For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కుపై బ్లాక్ హెడ్స్ ను మాయం చేసే సింపుల్ స్ర్కబ్స్

|

బ్లాక్ హెడ్స్ ను నివారించే స్క్రబ్స్ వివిధ రకాలుగా మరియు చాల సింపుల్ గా ఉన్నాయి. ముక్కు మీద ఉండే బ్లాక్ హెడ్స్ నివారించడానికి ఈ హోం మేడ్ స్క్రబ్స్ ఉపయోగించడం ద్వారా చాలా ఎఫెక్టివ్ గా తొలగించబడుతాయి. ముక్కు మీద బ్లాక్ హెడ్స్ నివారించే ముందు ముఖంలో కానీ, ముక్కు మీద కానీ మొదట ఆయిల్ మరియు మురికిని తొలగించాలి. అందుకు చల్లటి నీటితో ముఖం శుభ్రంగా కడగాలి.

బ్లాక్ హెడ్స్ నివారించడానికి ముందుగా ముఖం శుభ్రంగా కడిగి తర్వాత ఫేస్ స్ర్కబ్ ను అప్లై చేయడం వల్ల ముక్కుమీద అస్యహ్యాంగా లేకుండా ఉంటుంది. ఈ హోం మేడ్ స్ర్కబ్ ను ఉపయోగించడం ప్రయోజనకరం అంతే కాదు ఎలాంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు. సెన్సిటివ్ స్కిన్ అయినా కూడా ఈ హోంమేడ్ స్ర్కబ్స్ వల్ల ఎలాంటి హాని జరగదు.

బ్లాక్ హెడ్స్ నివారించడానికి ఈ హోం మేడ్ స్ర్కబ్స్ ను తయారుచేయడం చాలా సులభం మరియు ఎక్కువ సమయం తీసుకోదు. అయితే ఈ హోంమేడ్ స్ర్కబ్స్ ను తయారుచేసిన వెంటనే ఉపయోగిస్తే మంచిఫలితం ఉంటుంది. తయారుచేసిన ఫేస్ స్ర్కబ్ ను తయారుచేసి స్టోర్ చేయడం వల్ల ఫలితం అంత ఎఫెక్టివ్ గా ఉండదు.

మరి ముక్కుమీద బ్లాక్ హెడ్స్ నివారించే ఎఫెక్టివ్ స్ర్కబ్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

1. శెనగపిండి:

1. శెనగపిండి:

శెనగపిండి కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేసి దీన్ని ముఖం మరియు ముక్కు మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

2. సాల్ట్ స్ర్కబ్:

2. సాల్ట్ స్ర్కబ్:

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ సాల్ట్. సాల్ట్ ను ముక్కు మీద వేసి సున్నితంగా మర్ధ చేయడం వల్ల ఎలాంటి మచ్చలు లేకుండా, స్కార్స్ లేకుండా బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది.

3. షుగర్ స్ర్కబ్:

3. షుగర్ స్ర్కబ్:

బ్లాక్ హెడ్స్ ను నివారిండచంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ షుగర్ స్ర్కబ్ . కొద్దిగా నీటిలో పంచదార వేసి మిక్స చేసి పేస్ట్ ను ముక్కు మీద అప్లై చేసి, మర్దన చేయాలి.ఇలా క్రమం తప్పకుండా వారంలో రెండు మూడు సార్లు చేస్తే చాలు బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది.

4. వాల్ నట్ స్ర్కబ్:

4. వాల్ నట్ స్ర్కబ్:

ఫేస్ ఉపయోగించే స్ర్కవ్ కూడా బ్లాక్ హెడ్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందులో వాల్ నట్ స్ర్కబ్ ఒకటి. ఇందులో విటమిన్ ఇ ఉండటం వల్ల చర్మానిక చాలా మేలు చేస్తుంది.

5. దాల్చిన చెక్క:

5. దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముక్కు మీద అప్లై చేసి స్ర్కబ్ చేయాలి . ఈ ఫేస్ స్క్రబ్ రెగ్యులర్ గా చేస్తుంటే, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

6. గుడ్లు:

6. గుడ్లు:

ఎగ్ వైట్ లో రెండు చెంచాల తేనె మిక్స్ చేసి, ముఖం మరియు ముక్కు మీద అప్లై చేయాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే మంచి బ్లాక్ హెడ్స్ కనబడకుండా మాయం అవుతాయి.

7. పెరుగు:

7. పెరుగు:

పెరుగు మరియు ఓట్స్ పౌడర్ రెండూ మిక్స్ చేసి ముఖానికి మరియు ముక్కు మీద అప్లై చేసి స్ర్కబ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మాన్ని చల్లగా మార్చుతుంది.

8. బేకింగ్ సోడ:

8. బేకింగ్ సోడ:

ఒక బౌల్లో బేకింగ్ సోడా తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖం మరియు ముక్కు మీద అప్లై చేసి స్ర్కబ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ నివారించబడుతాయి .

9. తేనె:

9. తేనె:

బ్లాక్ హెడ్స్ నివారించడంలో తేనె గ్రేట్ గా పనిచేస్తుంది. అంతే కాదు ముఖంలో ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది.

10. టూత్ పేస్ట్ :

10. టూత్ పేస్ట్ :

బ్లాక్ హెడ్స్ నివారించడంలో టూత్ పేస్ట్ కూడా...టూత్ పేస్ట్ కు ముక్కుమీద అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

11. నిమ్మరసం:

11. నిమ్మరసం:

నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు చేసి ముఖానికి పట్టించి, ముక్కు మీద అప్లై చేసి మర్దన చేస్తే బ్లాక్ హెడ్స్ చాలా త్వరగా నివారించబడుతాయి.

12. టమోటోలు:

12. టమోటోలు:

టమోటోలలో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు బ్లాక్ హెడ్స్ ను నేచురల్ గానే డ్రైగా మార్చేస్తాయి. టమోటోను ముక్కలుగా కట్ చేసి ముఖం మరియు ముక్కు మీద మర్దన చేయాలి.

English summary

12 Homemade Scrubs For Blackheads On Nose

These scrubs for blackheads are amazing and so simple to prepare. To use these scrubs for blackhead on the nose, you have to first remove the oil and dirt from the region with the help of water.
Story first published: Thursday, April 23, 2015, 14:00 [IST]
Desktop Bottom Promotion