For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రించే ముందు ఈ బ్యూటీ రూల్స్ పాటిస్తున్నారు...

|

ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు చర్మ సంరక్షణ చాలా అవసరం. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అలాగే నిద్రిస్తే ఉదయం నిద్రలేచిన వెంటనే నిరాశ చెందడం ఖాయం. ఎప్పుడైతే మీరు నిద్రిస్తారో, అప్పుడు మీ శరీరం విశ్రాంతి చెందుతుంది . అంతే కాదు ఆ విశ్రాంతి సమయంలో నొప్పులను, బాధలను నయం చేసుకుంటుంది . ఆరోగ్యం వలె, చర్మ సౌందర్యం కూడా అంతే, గాఢమైన నిద్రపొందినప్పుడు ఉదయం లేచినప్పుడు చర్మం ఫ్రెష్ గా మరియు ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.

నిద్రించే నాణ్యతను బట్టే మీ చర్మం యొక్కసౌందర్యం కూడా ఏవిధంగా ఉన్నదో తెలుపుతుంది. అంతే కాదు, నిద్రించే నాణ్యతను బట్టే చర్మం సౌందర్యం ఇనుమడిస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ నిద్రించే ముందు కొన్ని చర్మ సంరక్షన పద్దతులు అవలంబించాలి . మీరు మీ చర్మం సంరక్షణ గురించి రాత్రుల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటే , మరుసటి రోజు ఉదయం అంత ఫ్రెష్ గా కనబడుతారు.

రాత్రుల్లో చర్మసంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోకపోతే, ఉదయం చర్మం చాలా అలసట చెందినట్లు కనిపిస్తుంది. కాబట్టి రాత్రుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

1. టాక్సిన్స్ తొలగించాలి:

1. టాక్సిన్స్ తొలగించాలి:

సాధారణంగా మహిళలు ఉదయం ఆఫీసులకు, కాలేజీలకు, ఉద్యగులు మేకప్ వేసుకోవడం సహజం అయితే, సాయంత్రం ఇంటికి రాగానే వాటిని తొలగించడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా మేకప్ ను తొలగించాలి.

2. కార్భోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి:

2. కార్భోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి:

లోకార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు, సలాడ్, జ్యూసులు డిన్నర్లో తీసుకోవడం వల్ల మీ చర్మం కాంతి వంతంగా ఉంటుంది.

3. కేశ సంరక్షణ:

3. కేశ సంరక్షణ:

జుట్టు కూడా చర్మాన్ని పాడు చేస్తుంది. ఆయిల్ హెయిర్ ఉన్నవారు, ముఖం మీద పడినప్పుడు మొటిమలకు దారి తీస్తుంది. దుమ్ముదూలి వల్ల మొటిమ, మచ్చలు ఎక్కువైవుతాయి. కాబట్టి, నిద్రించే ముందు కేశాలు ముఖం మీద పడకుండా జుట్టును ముడివేసుకోవాలి

4. కళ్ళు:

4. కళ్ళు:

మీరు కళ్ళ క్రింద క్రీమ్ ఉపయోగించుకోవాలనుకుంటే, బెడ్ టైమ్ కంటే, మరో మంచి సమయం ఉండదు . నిద్రించే ముందు కళ్ళ క్రింద క్రీమ్ రాసుకొని పడుకుంటే, నిద్రలేచినప్పుడు మంచి చర్మం కాంతితో నిద్రలేస్తారు.

5.చేతులు మరియు కాళ్ళు:

5.చేతులు మరియు కాళ్ళు:

కాళ్ళకు మరియు చేతులకు మంచి మన్నికైన మాయిశ్చరైజింగ్ క్రీములను అప్లై చేయాలి . స్కిన్ కేర్ లో ఇది ఖచ్చితంగా గుర్తించుకోవల్సిన విషయం.

English summary

Skin Care Before Going To Bed

Neglecting skin care before going to bed may disappoint you every morning. When you sleep, your body relaxes and then heals itself. Your skin gets fresh and rejuvenated after a good night's sleep.
Story first published: Thursday, April 23, 2015, 17:49 [IST]
Desktop Bottom Promotion