For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో పొడి బారిన చర్మం నివారించే బానానా ఫేస్ ప్యాక్స్

|

చలికాలంలో మాత్రమే కాదు వేసవి కాలంలో కూడా స్కిన్ డీహైడ్రేషన్ వల్ల చర్మం డ్రైగా మారుతుంది. ఈ డ్రై స్కిన్ నివారించుకోవడానికి వేసవిలో విరివిగా దొరికే అరటిపండ్లు బాగా సహాయపడుతాయి. అరటి పండ్లలో ఎక్కువ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ఇవి చర్మానికి చాలా అవసరం అవుతాయి . ఇది చర్మానికి తగిన తేమను అందించడంతో పాటు, చర్మ యొక్క డ్రై నెస్ ను నివారిస్తుంది.

డ్రై స్కిన్ నివారించడానికి కొన్ని బనాన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. వాటిని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాము. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్నిచూడటానికి యవ్వనంగా మరియు మెరిసే విధంగా మార్చేస్తాయి.

డ్యామేజ్ అయిన స్కిన్ మరియు డ్రై స్కిన్ నివారించడానికి అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. దీన్ని ఒక హెల్తీ మీల్ గానే కాకుండా మీ చర్మ సంరక్షణకోసం స్కిన్ డైట్ లో తీసుకోవచ్చు.

READ MORE: పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్

అరటిపండుకు మరికొన్ని నేచురల్ పదార్థాలు జోడించి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం యొక్క డ్రైనెస్ ను పోగొట్టడం మాత్రమే కాదు, చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి పునరుద్దరిస్తుంది దాంతో చర్మం తిరిగి తేమగా మరియు కాంతివంతంగా కనిపిస్తుంది.

మరి డ్రై స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం మేడ్ బనానా ఫేస్ ప్యాక్ లను ఏవిధంగా తయారుచేయాలి, ఎలా వేసుకోవాలన్న విషయాన్ని ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి...

 అరటి మరియు ఆలివ్ ఆయిల్ ప్యాక్:

అరటి మరియు ఆలివ్ ఆయిల్ ప్యాక్:

బనానా(అరటి)-నేచురల్(సాధారణ)నూనెలు: అరటి పండు, నేచురల్ ఆయిల్స్ (బాదాం నూనె, ఆలివ్ నూనె) వంటివి ఫర్ ఫెక్ట్ నేచురల్ స్కిన్ కేర్ కాంబినేషన్స్. ఒక బౌల్లో అరటి పండు గుజ్జు, తర్వాత ఒక చెంచా మీకు నచ్చిన ఏదేని నేచురల్ ఆయిల్ తీసిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ముఖం స్మూత్ గా తయారవుతుంది.

అరటి మరియు బటర్ ఫేస్ ప్యాక్:

అరటి మరియు బటర్ ఫేస్ ప్యాక్:

బాగా పండిన అరటిపండ్లను బాగా మ్యాష్ చేసి అందులో ఒక చెంచా వైట్ బటర్ వేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్నిముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మంను సాప్ట్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది . డ్రై స్కిన్ కు ఇది ఒక బెస్ట్ అండ్ బనానా ఫేస్ ప్యాక్ .

అరటి మరియు విటమిన్ ఇ ఫేస్ ప్యాక్:

అరటి మరియు విటమిన్ ఇ ఫేస్ ప్యాక్:

బాగా పండిన అరిటిపండు తీసుకొని మెత్తగా చేసి, విటమిన్ ఇ క్యాప్యూల్ నుండి ఆయిల్ తీసి అరటిపండులో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . ఇది మీ చర్మాన్ని హెల్తీగా మరియు గ్లోయింగ్ గా మరియు యంగ్ గా మార్చుతుంది. డ్రై స్కిన్ నివారించడంలో ఇది ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ .

 అరటి మరియు పెరుగు ఫేస్ ప్యాక్:

అరటి మరియు పెరుగు ఫేస్ ప్యాక్:

బాగా పండిన అరటిపండుకు పెరుగు మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, సన్ టాన్ నివారిస్తుంది . మరియు ఇది మీ ముఖాన్ని బ్రైట్ గా మరియు ఫ్రెష్ గా మార్చుతుంది . మీ చర్మానికి అవసరం అయ్యే హైడ్రేషన్ అందిస్తుంది మరియు డ్రై నెస్ నివారిస్తుంది.

 అరటి మరియు లెమన్ జ్యూస్ ప్యాక్:

అరటి మరియు లెమన్ జ్యూస్ ప్యాక్:

బాగా పండిన అరటిపండు తీసుకొని అందులో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి మరియు మెడకు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ మరియు బ్లెమ్ షెష్ ను నివారిస్తుంది . ఇంకా ఇది చర్మానికి రక్షణ కల్పిస్తుంది చర్మం డ్యామేజ్ కాకుండా చేస్తుంది.

బనానా(అరటి)-తేనె:

బనానా(అరటి)-తేనె:

మనందరికి తెలుసు అరటిపండులోనూ, తేనెలోనూ అద్భుతమైన న్యూట్రియంట్స్ కలిగి ఉన్నాయని. అరటి పండులోని సగభాగం తీసుకొని ఒక బౌల్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దానికి ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ముఖం పొడిబారినట్లు కనబడుతుంటే కనుక ఫేషియల్ స్టీమింగ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకొని చూడండి అద్భుతమైన మార్పు కనబడుతుంది.

బనానా(అరటి)-ఓట్స్:

బనానా(అరటి)-ఓట్స్:

మీరు బాగపండిన అరటి పండుకు ఓట్స్ ను చేర్చి ఫేస్ మాస్క్ అప్లై చేయండి. ఇది ఒక సులభమైన చిట్కా. అరకప్పు ఓట్స్ ను మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని అందులో అరటిపండు గుజ్జును కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ నేచురల్ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత ముఖం మీద నీళ్ళు చల్లుకొని సున్నితంగా రుద్దాలి. తర్వాత జోరుగా నీళ్ళు పోస్తు ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఉన్నా బ్లాక్ హెడ్స్, మృత కణాలు తొలగిపోతాయి.

అరటిపండు-పాలు:

అరటిపండు-పాలు:

రెండు చెంచాల అరటిపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ పాలు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ ముఖం కాంతివంతంగాను, తాజాగాను కనబడుతుంది.

అరటి-షుగర్:

అరటి-షుగర్:

అరటి పండును బాగా మెత్గగా చేసి అందులో కొద్దిగా పంచదార మిక్స్ చేసి ముఖానికి పట్టించి మర్దన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంతో పాటు చర్మానికి అవసరం అయ్యే పోషకాలను అందిస్తుంది.

అరటిపండు -రోజ్ వాటర్:

అరటిపండు -రోజ్ వాటర్:

వేసవికాలంలో చర్మానికి చల్లదాన్ని అందించే రోజ్ వాటర్ ను కొద్దిగా అరటిపండు గుజ్జులో మిక్స్ చేసి, ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మానికి తగినంత తేమను అందివ్వడంతో పాటు, డ్రై నెస్ ను నివారిస్తుంది.

English summary

Best 10 Banana Face Packs For Dry Skin

Banana is very beneficial for skin as it contains many essential nutrients that are needed by the skin. It hydrates the skin and prevents dryness. There are some best banana face pack for dry skin that we will share with you today. These packs make your skin younger looking and glowing.
Desktop Bottom Promotion