For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకృతి ప్రసాధించిన సహజసిద్ద చర్మ సంరక్షణ పదార్థాలు

|

ప్రకృతి అనేది చాలా ఆహ్లాదకరమైనది. అంతే కాదు, ప్రకృతిలో సహజసిద్దంగా దొరికే పదార్థాలన్ని కూడా దేవుడు మనకు ప్రసాధించిన వరం లాంటివి . ఎందుకంటే వీటిలో అనేక ఔషధగుణాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి మరియు అందానికి వివిధ రకాలుగా సహాయపడుతాయి. ఇలా మనకు సహజసిద్దంగా దొరికిన పదార్థాల గురించి క్షుణంగా తెలుసుకొన్నట్లైతే ఇతర మెడిసిన్స్ మీద మనం ఆధారపడవల్సిన అవసం ఉండదు .

ఇలాంటి సహజసిద్ద పదార్థాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అద్భుతమైన స్కిన్ కేర్ రెమెడీస్ గా కూడా చాలా సులభంగా మనకు సహాయపడుతాయి. ఈ చౌకైన నేచురల్ పదార్థాలు చర్మానికి అదనపు గ్లోను అందిస్తుంది మరియు ముఖం మంచి షైనింగ్ తో మరియు చర్మం హెల్తీగా మారుతుంది. మరియు ఇవి వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.READ MORE: మొటిమలు-మచ్చలను నివారించి, చర్మంకాంతివంతం చేసే క్యారెట్ జ్యూస్

సహజసిద్దంగా చర్మం సంరక్షణ ఎలా? అన్న విషయం మీద ఈ రోజు బోల్డ్ స్కైమీకోసం కొన్ని నేచురల్ స్కిన్ కేర్ రెమెడీస్ ను పరిచయం చేస్తుందని, వీటి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు వీటిని ఉపయోగించి మీ చర్మఆరోగ్యానికి కాపాడుకోండి...

పాలు:

పాలు:

ఇది ఒక నేచురల్ క్లెన్స్ మరియు చర్మ ఛాయను మెరుగుపరచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది . ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. మరియు పాలు చర్మాన్ని సాప్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది. క్లీన్ కాటన్ ను తీసుకొని దాంతో పాలను ముఖానికి అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. స్కిన్ కేర్ లో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

నిమ్మరసం :

నిమ్మరసం :

అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది మరియు స్కిన్ రాషెస్, మరియు బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది. నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి ఒక భాగం తీసుకొనే ముఖం మొత్తాన్ని మర్ధన చేయాలి . ఇది కూడా చర్మ సంరక్షనలో ఒక ఉత్తమ నేచురల్ స్కిన్ కేర్ మెడీ . మొటిమలు మరియు మచ్చలను చాలా గ్రేట్ గా నివారిస్తుంది.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడో చర్మానికి తగిన పోషణను మరియు తేమను అందిస్తుంది. అంతే కాదు చర్మ ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి ఒక ఉత్తమ డైట్ వంటిది . అవొకాడో పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప:

బంగాళదుంప:

కళ్ళక్రింద నల్లటి వలయాలను నివారించడానికి మరియు స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరియు ఇది చర్మంలో మొటిమల యొక్క మచ్చలు మరియు మెటిమలను నివారిస్తుంది. బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మర్దన చేయాలి. లేదా బంగాళ దుంపను పేస్ట్ గా చేసి ముఖానికి పట్టించాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బాదం:

బాదం:

ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. మరియు చర్మంను హెల్తీగా మార్చుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, చర్మ సంరక్షణకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బాదంను నీళలో వేసి రెండు మూడు గంటలు నానబెట్టి, పేస్ట్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేసి, స్ర్కబ్ చేయాలి.

 పెరుగు:

పెరుగు:

ఇది మరో బెస్ట్ నేచురల్ క్యూర్. అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. చర్మ ఛాయను మార్చుతుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేసి, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది . పెరుగును ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చర్మ సమస్యలను నివారించడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ స్కిన్ కేర్ పదార్థం.

English summary

6 Of Nature’s Skincare Remedies

Nature has gifted us with many remedies in the form of foods that heal and cure our skin. There is no need of medicated cure if we focus and know what nature has provided us with. We are blessed with excellent natural skin care remedies that are easy to use on skin. They add glow, shine and make your skin healthy. They also treat various skin infections.
Story first published: Monday, March 30, 2015, 12:31 [IST]
Desktop Bottom Promotion