For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం కాంతివంతం చేసే ట్యామరిండ్ మ్యాజిక్

|

మన భారతదేశంలో ముఖ్యంగా సౌంత్ ఇండియాలో వంటగదిలో వినియోగించే చింత పండు లేదా చింతకాయ ఒక నిత్యవసర వస్తువు. చింతకాయ వంటలకు సోర్(పుల్లని) టేస్ట్ ను అందివ్వడం మాత్రమే కాదు. ఇది సౌందర్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నది. చింతకాయను చర్మానికి అప్లై చేయడం వల్ల ఇది చర్మం యొక్క రంగును నేచురల్ గా తగ్గిస్తుంది మరియు అదే సమయంలో ముఖంలో మచ్చలను నివారిస్తుంది.

అందువల్ల, ఈ వంటగది వస్తువు మీ సున్నితమైన చర్మాన్ని బర్న్ చేయవచ్చు. లేదా చర్మ సమస్యకు లేదా దురదకు కారణం కావచ్చు . కాబట్టి, దీన్ని ముఖానికి అప్లై చేయడానకి ముందు చెవి వెనుక భాగంలో లేదా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇరిటేషన్ లేదా చర్మ సమస్య లేదనిపించినప్పుడు దీన్ని సౌందర్య వస్తువుగా ఉపయోగించుకోవచ్చు.

READ MORE: వేసవిలో పొడి బారిన చర్మం నివారించే బానానా ఫేస్ ప్యాక్స్

చింతకాయను సౌందర్య ఉత్పత్తిగా ఉపయోగిస్తుంటే కొన్ని రోజుల తర్వాత మంచి ఫలితం ఉంటుంది. చర్మంను తెల్లగా మార్చుకోవడానికి చింతకాయతో పాటు మరికొన్ని బ్యూటి ప్రొడక్ట్స్ ను జోడించి అప్లై చేస్తుంటే, ఇది చర్మానికి హానికలిగించింది.

READ MORE: ఇండియన్ స్కిన్ కు అలోవెరతో ఫర్ఫెక్ట్ ఫేస్ ప్యాక్

ఉదహారణకు: చింతకాయను ముఖానికి అప్లై చేసి, శుభ్రం చేసుకొన్న తర్వాత ముఖానికి ఆలివ్ ఆయిల్ ను అప్లై చేసుకోవాలి. చింతకాయను ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మం సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి, టామరిండ్ ఫేస్ ప్యాక్ తర్వాత నేచురల్ ఆయిల్స్ మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

1. ఫేస్ వాష్ ను ఉపయోగించాలి:

1. ఫేస్ వాష్ ను ఉపయోగించాలి:

మీ చర్మానికి చింతకాయను ఉపయోగించడానికి ముందు ఫేష్ వాష్ గా ఉపయోగించాలి. సింపుల్ గా చింతకాయలను నీటిలో నానబెట్టి, తర్వాత వాటిని తీసి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

2. ఫేస్ మాస్క్:

2. ఫేస్ మాస్క్:

టామరిండ్ (చింతకాయ)పేస్ట్ ను ఫేస్ ప్యాక్ గా వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పచ్చి చింతకాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని మీ పొడి చర్మం మీద అప్లై చేయాలి.ఎండిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

3. ఫేస్ స్ర్కబ్ గా ఉపయోగించాలి:

3. ఫేస్ స్ర్కబ్ గా ఉపయోగించాలి:

చింతకాయను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి మర్దన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ నివారించబడుతుంది . ఇలా చేయడం వల్ల మీ ముఖ కాంతిలో మార్పువస్తుంది. మునుపటికంటే కాంతివంతంగా మారుతుంది.

4. ఫేస్ టోనర్ గా ఉపయోగించాలి:

4. ఫేస్ టోనర్ గా ఉపయోగించాలి:

చర్మాన్ని కాంతివంతంగా, తెల్లగా మార్చడానికి చింతాకయను ఉపయోగించడానకి మాత్రమే కాకుండా దీన్ని స్కిన్ టోనర్ గా కూడా ఉపయోగిస్తున్నారు . చింతకాయ పేస్ట్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ వేసవి సీజల్ లో చర్మానికి టోనర్ గా ఉపయోగించాలి.

5. ఎక్స్ ఫ్లోయేటర్ :

5. ఎక్స్ ఫ్లోయేటర్ :

టామరిండ్ పౌడర్ మరియు టామరిండ్ జ్యూస్ ను ఎక్స్ ఫ్లోయేటర్ గా ఉపయోగించుకోవచ్చు . ఇది చర్మం యొక్క క్వాలిటీని పెంచుతుంది. దాంతో మీరు ఫెయిర్ గా మరియు అందంగా కనబడుతారు.

6. డార్క్ సర్కిల్స్:

6. డార్క్ సర్కిల్స్:

కొంత మందికి కళ్ళ క్రింది నల్లని వలయాల వల్ల ముఖం డల్ గా మరియు డార్క్ గా కనబడుతుంది. అందువల్ల డార్క్ సర్కిల్స్ నివారించడానికి, కళ్ళ క్రింది చర్మం తిరిగి తెల్లగా మారడానికి ఈ టామరిండ్ ఫేస్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది . మాస్క్ వేసుకొని పది నిముషాలు అలాగే ఉండి తర్వాత చల్లటి పాలతో తొలగించాలి.

7. పేస్ట్ చేయడానికి: కావల్సలినవి:

7. పేస్ట్ చేయడానికి: కావల్సలినవి:

* చింతకాలయను మంచినీటిలో వేసి శుభ్రంగా కడగాలి.

* తర్వాత వీటిని మిక్సీలో వేసి, కొద్దిగా పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా పసుపు కూడా చేర్చవచ్చు .

* ఇలా చేసిన తర్వాత 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి . తర్వాత ఈ పేస్ట్ కు ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

8. ట్యామరిండ్ జ్యూస్ :

8. ట్యామరిండ్ జ్యూస్ :

స్కిన్ లైటనింగ్ కోసం ట్యామరిండ్ జ్యూస్ తయారీ :

* ఫ్రెష్ గా ఉన్న చింతకాయలను వుభ్రం చేయాలి.

*తర్వాత లోపలి విత్తనాలను తొలగించాలి .

* గోరువెచ్చని నీటిలో 3 పీసుల చింతకాయను నానబెట్టాలి.

* నీరు మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

9. నేచురల్ ఆయిల్స్ ఉపయోగించాలి:

9. నేచురల్ ఆయిల్స్ ఉపయోగించాలి:

చింతకాయను ఫేస్ ప్యాక్ గా వేసుకొన్న తర్వాత, పాలతో లేదా చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసి, తడి ఆరిన తర్వాత కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వంటి నేచురల్ ఆయిల్స్ తో ముఖం మసాజ్ చేయాలి. ఇది మీ చర్మానికి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ను అందిస్తుంది.

10. పాలు:

10. పాలు:

మీది జిడ్డు చర్మం కాకపోతే, స్వచ్చమైన పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . ఇది మీ చర్మం తాజాగా మరియు ఫ్రెష్ గా ఉండటానికి సహాయపడుతుంది.

English summary

How To Use Tamarind For Skin Whitening?

Tamarind is one of the best things to use on your face to improve your colour naturally. Using tamarind on your skin will remove blemishes in no time as well.
Desktop Bottom Promotion