For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంలో అమేజింగ్ బ్యూటీ ట్రిక్స్ అండ్ టిప్స్

|

లెనమ్(నిమ్మరసం)లోని అనేక బ్యూటీబెనిఫిట్స్ గురించి మనకు ఇదివరకే తెలుసు. సౌందర్యంను మెరుగుపరుచుకోవడానికి నిమ్మరసంను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ నేచురల్ ఫ్రూట్ లో వివిధ రకాల మినిరల్స్ కలిగి ఉండటం వల్ల దీన్ని ఎన్ని సార్లు ఉపయోగించినా మంచి ప్రయోజనాలను అందిస్తుంది. నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది మరియు బ్రౌన్ స్పాట్స్ ను నివారిస్తుంది.

అంతే కాదు ఇది మొటిమలను నివారించడానికి ఒక నేచురల్ బ్లీచ్ లా పనిచేస్తుంది. అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నిమ్మతొక్కను కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల సూర్యరశ్మి వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ కు మంచి చికిత్సను అందిస్తుంది.

READ MORE: నిమ్మ రసంతో 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!

నిమ్మరసం ఉపయోగించి మీ ముఖంలో నేచురల్ గ్లోను తీసుకురావచ్చు. మరియు నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ వల్ల ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. అదే విధంగా నిమ్మరసం చర్మ దురుద మరియు ఇరిటేషన్ ను నివారిస్తుంది.

READ MORE: నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!

ముఖ్యంగా నిమ్మరసం ఫేషియల్స్ మరియు ఫేస్ ప్యాక్స్ కు ఒక ముఖ్యమైనటువంటి పదార్థం నేచురల్ రెమెడీస్ లో నిమ్మరసం లేకుండా మరేది సంపూర్ణం కాదు. మరి అలాంటి ఎఫెక్టివ్ రెమెడీతో కొన్ని బ్యూటీ ట్రిక్స్ ఈ క్రింది విధంగా....

 సన్ టాన్ నివారిస్తుంది:

సన్ టాన్ నివారిస్తుంది:

నిమ్మరసం చర్మం మీద ఏర్పడ్డ సన్ టాన్(సూర్య రశ్మి వల్ల చర్మ రంగులో మార్పును)నివారిస్తుంది . ముఖ్యంగా సూర్యరశ్మికి బహిర్గతం అయ్యేది కాళ్ళు మరియు చేతులు. చాలా త్వరగా సూర్య రశ్మి వల్ల నల్లగా మారుతుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో రెండు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేయాలి . దీన్ని సన్ టాన్ కు గురిఅయిన ప్రదేశంలో అప్లై చేసి సాఫ్ట్ బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి.

 బాడీ వ్యాక్స్:

బాడీ వ్యాక్స్:

నిమ్మరసంను బాడీ వ్యాక్స్ లో ఉపయోగించుకొన్నట్లైతే అరకప్పు షుగర్ లో 1/4కప్పు నిమ్మరసం మిక్స్ చేసి మైక్రోవేవ్ లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేడి చేయాలి. అవసరం అయినప్పుడు మద్యమద్యలో కలియబెడుతుండాలి. చల్లారిన తర్వాత కాళ్ళకు, చేతులకు అప్లై చేసి రిమూవ్ చేయడం వల్ల బాడీ వ్యాక్స్ గా పనిచేస్తుంది.

హెయిర్ మాస్క్ :

హెయిర్ మాస్క్ :

లెమన్ మిక్స్ తో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది మరియు ఇది హెయిర్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. హెయిర్ మాస్క్ తయారుచేయడానికి 3చెంచాలా గ్రేప్ ఫ్రూట్, నాలుగు చెంచాల కొబ్బరి నూనెలో మిక్స్ చేయాలి. మూడు చెంచాలా నిమ్మరసం మిక్స్ చేసి దీన్ని జుట్టు మరియు తలకు పట్టించి 15-20నిముషాలు అలాగే వదిలేయాలి. తర్వాత శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 జుట్టుకు మంచి కలర్ ను అందిస్తుంది:

జుట్టుకు మంచి కలర్ ను అందిస్తుంది:

జుట్టుకు నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల జుట్టు మంచి షైనింగ్ తో మంచి రంగు కలిగి ఉంటుంది. కాబట్టే నిమ్మరసంను హెయిర్ డై, హెయిర్ కలర్స్ లో ఉపయోగిస్తుంటారు. దీన్ని హెయిర్ కలర్స్ , హెయిర్ ప్యాక్ లో మిక్స్ చేయడం వల్ల ఇది జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మీ జుట్టుకు మంచి రంగు, మెరుపు రావాలంటే దీన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయాలి.

చర్మంలో మచ్చలను నివారిస్తుంది:

చర్మంలో మచ్చలను నివారిస్తుంది:

ముఖంలో మచ్చలు మరియు స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్నట్లైతే నిమ్మరసం ఒక ఉత్తమ హోం రెమెడీ. ఒక చెంచా నిమ్మరసంలో ఒక చెంచా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మొటిమలు మచ్చలు తొలగించడంతో పాటు, స్కిన్ పిగ్న్మేటేషన్ కూడా తగ్గిస్తుంది.

నల్లగా ఉన్న మోచేతులు మరియు చంకల్ని తెల్లగా మార్చుతుంది:

నల్లగా ఉన్న మోచేతులు మరియు చంకల్ని తెల్లగా మార్చుతుంది:

నల్లగా ఉండే మోచేతులు మరియు చంకల్లో నలుపును నివారిస్తుంది. ఫేషియల్ స్కిన్ కంటే మోచేల వద్ద చర్మం నల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మతొక్కతో మర్దన చేయాలి. దీన్ని రెగ్యులర్ గా చేస్తుంటే మంచి చర్మ సౌందర్యంను పొందవచ్చు .

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది:

ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి నిమ్మరసం గ్రేట్ గా పనిచేస్తుంది. మీరు సాధారణంగా కెమికల్ స్ర్కబ్ ను ఉపయోగించాలి . అయితే ఒక చెంచా పంచదార మిక్పస్ చేసి అప్లై చేసి మర్దన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి 10 నిముషాలు మర్ధన చేయాలి.

మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ ట్రీట్మెంట్ :

మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ ట్రీట్మెంట్ :

మొటిమలు మరియు మచ్చలు మరియు బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో నిమ్మరసంను అప్లై చేసి, 5నిముషాల తర్వాత శుభ్రం చేయాలి. ఇలా 15రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Beauty Tricks With Lemon in Telugu

Beauty Tricks With Lemon in Telugu. Lemon is an important ingredient in facials and face packs made at home. Without it, natural remedies for skin are incomplete. Here we will share with you some beauty tricks using lemon. Have a look at some beauty hacks using lemon.
Story first published: Friday, June 5, 2015, 14:06 [IST]
Desktop Bottom Promotion