For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేషియల్ మసాజ్ తో సర్ఫ్రైజింగ్ బ్యూటి బెనిఫిట్స్

|

చర్మం అందంగా.. ఆరోగ్యంగా మెరుస్తుండేందుకు బ్యూటీ పద్దతుల్లో చాలా రకాలను ప్రయత్నం చేసే ఉంటారు. అయితే ఫేషియల్ మసాజ్ అనేది చర్మ సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయస్సులో ఏదో ఒక చర్మ సమస్యను ఎదుర్కొని ఉంటారు. వయస్సు మీదపడినట్లు, ముడుతలు, ముఖంలో మొటిమలు, బ్లాక్ సర్కిల్స్, మొ..ఎన్నో..అలాంటి వారిలో మీరూ ఒక్కరైతే.. మీ ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా ఉందా? ముఖంలో కళ తప్పినట్లైతే మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చాలని ఉందా. ఈ సమస్యలన్నింటీకి ఒకటే మార్గం అదే ఫేషియల్ మసాజ్.

మసాజ్ అనేది చాలా మంచిది, ముఖానికి (ఫేషియల్)మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. సహజంగా మన చర్మం సన్ లైట్, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్కువగా బహిర్గతం కావడం వల్ల వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దాంతో చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచుకోవచ్చు .

వాతావరణ కాలుష్యం మాత్రమే కాకుండా, మనం నిత్యం ఉపయోగించే కాస్మోటిక్స్ లోని రసాయనాలు చర్మాన్ని మరింత టాక్సిక్ గా మార్చుతుంది . కాబట్టి, మీ చర్మాన్ని రిపిపేర్ చేయడానికి ఒక ఉత్తమ మార్గం ఏంటంటే, మీ చర్మానికి ఒక మంచి సున్నితమైన మసాజ్ ను అందివ్వడమే. మసాజ్ వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మరియు చర్మానికి తగిన పోషణ అందించి విలాసవంతంగా మార్చుతుంది మరియు మసాజ్ అనేది బహిర్గతంగా చేసే వ్యాయమం కనుకు శరీరంలో కూడా రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

అందుకే ప్రతి ఒక్కరీకి బాడీ మసాజ్ ను ఇష్టపడుతారు. కానీ ఫేషియల్ మసాజ్ కూడా మీ చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా మార్చుకోవడానికి చాలా అవసరం. మరి ఫేషియల్ మసాజ్ వల్ల పొందే లాభాలేంటో ఒక సారి చూద్దాం...

1. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది:

1. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది:

ఫేషియల్ మసాజ్ ను ఫర్ఫెక్ట్ గా చేసినట్లైతే, దీని వల్ల ముఖంలో రక్తప్రసరణ మరియు ఆక్సిజన్ ప్రసరణను పెంచి ముఖం కాంతివంతంగా మార్చుతుంది. ముఖంలో కళ్ళ దగ్గర మరియు నోటి దగ్గర లైన్స్ ను నివారిస్తుంది.

2. టెన్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

2. టెన్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

ముఖంలో ముడుతలు మరియు ఛారలు ఏర్పడటానికి ప్రధాణ కారణం టెన్షన్ . ఇది ఫేషియల్ మజిల్స్ వల్ల పెరుగుతాయి . కాబట్టి,ఎప్పుడైతే ఈ టెన్షన్ తగ్గించుకుంటామో అప్పుడు క్రమంగా ముడుతలు తగ్గడానికి సహాయపడుతుంది.

3. డిటాక్సిఫికేషన్:

3. డిటాక్సిఫికేషన్:

ఫేషియల్ మసాజ్ వల్ల మరో గ్రేట్ హెల్త్ బెనిఫిట్ డిటాక్సిఫై చేస్తుంది. చర్మంలోని మలినాలన్నీ తొలగిస్తుంది . రెగ్యులర్ మసాజ్ వల్ల చర్మం రిఫ్రెష్ గా ఉంటుంది.

4. ఫేస్ లిఫ్ట్:

4. ఫేస్ లిఫ్ట్:

ఫేస్ లిప్ట్ వంటి మసాజ్ వల్ల నేచురల్ మార్గంలో చేసినట్లైతే, చర్మాన్ని హెల్తీగా మరియు కాంతివంతంగా మారుతుంది.

5. కంజషన్ :

5. కంజషన్ :

ఫేషియల్ మసాజ్ వల్ల సైనస్ వంటి సమస్యలను నివారిస్తుందని రీసెంట్ పరిశోధనల్లో వెలువడినది. అలాంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

6. మూడ్:

6. మూడ్:

ఫేషియల్ మసాజ్ వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది . దాని వల్ల ముఖంలో ఆందోళన కనబడదు. సంతోషంగా కనబడుట కూడా చర్మ సౌందర్యంలో ఒక రహస్యం.

7. వయస్సు కనబడనివ్వదు:

7. వయస్సు కనబడనివ్వదు:

ముఖవ్యాయామం వల్ల ముఖంలో వయస్సు పెరుగుదలను కనబడనీవ్వదు. చర్మం హెల్తీగా మరియు యంగ్ గా కనబడేలా చేస్తుంది .

8. ఉత్తమ శోషణ:

8. ఉత్తమ శోషణ:

ఫేషియల్ మసాజ్ తర్వాత ముఖానికి అప్లై చేసి బ్యూటీ క్రీమ్స్ మరియు లోషన్స్ చర్మంలోకి సులభంగా శోషింపబడుతాయి.

English summary

Benefits Of Facial Massage

A massage is a good thing; well, then are there any benefits of facial massage? There are so many of them. Your skin on your face needs some attention too.
Story first published: Tuesday, April 21, 2015, 18:18 [IST]
Desktop Bottom Promotion