For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోనే ఎఫెక్టివ్ అండ్ నేచురల్ స్కిన్ బ్లీచింగ్ టిప్స్

By Super
|

మీ చర్మ తత్వాన్ని కాంతివంతంగా చేయడానికి స్కిన్ బ్లీచింగ్ అనేది చాలా మంచి మరియు సులభ టెక్నిక్. మరియు కొన్ని రకాల చర్మ సమస్యలు స్కిన్ టానింగ్ మరియు స్కిన్ టోన్ వంటివి తగ్గిస్తుంది. అయితే సున్నితమైన చర్మతత్వానికి జాగ్రత్త వహించడం చాలా కష్టం. ఎందుకంటే సున్నిత చర్మానికి స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్స్ ను ఉపయోగించడం వల్ల చాల రకాల సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. కాబట్టి సున్నిత చర్మతత్వానికి నేచురల్ బ్లీచ్ ను ఉపయోగించడం వల్ల చాలా ప్రభావవంతమైన మార్పులను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకొస్తుంది. మీది చాలా సున్నిత చర్మం అయితే ఈ క్రింది నేచురల్ బ్లీచ్ ఐడియాస్ ను ఫాలో అవ్వండి ఇది మీకు తాజా మరియు గ్లోయింగ్ స్కిన్ ను అంధిస్తుంది.

సాధారణంగా మన చర్మం, పొడి బారడం, మొటిమలు, మచ్చలతో అసహ్యంగా కనబడుతుంటుంది అటువంటప్పుడు బ్లీచింగ్(మెడకు కూడా)చేసుకోవడం చాలా మంచిది. అందుకు ఇక్కడ నార్మల్ బ్లీచింగ్ చేసుకోవడానికి కొన్ని హోం రెమడీస్ మీకు అందిస్తున్నాం. అవి మీకు ఎటువంటి ఫలితాన్ని గమనించండి. అయితే వెంటనే ప్రభావం చూపకపోయినా... కొద్దికాలం తర్వాత ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు.

బంగాళ దుంప బ్లీచింగ్ ప్యాక్

బంగాళ దుంప బ్లీచింగ్ ప్యాక్

బంగాళదుంప ఒక నేచురల్ బ్లీచింగ్ఏజెంట్ మరియు ఇది చాలా ఎఫెక్టివ్ గా ట్యానింగ్ నివారిస్తుంది . బంగాళ దుంప తొక్క తీసి తురుముకోవాలి. అందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి గ్రైండ్ చేసి పేస్ట్ లా చేయాలి . మీది పొడి చర్మం అయితే అందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. మీది ఆయిల్ స్కిన్ అయితే నిమ్మరసం మిక్స్ చేయాలి. ఎండ తగిలే ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. అరగంట ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ బ్లీచింగ్ టిప్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ముఖంలో బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి.

 టమోటో ప్యాక్ తో మంచి చర్మం కాంతి మరియు ఫెయిర్ నెస్

టమోటో ప్యాక్ తో మంచి చర్మం కాంతి మరియు ఫెయిర్ నెస్

టమోటో విటమిన్ సి మరియు అసిడిక్ లు కలిగి ఉన్నాయి . ఈ విటమిన్ చర్మానికి చాల మేలు చేస్తుంది. బాగా పండిన టమోటో తీసుకొని బాగా మ్యాష్ చేసి, స్టెయినర్ తో వడగట్టుకోవాలి ,విత్తనాలు తొలగించి అందులో ఒక కప్పు పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. తర్వాత తేమలేకుండా తుడిచి ఆలివ్ ఆయిల్ తో మర్ధన చేయడం వల్ల చర్మంలో స్కార్స్ మరియు మచ్చలు తొలగిస్తుంది . స్కిన్ టోన్ మార్చేస్తుంది.

కీరదోసకాయతో బ్లీచ్ చేయాలి:

కీరదోసకాయతో బ్లీచ్ చేయాలి:

కీరదోసకాయకు తొక్క తొలగించి, తురుముకోవాలి, తర్వాత అందులో నుండి రసం తీసి, అందులో కొద్దిగా అలోవెరా జ్యూస్ మిక్స్ చేసి ముఖం, మెడ, బ్యాక్ అప్లై చేయాలి. చర్మం రంగు మార్చడంతో పాటు, చర్మాన్ని కూల్ చేస్తుంది .

ఆరెంజ్ పీల్ ప్యాక్:

ఆరెంజ్ పీల్ ప్యాక్:

ఆరెంజ్ లో వలే, ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు ఇది బ్లీచింగ్ ఏజెంట్ వలె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎండలో ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఇది ఎండిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ -నిమ్మరసం

నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ -నిమ్మరసం

నిమ్మరసం: నిమ్మ సిట్రస్ జాతికి చెందినది. ఇది నేచురల్ స్కిన్ బ్లీచ్ గా తక్షణ ప్రభావాన్ని చూపెడుతుంది. నిమ్మరసాన్ని పిండి ముఖానికి అప్లై చేయాలి. 10-15నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం అప్లై చేసి శుభ్రం చేసుకొన్న తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ ను వాడాలి లేదంటే చర్మం పొడిబారీ పోతుంది.

ఓట్ మీల్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్

ఓట్ మీల్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్

ఓట్ మీల్ బ్లీచ్: ఓట్ మీల్ ను మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసి, అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

English summary

How To Bleach Your Skin At Home?: Beauty Tips in Telugu

Have you looked into the mirror, only to see dark and lifeless skin? Have you often wondered if there was a natural way to lighten your skin at home? Of course, there is! Bleaching creams in the market contain harmful chemicals, which despite making your skin look fair, can also cause long-lasting side effect
Desktop Bottom Promotion