For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీజనల్ స్కిన్ కేర్ : మాన్ సూన్ స్కిన్ కేర్ టిప్స్

|

తొలకరి జల్లులు... చర్మం మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ కు తగిన విధంగా తలెత్తే ఇబ్బందులను తట్టుకోవడానికి ఒక సమగ్రమైన ఆల్ రౌండ్ స్కిన్ కేర్ రొటీన్ అవసరం మండే ఎండల నుండి వర్షాలు ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే... అదే సమయంలో చర్మ సంరక్షణ అనేది కూడా ఈ సీజన్‌లో అంతే ప్రధానం.

ఈ సీజన్ లో క్లీనింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ వంటి వాటికి న్యూట్రోజెనా డీప్‌ క్లీన్‌ ఫేషియల్‌ ఆయిలీ స్కిన్‌ కైనా, డల్‌ స్కిన్‌ కైనా ఇవి నప్పుతాయి. చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మం కాంతి వంతంగా, మృదువుగా మారేలా చేస్తాయి.

READ MORE:ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు

వర్షాకాలంలో స్కిన్‌ కి చెప్పలేనంత హాని కలుగుతుంది. చర్మం ఒకసారి పొడిబారిపోయి బిగదీసుకుపోయినట్లుంటే ఇంకోసారి జిడ్డుపట్టి బంకలు సాగుతుంటుంది. శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదురవుతాయి కాబట్టి తక్కువ గాఢతగల ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కుని, రెండు మూడు నిమిషాల తర్వాత అంటే ఆ తడి ఆరకముందే మంచి మాయిశ్చరైజర్‌తో సున్నితంగా మర్దించాలి. అలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.

READ MORE: ఆయిల్ స్కిన్ నివారించడానికి టాప్ 12 హోం మేడ్ టోనర్స్

కొందరి చర్మం అతి సున్నితమైనది. ఏ సీజన్‌కు ఆ సమస్యలు బాధిస్తుంటాయి. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తక్కువేం కాదు. అవి రాకుండా..

టీ ట్రీ ఆయిల్‌

టీ ట్రీ ఆయిల్‌

తేయాకు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా తేయాకు నూనె క్రిమిసంహారిని. చిన్న చిన్న పగుళ్లు, దద్దుర్లు, మొటిమలు వంటి వాటికి చక్కటి ఉపశమనం ఇస్తుంది.

అలొవీర జెల్‌

అలొవీర జెల్‌

ఇది అన్నివేళలా చర్మానికి దివ్యౌషధం. వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకైతే అద్భుతమైన విరుగుడు. చర్మంలోని రక్తకణాలను కూడా శుభ్రం చేసే శక్తి అలొవీరకు ఉంది. బయటికి వెళ్లినప్పుడు జెల్‌ను రాసుకోవడం ఉత్తమం.

తేనె

తేనె

సహజసిద్ధమైన సౌందర్యానికి ప్రకృతి సహజమైన తేనెకంటే మంచిది ఇంకేమీలేదు. పొడి చర్మానికి చక్కటి మందు. బ్రౌన్‌షుగర్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసంలను కలిపి ముఖానికి మాస్క్‌ వేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.

తాజాపండ్లు

తాజాపండ్లు

తాజా మామిడి, దానిమ్మ పండ్లు చర్మం మీద మచ్చలు ఏర్పడకుండా కాపాడతాయి. పుచ్చకాయ రసంలోకి మిల్క్‌పౌడర్‌ను కలుపుకుని రాసుకున్నా కూడా చర్మం మీదున్న తాత్కాలిక మచ్చలు తగ్గుతాయి.

యాంటీ ఫంగల్‌ పౌడర్‌

యాంటీ ఫంగల్‌ పౌడర్‌

వర్షాకాలంలో అతిపెద్ద సమస్య ఫంగస్‌. శుభ్రత లోపించినా.. లేకపోతే అపరిశుభ్రమైన వాతావరణంలోకి వెళ్లినా.. వెంటనే ఫంగస్‌ దాడి చేస్తుంది. వీటి బారి నుండి తప్పించుకోవాలంటే.. యాంటీ ఫంగల్‌ పౌడర్‌ను అద్దుకుంటే చాలు. ఫంగస్‌ అంత తొందరగా అంటుకోదు.

కాలమైన్‌ లోషన్‌

కాలమైన్‌ లోషన్‌

వర్షాకాలంలో స్నానం చేసిన వెంటనే తడి ఆరిపోదు. సమయాభావం వల్ల ఆఫీసులకు త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. శరీరం మీద తడి అలాగే పేరుకోవడం వల్ల దురద కలుగుతుంది. కాలమైన్‌ లోషన్‌ వాడితే దీర్ఘ చర్మ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు

English summary

Six Tips to Monsoon Skin care: Beauty Tips in Telugu

Six Tips to Monsoon Skin care: Beauty Tips in Telugu, Monsoon is season to rejuvenate all the living things on the planet. It is a refreshing season that makes you feel that beauty tips cane forgotten for some time. However as the intermittent showers pour high, you may notice some uneasiness with the skin.
Story first published: Monday, July 27, 2015, 16:09 [IST]
Desktop Bottom Promotion