లలో 'పుచ్చకాయ'కూడా ఒకటి. వేసవి వేడిమికి చెక్ పెడుతూ శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే ఈ పండు వల్ల కేవలం ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు...సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి, ఆ ప్రయోజనాలు ఏంటి? వాటిని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోవాలంటే మాత్రం ఈ ఆర్టికల్ చేదవాల్సిందే..

పుచ్చకాయలోని 92శాతం నీరు ఉంటుంది. ఇది తినడం ద్వారా వేసవిలో శరీరం నుంచి పోయే నీటిశాతాన్ని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. ఫలితంగా చర్మం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే గింజల వల్ల కూడా చాలా సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయి. చర్మాన్ని సున్నితంగా చేసి, మాయిశ్చరైజ్ చేయడంలో వీటిని మించినవి లేవంటే అతిశయోక్తి కాదు. పుచ్చకాయ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు...

 టోనర్ గా పనిచేస్తుంది:

టోనర్ గా పనిచేస్తుంది:

వాటర్ మెలోన్ చర్మానికి సహజసిద్దమైన టోనర్ గా పనిచేస్తుంది. ఒక చిన్న పుచ్చకాయ ముక్కని కోసి నేరుగా చర్మం మీద రుద్దచ్చు. లేదంటే తేనెతో కలిపి మెత్తని ముద్దగా చేసుకుని ఆ మిశ్రమంతో కూడా చర్మానికి మృదువుగా మర్దన చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశించడమే కాకుండా నునుపుగా కూడా మారుతుంది.

మొటిమలు తగ్గడానికి:

మొటిమలు తగ్గడానికి:

వేవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత వల్ల ఎక్కువగా చెమటలు పట్టడం, చర్మం జిడ్డుగా మారడం వంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే వీటి వల్ల మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొటిమలు తగ్గించడంలో కూడా పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందు ముఖం బాగా శుభ్రం చేసుకోవాలి. పుచ్చకాయ రసంలో ముంచిన దూదితో ముఖమంతా ఈ రసాన్ని అప్లై చేసుకోవాలి. 15నిముషాల తరవ్ాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

సూర్యరశ్మి నుండి:

సూర్యరశ్మి నుండి:

సూర్య రశ్మి నుండి చర్మానికి ఎలాంటి హానీ జరగకుండా కూడా పుచ్చకాయ సంరక్షిస్తుంది. దీనికోసం పుచ్చకాయ, దోసకాయ గుజ్జులు సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మివ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిముసాలు ఆరనివ్వాలి. తర్వాత శుబ్రంగా నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేవలం సూర్యరశ్మి వల్ల మండే చర్మం నుంచి ఉపశమనం పొందడమే కాదు...చర్మం ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

వృద్దాప్యఛాయలు కనిపించకుండా:

వృద్దాప్యఛాయలు కనిపించకుండా:

పుచ్చకాయలో అధికమెత్తంలో ఉండే లైకోఫిన్, సి, ఎ విటమిన్లు చర్మంపై ఏర్పడే సన్నని గీతలు కనిపించకుండా చేస్తాయి. అలాగే చర్మం ముడతలు పడకుండా చేసి వృద్దాప్యఛాయల్ని కనిపించకుండా చేస్తాయి. దీన్ని రోజూ చర్మానికి రాసుకున్నా లేదా ఆహారంలో భాగంగా తీసుకున్నా మరిన్ని చక్కని ఫలితాల్ని పొందవచ్చు.

తాజాగా కనిపించడానికి

తాజాగా కనిపించడానికి

పగలంతా ఎండలో తిరగడం వల్ల సాయంత్రానికి ముఖం అలసిపోయి వాడిపోతుంది. తిరిగి మళ్ళీ తాజాదనాన్ని సంతరించుకోవాలంటే అందుకు చక్కని మార్గం పుచ్చకాయ. ఐస్ క్యూబ్ ట్రేలో నీరు, పుదీనా ఆకులు, చిన్న చిన్న పుచ్చకాయ ముక్కలు వేసి గడ్డ కట్టించాలి. కాసేపటి తర్వాత ఆ ఐస్ క్యూబ్ ట్రేలో నీరు, పుదీనా ఆకులు, చిన్న చిన్న పుచ్చకాయ ముక్కలు వేసి గడ్డకట్టించాలి. కాసేపటి తర్వాత ఆ ఐస్ క్యూబ్స్ తీసుకుని వాటితో ముఖం మీద రుద్దుతూ మృదువుగా మర్దన చేసుకుంటే తెల్లవారేసరికి మీ ముఖం తిరిగి తాజాగా మారిపోతుంది.

కేశాలకు:

కేశాలకు:

పుచ్చకాయ వల్ల చర్మానికి మాత్రమే కాదు, కేశాలకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది .జుట్టు పెరుగుదలకు పుచ్చకాయలోని ఎక్కువ శాతంలో ఉండే సిట్రుల్లిన్ అనే ఫైటో న్యూట్రీయంట్ వల్ల శరీరంలో ఆర్జినిన్ అనే అమైనోయాసిడ్ శాతం పెరుగుతుంది. ఫలితంగా మాడులో రక్తప్రసరణ మెరుగుపడి కేశాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

 స్క్రబ్బింగ్:

స్క్రబ్బింగ్:

పుచ్చకాయ గుజ్జులో కొద్దిగా శెనగపిండి మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసుకుంటే చక్కని స్క్రబ్బింగ్ లా పనిచేస్తుంది.

బ్లాక్ హెడ్స్

బ్లాక్ హెడ్స్

చర్మ రక్షణలో బాగంగా ముఖం, ముక్కు మీద ఏర్పడే బ్లాక్ హెడ్స్ ను తొలగించడం సహాయపడుతుంది.

 ఆయిల్ చర్మాన్ని తొలగిస్తుంది

ఆయిల్ చర్మాన్ని తొలగిస్తుంది

ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మలోపల ఉన్న నూనె మగ్రంధులను తగ్గిస్తుంది. దాంతో ముఖంలో జిడ్డు కూడా తగ్గి ముఖం తాజాగా ఉంటుంది.

స్కిన్ హైడ్రైషన్

స్కిన్ హైడ్రైషన్

చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది: వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే పుచ్చకాయ వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు మరెన్నో !అందుకే ఈ సారి మీరు కూడా మిస్ కాకుండా పుచ్చకాయల్ని బాగా తినండి..అలాగే వాటిని ఉపయోగించి సౌందర్యప్రయోజనాల్ని కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి..

English summary

Beauty Benefits Of Watermelon: Summer Skin Care Secrets

Watermelon is a seasonal fruit that can be enjoyed in this season. As summer is knocking the door, you have to prepare your skin to fight sun tan and sweat. Drinking watermelon juice not only keeps you hydrated but also helps get a radiant skin.
Desktop Bottom Promotion