For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి సూపర్ టిప్స్

|

ఇండియన్ మహిళలకు చర్మ సౌందర్యం ప్రధాణ ఆకర్షణ. అందుకోసమే మహిళలకోసం ప్రత్యేకంగా తయరయ్యే వివిధ రకాలైన క్రీమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. అయితే కొంత మంది మహిళలు మాత్రం ఇప్పటికీ కొన్ని హోం రెమెడీస్ నే ఉపయోగిస్తున్నారు . మీరు తక్షణం మంచి చర్మ సౌందర్యాన్ని వెంటనే పొందాలనుకుంటే కొన్ని క్విక్ స్కిన్ కేర్ రెమెడీస్ ఉన్నాయి. వీటిని మీరు ఒక్కొక్క దాన్ని అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మొదటగా, మీరు వెంటనే మంచి చర్మ సౌందర్యాన్ని పొందాలంటే మీ చర్మ తత్వానికి సూట్ అయ్యే హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవాలి. మీకు కనుక సెన్సిటివ్ స్కిన్ ఉంటే, కఠినమైన కెమికల్స్ మీ చర్మానికి అప్లై చేసినప్పుడు చర్మంను బర్న్ చేస్తుంది. కొన్ని సింపుల్ హోం రెమెడీస్ చర్మానికి మంచి కాంతిని అందిస్తుంది. అలాంటి సింపుల్ హోం రెమెడీస్ లో మిల్క్ క్రీమ్, పెరుగు, శెనగపిండి, రోజ్ వాటర్ ఇలాంటి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని హోం రెమెడీస్ మీకోసం....

1. మిల్క్ పౌడర్:

1. మిల్క్ పౌడర్:

ప్రతి రోజూ ఉదయం చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. ముఖం మీద పాలు చిలకరించి చేత్తో బాగా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖంలో మంచి గ్లో వస్తుంది.

2. చీజ్:

2. చీజ్:

చీజ్ ను తురిమి, మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన చీజ్ ను ముఖం మరియు మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. శెనగపిండి మరియు రోజ్ వాటర్ :

3. శెనగపిండి మరియు రోజ్ వాటర్ :

మీరు వెంటనే ఫలితం చూడాలంటే, ఈ చిట్కా గ్రేట్ గా పనిచేస్తుంది. శెనగపిండి మరియు రోజ్ వాటర్ రెండు మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తుంటే 4 వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.

4. బాదం పేస్ట్:

4. బాదం పేస్ట్:

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది . అంతే కాదు ఇది ముఖంలో మచ్చలు మరియు మెటిమలను మాయం చేస్తుంది.

5. పెరుగు మరియు నిమ్మరసం:

5. పెరుగు మరియు నిమ్మరసం:

పెరుగులో ఆసిడ్స్ మరియు నిమ్మలో సిట్రిక్ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ పదార్థాలు మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేయాలి . ఇలా వారంలో 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. టమోటో గుజ్జు:

6. టమోటో గుజ్జు:

టమోటోలో లైకోపిన్ ఉండటం వల్ల ఇది సన్ టాన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ చాయిస్.

7. జీలకర్ర:

7. జీలకర్ర:

జీలకర్రను కొద్దినీరులో వేసి బాగా మరిగించాలి తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

8. కోకనట్ వాటర్:

8. కోకనట్ వాటర్:

టండర్ కోకనట్ చర్మంను ఆరోగ్యంగా మరియు బ్రైట్ గా చేస్తుంది. కోకనట్ వాటర్ త్రాగడంతో పాటు ముఖానికి అప్లై చేస్తే మంచి కలర్ వస్తుంది.

9. రోజ్ వాటర్:

9. రోజ్ వాటర్:

ప్రతి రోజూ రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. మరియు చర్మం క్లియర్ గా మార్చుతుంది. రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేసేప్పుడు, సోపును ఉపయోగించకండి.

10. ఎగ్ వైట్:

10. ఎగ్ వైట్:

గుడ్డులోని తెల్లసొన ను ముఖానికి పట్టించి, ఆరే వరకూ ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Fast Ways To Get Fair & Glowing Skin

Fair skin has always been a top favourite for Indian women. Though there are multiple creams available in the market, Indians always opt for home remedies. To get fair and glowing skin quickly there are certain things you need to follow step by step.
Story first published: Saturday, May 23, 2015, 16:04 [IST]
Desktop Bottom Promotion