For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చెమట నివారించడానికి ఫేస్ మాస్కులు

By Super
|

వేడి రోజులు అంటే చెమట ఎక్కువగా పట్టటం అని అర్థం. మీరు రోజంతా ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చున్నప్పటికీ, వేసవి ప్రభావాన్ని తప్పించుకోవటం సాధ్యం కాదు. కొంతసమయం లేదా ఏదైనా ఇతర కారణం వాళ్ళ మీరు బయటకు అడుగు పెట్టవలసివస్తే మరియు దానికి మీరు సిద్ధంగా లేకుం టే, మీ చర్మం గొప్పగా బాధకు గురవుతుంది. ముఖ చర్మం చెమట నుండి రక్షించేందుకు ఒకే మార్గం ఉన్నది, అదే ఫేస్ మాస్క్లు ఉపయోగించి ముఖాన్ని రక్షించుకోవటం.

పేస్ మాస్క్లు వేసుకోవటం ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనది మరియు చర్మం కోసం ప్రయోజనకరమైనది. ఇది చర్మం బిగపట్టి ఉండేందుకు సహాయపడటమే కాకుండా చర్మానికి అవసరమైన పోషణను ఇస్తుంది. వివిధ చర్మరీతులకు, అలాగే వివిధ వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా వివిధ పేస్ మాస్క్లు ఉన్నాయి. వేసవి వచ్చినప్పుడు, మీ ముఖం మరియు మెడ ప్రాంతాలలో చల్లగా ఉంచేందుకు శీతలీకరణ మాస్క్ అవసరం.

మార్కెట్లో అందుబాటులో అనేకరకాల పేస్ మాస్క్లు అందుబాటులో ఉన్నాయి మరియు అవి మీ సమస్యలను పరిష్కరించటంలో సహాయపడుతున్నాయి. అయినప్పటికిని, ఇంట్లో తయారుచేసుకున్న ప్యాక్ ను ఉపయోగించటం చాలా మంచిది మరియు మీ చర్మానికి ఖచ్చితమైన సురక్షితమైన పోషణ లభిస్తుంది. ఇంట్లో తయారయిన పేస్ మాస్క్లు వాడటం వలన, మీకు ప్రయోజనం చేకూర్చే పదార్థాలు ఏమిటో ఖచ్చితంగా తెలుకోగలుగుతారు మరియు మీ చర్మానికి సరిపడని పదార్థాలను నివారించవచ్చు. మీకు స్టోర్లలో లభించే వాటికంటే మెరుగ్గా తాజాగా ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులు ప్రయోజనకరంగా ఉంటాయి.

Face Masks To Prevent Sweat In Summer

1. ఫుల్లర్స్ భూమి మరియు రోజ్ వాటర్: ఫుల్లర్స్ భూమి లేదా ముల్తాని మిట్టీ, మరియు గులాబీ నీరు రెండూ కూడా ప్రకృతి ద్వారా లభించే శీతలీకరణ కారకాలు. రెండింటి కలయిక ప్రభావం వలన మీ చర్మానికి శీతలీకరణ అందించబడుతుంది మరియు వేసవిలో వేసుకోవలసిన ఫేస్ ప్యాక్ సరిగ్గా ఇదే.. ఫుల్లర్స్ ఎర్త్ మరియు రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారుచేయండి మరియు దానిని పట్టించండి. ఒక అరగంట వరకు లేదా అది ఆరేవరకు వదిలివేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.

2. పాలు మరియు తేనె: పాలు దుమ్ము మరియు జిడ్డు వదిలించుకోవటంలో సహాయపడతాయి. పాలు చర్మ రంధ్రాలను తెరుచుకునేట్లుగా చేస్తాయి. వాటిని శుభ్రం చేసి, చర్మానికి తేలిగ్గా గాలి అందటానికి సహాయపడతాయి. తేనెలో,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటంవలన, చర్మానికి మంచి పౌష్టికత అందుతుంది మరియు ముఖానికి మంచి మెరుపు తెస్తుంది. పాలు, తేనె, రెండింటిని కలిపి పట్టించండి మరియు అరగంట తర్వాత కడగండి.

Face Masks To Prevent Sweat In Summer

3. దోసకాయ పేస్ట్: దోసకాయ యొక్క శీతలీకరణ ప్రభావాల గురించి మనందరికీ తెలుసు. కనుక స్వెట్టింగ్ నిరోధించడానికి వేసుకునే పేస్ మాస్కులలో దోసకాయ అవసరం యెంత ఉన్నదో చెప్పకుండా ఉంటామా? ఒక దోసకాయను తీసుకుని దానిని మెత్తగా చేయండి మరియు ఆ పేస్ట్ ను ముఖానికి పూయండి. ఇరవై నిమిషాలు దానిని అలానే ఉంచి, తరువాత కడిగేయండి.

4. అలో వేరా జెల్:
అలోవేరా జెల్ అనేక రూపాల్లో ఉన్న ఒక వరం వంటిది. దీనిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఇది సూర్యుడు యొక్క బలమైన శక్తులు పోరాడే విషయంలో అలోవేరా జెల్ సమర్థవంతమైన రక్షణ అని నిరూపితమైంది. మీరు దీనిని చల్లని స్టోర్లలో పొందవచ్చు లేదా మీ ఇంట్లో పెంచుకునే మొక్క నుండి పొందవొచ్చు. ఈ జెల్ ని ముఖానికి పట్టించండి మరియు ఒక గంటన్నర తరువాత చల్లని నీటితో కడగండి.

Face Masks To Prevent Sweat In Summer

5. పుదీనా మరియు పసుపు: పుదీనా వేసవి సమయంలో చాలా అవసరమైన పదార్ధం. దీని శీతలీకరణ ప్రభావాలు, వేడి వాతావరణంలో ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ నిర్వహణలో అద్భుతాలు చేస్తాయి. ఇది ఫేస్ ప్యాక్ రూపాలో కూడా ఇది చర్మం తాజాగా, చల్లగా మరియు చాలా సమయం వరకు చెమటను నిరోధకారిగా పని చేస్తుంది. ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకోండి మరియు ఒక పేస్ట్ చేయడానికి వాటిని గట్టిగా నలపండి. టీ స్పూన్ సగం,పసుపు పొడి ఆ పేస్టుకి బాగా కలపండి మరియు దానిని పేస్ మాస్క్ లాగా వేయండి. పుదీనా చర్మాన్ని చల్లబరుస్తుంది, పసుపు చిన్నచిన్న చర్మసమస్యలు తొలగిస్తుంది.

6. గుడ్డు మరియు పసుపు: గుడ్డులోని తెల్లసొన ఒక శీతలీకరణి మరియు దీని ప్యాక్ లాగా వేసుకోవటం వలన చర్మం బిగుతుగా ఉంటుంది.మరోవైపు పసుపు ఏంటి సెప్టిక్ మరియు మచ్చలను తొలగిస్తుంది. గుడ్డులోని తెల్లసొన మరియు కొంత పసుపు తీసుకుని బాగా కలపండి. దీనిని ముఖం మరియు మెడ ప్రాంతంలో ఒక ప్యాక్ లాగా పూయండి మరియు పొడిగా ఆరేవరకు ఉంచండి. తరువాత చల్లని నీటితో కడగండి.

Face Masks To Prevent Sweat In Summer

7. అరటిపండు మరియు హనీ పేస్ట్: అరటిపండు చర్మాన్ని చల్లగా, తేమగా ఉంచుతుంది మరియు మచ్చలను నివారిస్తుంది. తేనె యాంటీ ఆక్సిడెంట్ అవటంవలన ఇది చర్మంపై మ్యాజిక్ లాగా పని చేసి చర్మాన్ని వేసవి రోజుల్లో కూడా ప్రకాశవంతంగా ఉంచుతుంది.

8. నిమ్మ మరియు తేనె:
నిమ్మ రసం మరియు తేనె 1: 2 నిష్పత్తిలో కలండి మరియు రిఫ్రిజిరేటర్ లో నిల్వచేయండి. అవసరం అనుకున్నప్పుడు, ఫ్రిజ్ నుండి ఈ నిమ్మ మరియు తేనె ప్యాక్ ను నేరుగా వర్తిమ్పచేయండి. నిమ్మకాయ తాన్ తొలగించడానికి సహాయపడుతుంది మరియు తేనె మలినాలను వదిలించుకోవటంలో సహాయపడుతుంది. ఒక చల్లని ప్యాక్ గా ఉండటంతో, ఇది వేసవి రోజుల్లో చర్మానికి ఉపశమనం అందిస్తుంది.

Face Masks To Prevent Sweat In Summer

9. ఆవాల గింజలు మరియు రోజ్ వాటర్: ఆవాలనూనె శీతాకాలంలో వర్తిమ్పచేయటం చాలా ఉపయోగకరం కానీ గ్రౌండ్ ఆవాలు వేసవికాలంలో మంచివి . o ఆవాలు పొడిగా అయ్యేవరకు గ్రైండ్ చేయండి. ఈ పొడిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్టు లాగా చేసుకోండి. ముఖం మరియు మెడ ప్రాంతంలో ఈ పేస్ట్ ను వర్తింపచేయండి మరియు పొడిగా ఆరేవరకు ఉంచండి. తరువాత చల్లని నీటిని ఉపయోగించి కడగండి.

10. గంధం, కొబ్బరి నీరు: గంధం, కొబ్బరి నీరు - వేడి మరియు చెమటతోఉన్న రోజులలో ఇది ఖచ్చితమైన కలయిక. రెండు కూడా చర్మంపై శీతలీకరణ ప్రభావాలను చూపిస్తాయి మరియు చర్మ రక్షణకారులుగా పరిగణించవచ్చు. ఈ పేస్టును వాడటం వలన మీ ముఖం మీద చెమట పట్టకుండ ఉండటం చూసి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కొబ్బరి నీరుతో గంధపుపొడి కలపండి మరియు ఈ పేస్టును ముఖానికి పట్టించండి. పొడిగా ఆరేవరకు ఉంచి, చల్లని నీటితో కడగండి.

English summary

Face Masks To Prevent Sweat In Summer

Hot days mean excessive sweating. Even though you sit in an air conditioned room all day, the effects of summer cannot be escaped. Sometime or the other, you will have to step out and if you are not prepared, your skin can suffer greatly.
Desktop Bottom Promotion