For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్జీవమైన చర్మం నివారించడానికి బెస్ట్ హోం రెమెడీస్

|

డల్ స్కిన్ సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. చర్మ సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. డల్ స్కిన్(నిర్జీవమైన)చర్మానికి కాలుష్యం, జీవనశైలి, ఒత్తిడి వంటివి కారణం అవుతాయి .

డల్ స్కిన్ తొలగించి చర్మం ప్రకాశవంతంగా మరియు యంగ్ గా కనబడటం ఎలా? డల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు యంగ్ గా మార్చుతాయి.

చాలా మంది వారి చర్మాన్ని ప్రకాశవంతంగా యంగ్ గా మార్చుకోవడానికి అనేక కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే అది చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ కెమికల్ ప్రొడక్ట్స్ చర్మం యొక్క కాంతిని, గ్లోని తగ్గించేస్తాయి.

కాబట్టి, నేచురల్ ప్రొడక్ట్స్ ను సురక్షితంగా ఉపయోగించడం మంచిది మరియు చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇవి నిర్జీవమైన చర్మాన్ని క్యూర్ చేయడం మాత్రమే కాదు యంగర్ లుక్ ను కూడా ఇస్తుంది. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

అలోవెరా జెల్:

అలోవెరా జెల్:

ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు అలోవెరా జ్యూస్ ను త్రాగాలి. ఇది చర్మంను ప్రకాశవంతంగా మార్చుతుంది మరియు చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. అలాగే మీరు అలోవెర జెల్లో కొద్దిగా తేనె మిక్స్ చేసి అప్లై చేస్తే డల్ స్కిన్ నివారిస్తుంది.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

చర్మానికి రెగ్యులర్ గా బాదం ఆయిల్ మిక్స్ చేస్తే స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపరుస్తుంది. డల్ స్కిన్ నయం చేయడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. బాదం నట్స్ తినడం వల్ల కూడా చాలా మేలు చేస్తుంది.

నిర్జీవమైన చర్మానికి ఆప్రికాట్స్ చాలా మంచిది :

నిర్జీవమైన చర్మానికి ఆప్రికాట్స్ చాలా మంచిది :

ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి . ఇవి చర్మాన్ని సాఫ్ట్ చేస్తాయి మరియు కాంతి వంతం చేస్తాయి. చర్మంలో ఉన్న మురికి తొలగించడానికి ఆప్రికాట్స్ తో స్ర్కబ్ చేయవచ్చు. చర్మ సంరక్షణలో ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ.

ఆప్రికాట్ మరియు ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్:

ఆప్రికాట్ మరియు ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్:

నీళ్ళలో ఆప్రికాట్ నురాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం వాటిని మెత్తగా మ్యాష్ చేయాలి. తర్వాత వాటికి కొద్దిగగా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి ప్యాక్ లా వేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చాక్లెట్:

చాక్లెట్:

డార్క్ చాక్లెట్ గినడం వల్ల చర్మఆరోగ్యానికి చాలా మేలు జరగుతుంది. ఇది మీ చర్మానికి మంచి గ్లోను అందిస్తుంది. అంతే కాదు చాక్లెట్ లో కోకోపౌడర్, తేనె మరియు పాలు మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి.

కొబ్బరి నూనె మరియు తేనె ఫేస్ ప్యాక్:

కొబ్బరి నూనె మరియు తేనె ఫేస్ ప్యాక్:

కొబ్బరి నూనె మరియు తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది . ఈ ప్యాక్ వల్ల చర్మం శుభ్రపడుతుంది, బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది మరియు చర్మానికి మంచి కాంతిని అందిస్తుంది.

ఆరెంజ్ మరియు కీరదోస:

ఆరెంజ్ మరియు కీరదోస:

రెండు టీస్పూన్ల కీరదోసకాయ మరియు ఆరెంజ్ జ్యూస్, ఒక చెంచా బియ్యం పిండి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేయాలి. ఇది మీ ముఖాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు మీముఖంలో కాంప్లెక్షన్ పెంచుతుంది. మరియు ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

డల్ స్కిన్ కు కొబ్బరి నూనె:

డల్ స్కిన్ కు కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె చర్మంను మాయిశ్చరైజ్ చేస్తుంది మరియు పోషణను అందిస్తుంది. కొబ్బరి నూనెను ముఖానికి ప్రతి రోజు మసాజ్ చేయడం వల్ల డల్ స్కిన్ తొలగిస్తుంది.

 బ్రౌన్ అండ్ వైట్ షుగర్ ప్యాక్ :

బ్రౌన్ అండ్ వైట్ షుగర్ ప్యాక్ :

బ్రౌన్ అండ్ వైట్ షుగర్ ను రెండింటిని మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ రెండి మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పట్టించి స్ర్కబ్ చేయాలి. ఇది మీ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది . ఇది మీ చర్మానికి నేచురల్ గ్లోను అందిస్తుంది.

వ్యాయమం:

వ్యాయమం:

ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల చర్మం యంగ్ అండ్ రేడియంట్ గా మరియు ఫ్రెష్ గా కనబడుతుంది. ఇది చెమట రూపంలో అన్ని మలినాలను తొలగిస్తుంది . హెల్తీ బాడీ అంటే హెల్తీ స్కిన్ . చర్మం కాంతివంతంగా మెరవడానికి ఇది ఒక బెస్ట్ స్కిన్ కేర్ హోం రెమెడీ...

Story first published: Thursday, May 28, 2015, 18:16 [IST]
Desktop Bottom Promotion