For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యానికి కిచెన్ లోని సర్ ప్రైజింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ...

|

మహిళలు అందంగా కనబడుటకు మార్కెట్లో కనబడే ప్రతి ఒక్క బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలుచేయడం, ఎక్సపరమెంట్స్ చేయడం కోసం ఎంతో డబ్బును ఖర్చు చేస్తుంటారు . సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం మార్కెట్లో కొత్తగా విడుదలయ్యే ఉత్పత్తులన్నింటిని వెంటనే ప్రయత్నించే వారు లేకపోలేదు . అయితే ఫలితం నెగటివ్ గా ఉన్నప్పుడు, మరో మన్నికైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతే కాదు , కొత్తగా ఏ ప్రొడక్ట్స్ ఉపయోగించిన మన చర్మ ఛాయలో ముఖంలో ఏవైనా మార్పులు వచ్చాయా లేదా , స్కిన్ టోన్ మారిందా లేదా అని పదే పదే అద్దం ముందు స్థిరపడిపోతూ నిరుత్సాహానికి గురి అవుతుంటారు.

READ MORE: మీ అందాన్ని మెరుగుపరిచే 13 వంటగది వస్తువులు

సౌందర్యం కోసం వేలకు వేలు ఖర్చు చేయడం మరియు తగిన ఫలితాలను పొందకపోతే ? చాలా బాధకరంగా అనిపిస్తుంది. కాబట్టి, డబ్బు, సమయం వ్రుదా అవ్వడంతో పాటు, ఆశించిన ఫలితాలను కూడా పొందలేరు. కాబట్టి, మంచి ఫలితం పొందడానికి ఎల్లప్పుడు వంటి గది వస్తువులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి . ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా సాధారణంగా మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి మరియు ఫలితం కూడా చాలా అద్భుతంగా ఇస్తాయి.

ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ను వంటలకు మనం రెగ్యులర్ గా ఉపయోగించే పదార్థాలే మరియు మనం తినేటటువంటి ఆహారాలే..వీటి కోసం ఎక్కువ డబ్బును ఖర్చుచేయాల్సిన పనిలేదు. వీటి యొక్క ప్రయోజనాలు తెలుసుకొని వీటిని ఉపయోగించడమే ముఖ్యం.

READ MORE: ముఖాన్ని అందవిహీనంగా మార్చిన బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడం ఇలా....!

మరి మహిళలు తమ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఈ కిచెన్ లోని పదార్థాలు ఎలా ఉపయోగపడుతాయి, సర్ ప్రైజింగ్ బెనిఫిట్స్ ఏంటి అని తెలుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

చమోమెలీ టీ బ్యాగ్స్:

చమోమెలీ టీ బ్యాగ్స్:

కళ్ళ క్రింది ఉబ్బు మరియు కళ్ళ క్రింద నల్లని వలయాలుతో ఇబ్బంది పడేవారి సంఖ్య ఎక్కువే?ఈ సమస్యకు చక్కటి పరిష్కారం రెండు చమోమెలీ టీ బ్యాగ్స్ ను హాట్ వాటర్లో డిప్ చేసి, వాటిని ఫ్రీజర్లో పెట్టి, బాగా చల్లబడిన తర్వాత కళ్ళ మీద ఆ టీబ్యాగ్స్ ను ప్లేస్ చేయాలి. ఇది యాంటీఇన్ఫ్లమేటరీ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. కెఫిన్ అండ్ టానిన్స్ కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి.

తులసి ఆకులు:

తులసి ఆకులు:

వంటల్లో కూడా తులసి ఆకులను జోడిస్తుంటారు. ఆహారాలకు తులసి ఫ్లేవర్ తో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అంతే కాదు తులసి వాటర్ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అంతే కాదు ఇది కేశ సంరక్షణలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. డ్యామేజ్ అయిన మరియు డ్రై హెయిర్ ను నివారిస్తుంది. తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి లేదా కేశాలకు అప్లై చేసి కొద్ది సమయం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి ఘాటైన వాసన కలిగి ఉంటుంది. కానీ మొటిమలు నివారించడంలో ఇది ఒక ఉత్తమ పదార్థం . వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు మొటిమలను, మచ్చలను తొలగిస్తుంది . ఫ్రెష్ గా ఉండే వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి, మొటిమలను మీద అప్లై చేయాలి. ఇది ఎలాంటి మచ్చలు లేకుండా మొటిమలను మాయం చేస్తుంది.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ ఒక బెస్ట్ బ్యూటీ ప్రొడక్ట్. దీన్ని శరీరం మొత్తానికి మర్దన చేసుకోవచ్చు!ఎగ్ వైట్ ను జుట్టుకు మాస్క్ లా కూడా వేసుకోవచ్చు. ఇది జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. మరియు సిల్కీగా మార్చుతుంది. రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే చిక్కుముడులు కూడా ఉండవు . ఇంకా దీన్ని స్కిన్ టైటనర్ గా ఉపయోగించుకోవచ్చు. ముఖానికి అప్లై చేయడం వల్ల ముడుతలను మాయం చేసుకోవచ్చు.

యాపిల్స్:

యాపిల్స్:

బ్యూటీని మెరుగుపరచడంలో ఆపిల్ కూడా ది బిస్టె బ్యూటీ ప్రొడక్ట్. ఇది గొప్ప ఆస్ట్రిజెంట్ గా మరియు టోనర్ గా ఉపయోగపడుతుంది . ఇది మొటిమలను మచ్చలను నివారిస్తుంది. మరియు చర్మంలో పిహెచ్ బ్యాలెన్స్ ను రీస్టోర్ చేస్తుంది. కాటన్ తీసుకొని , ఆపిల్ జ్యూస్ లో డిప్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొద్ది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం సాఫ్ట్ గా మరియు అందంగా తయారవుతుంది .

కార్న్ స్ట్రార్చ్:

కార్న్ స్ట్రార్చ్:

బ్యూటి ప్రొడక్ట్స్ లో కార్న్ స్ట్రార్చ్ కూడా ఒకటి. ఆయిల్ స్కిన్, ప్యాచీ స్కిన్ నివారించడంలో కార్న్ స్ట్రార్చ్ ఒక బెస్ట్ పదార్థం . దీన్ని ఒక కాంప్యాక్ట్ గా ఉపయోగించుకోవచ్చు. కార్న్ స్టార్చ్ పౌండర్ ను ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయ పేస్ట్ అతుక్కొనే స్వభావం కలిగి ఉంటుంది. ఐబ్రోలను త్వరగా పెంచుకోవాలనుకుంటే, ఉల్లిపాయ రసాన్ని నేరుగా ఐబ్రోల మీద అప్లై చేయాలి . ఐబ్రోస్ త్వరగా పెరుగుతాయి.

English summary

Surprising Beauty Products From Kitchen: Andaniki Vantagadi padatralu

Surprising Beauty Products From Kitchen: Andaniki Vantagadi padatralu, We often spend a lot of money in buying many beauty products. When there is a new product launch, we have to try it out, and when the result is negative, we crib and buy another product.
Story first published: Monday, November 30, 2015, 17:18 [IST]
Desktop Bottom Promotion