For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ అలర్జీని నేచురల్ గా నివారించడానికి టాప్ 10 హోం రెమెడీస్

|

కొన్ని రకాల స్కిన్ అలర్జీలు (చర్మం ఎర్రగా మారటం, దురదలు, వాపులు) తాత్కాలికంగా మరియు తీవ్రంగా సమస్యలకు గురి చేస్తుంటాయి. శరీరంలో అధిక ప్రాధాన్యత ఇచ్చేది చర్మానికి. ఎందుకంటే చర్మం దేహానికి రక్షణ కవచం లాంటింది. అయితే వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఎండ వేడి, కొన్ని సార్లు నీళ్ళ ప్రభావం కూడా చర్మం పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దాంతో చర్మం ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. చర్మం అలర్జీకి చాలా కారణాలు ఉండవచ్చు.

అది సూర్య రశ్మిలో ఉండే ఆల్ట్రా వైలెట్ కిరణాలు, ఫ్యాబ్రిక్స్ , కొన్నిరకాలైటువంటి కూరగాయలు కూడా కారణం కావచ్చు. చర్మం చాల సున్నితమైనది. అందుకే త్వరగా చర్మ మీదనే ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి చర్మ సంరక్షణకు, చర్మం అలర్జీకీ దారితీయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొంటే సురక్షితమైన చర్మం మీ సొంతం అవుతుంది. తాత్కాలికంగా ఏర్పడే చర్మ సమస్యలకు వైద్యుడిని లేదా చర్మ నిపుణులను సంప్రదించాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలను, కొన్ని రోజులు వాడటం వలన స్కిన్ అలర్జీ మరియు ఇతరేతర చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు

చర్మం దురద తగ్గించటానికి సులభమైన హోం రెమిడీస్

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్దమైన గుణాలను కలిగు ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీరు దురదలను కలిగి ఉన్నట్లయిటే, ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనెను పూసి గట్టిగా రాయటం వలన దురదల నుండి ఉపశమనం పొందుతారు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

మీరు చర్మ సమస్యలను కలిగి ఉన్నపుడు, పడుకోటానికి ముందుగా ప్రభావిత ప్రాంతాలలో ఆలివ్ ఆయిల్'తో మసాజ్ చేయండి. అంతేకాకుండా, ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తరువాత ప్రభావిత ప్రాంతాన్ని వేడి గుడ్డతో చుట్టాలి, చర్మం నూనెను గ్రహించుకున్న తరువాత గుడ్డను తొలగించాలి.

వేప

వేప

వేప చెట్టు ఉత్పత్తులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గుణాలను కలిగి ఉండటం వలన చర్మానికి కలిగే వివిధ రకాల సమస్యలకు, మొటిమలకు, గజ్జి, తామర వ్యాధులను తగ్గించటానికి వేపను వాడుతుంటారు.

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు

నల్ల మిరియాలను సహజసిద్ద 'డి-టాక్సీఫయర్'గా చెప్పవచ్చు, కానీ చర్మ సమస్యలకు చాలా అరుదుగా వాడుతుంటారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వలన చర్మాన్ని అందంగా కనపడటానికి మరియు స్వస్థతలకు గురైన చర్మానికి చికిత్సలుగా ఈ నల్ల మిరియాలను వాడుతుంటారు.

తేనే

తేనే

తేనే చాలా రకాలుగా చర్మానికి ఉపయోగపడుతుంది మరియు ఈ సహజ సిద్దమైన ఇంట్లో ఉండే ఔషదం వలన చర్మం స్వస్థతకు గురైనపుడు, ఇతర అన్ని చర్మ సమస్యలకు ఔషదంగా వాడవచ్చు. ముఖ్యంగా మొటిమలు పగిలినపుడు, తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు. మీ చర్మ సమస్యలను తగ్గించటానికి తేనే మరియు దాల్చిన చెక్క పొడిని కలిపిన మిశ్రమాలను చర్మానికి వాడండి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉండటం వలన వివిధ రకాల చర్మ సమస్యలను సులభంగా తగ్గిస్తాయి. చర్మం దురదగా అనిపించినపుడు, చిన్న కాటన్ ముక్క లేదా పత్తి ముక్కను తీసుకొని ఆపిల్ సైడర్ వెనిగర్'లో ముంచి దురదలుగా అనిపించిన ప్రాంతాలలో రాయటం వలన దురదల నుండి విముక్తి పొందుతారు.

నిమ్మకాయ

నిమ్మకాయ

నిమ్మకాయ విటమిన్ 'C'లను ఎక్కువగా కలిగి ఉండటం వలన శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటుంది, చర్మ సమస్యలకు ఇది శక్తి వంతంగా పని చేస్తుంది. మీరు చర్మ సమస్యలను కలిగి ఉన్నారా? అయితే నిమ్మకాయ నుండి చిన్న ముక్కను కత్తిరించి, ప్రభావిత ప్రాంతంలో రాయటం వలన మీరు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

కలబంద

కలబంద

కలబందను చర్మ సమస్యలు మరియు సౌందర్య ఉత్పత్తులలో సాధారణంగా వాడుతుంటారు. ఈ అద్బుతమైన కలబంద వృక్షం చర్మం పైన కలిగే చిరాకులు మరియు కలిగే దురదల నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలబందను చర్మం పైన కలిగే అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించే ఒక గొప్ప ఔషదంగా చెప్పవచ్చు.

బొప్పాయి పండు

బొప్పాయి పండు

పొప్పడి పండు పుష్కలంగా విటమిన్ 'A' మరియు 'పపాయిన్'లను కలిగి ఉండి, చర్మంలో నిర్జీవ కణాలను తోలగించటమే కాకుండా చైతన్య రహిత ప్రోటీన్'లను విచ్చిన్నం చేస్తుంది. పచ్చి పొప్పడి పండు గుజ్జును చర్మానికి వాడటం వలన చర్మం పైన ఉండే నల్లటి వలయాలు మరియు మొటిమలు తగ్గుతాయి.

నీరు

నీరు

సరైన మొత్తంలో నీటిని తాగటం వలన, రక్త ప్రసరణలో ఉండే హానికర పదార్థాలను మరియు విష పదార్థాలను తోలగిస్తుంది. ఈ విష పదార్థాల వలన చర్మాన్ని పగిలేల చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుకోవటం వలన మీ చర్మం నుండి ఆయిల్ వేరు చేయబడుతుంది. అంతేకాకుండా, నీరు మీ చర్మాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది.

English summary

Top 10 Home remedies to cure skin allergies naturally!

You can get skin allergies due to many reasons. Be it the sun, fabric or some vegetable, your skin is extremely sensitive, and the chances of getting allergies are remarkably high. To make it short, skin allergy is a hypersensitive reaction to a substance. Skin allergies heal with time and can be cured by taking proper care. 
Story first published: Thursday, January 8, 2015, 11:43 [IST]
Desktop Bottom Promotion