For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని రకాల స్కిన్ ప్రాబ్లెమ్స్ ను క్లియర్ చేసే ఇండియన్ లీవ్స్ ఫేస్ మాస్క్

ఇండియాలో కొన్ని ఉష్ణమండల ప్రదేశాల్లో ఎప్పుడూ సన్ షైన్ ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా థెరఫిటిక్ మూలికలు,మొక్కలు పెరుగుతాయి. హెర్బ్స్ లో సాప్, బార్క్, ఆకులు, వేర్లు, వంటి ప్రతీదికొన్నిఔషధాల్లో ఉప

By Super Admin
|

ఇండియాలో కొన్ని ఉష్ణమండల ప్రదేశాల్లో ఎప్పుడూ సన్ షైన్ ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా థెరఫిటిక్ మూలికలు,మొక్కలు పెరుగుతాయి. హెర్బ్స్ లో సాప్, బార్క్, ఆకులు, వేర్లు, వంటి ప్రతీదికొన్నిఔషధాల్లో ఉపయోగించుకోచ్చు. ఇలా ఔషధ గుణాలున్న హెర్బ్స్ ను కేవలం ఆరోగ్య ఔషధాలుగానే కాకుండా ఫేస్ మాస్క్ గా ఎందుకు ఉపయోగించుకోకూడదు!?

కొన్ని మూలికలు, వేర్ల మీద పరిశోధనలు జరిపిన తర్వాత వీటిని చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించవచ్చని నిర్ధారించారు. సహజ చర్మ సమస్యలో మొటిమలు, మచ్చలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్, స్కిన్ టోన్ మెరుగుపరచడానికి ఇలా అన్ని రకాల చర్మం సమస్యలను నివారించుకోవడానికి ఆయుర్వేదిక్ హెర్బల్ లీవ్స్ ను ఫేస్ ప్యాక్ గా వేసుకోచ్చు. వీటిలో చర్మానికి ఉపయోగపడే విటమిన్స్, మినిరల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవి కొన్ని ఎఫెక్టివ్ బ్యూటీ బెనిఫిట్స్ ను అందిస్తాయి.

10 Ancient Indian Leaves Mask That Can Clear-Up Your Skin

ఈ హెర్బల్ మాస్క్ లు ప్రయత్నించడానికి ముందు క్లీన్ చేతులతో మీ ముఖంను టచ్ చేసి చూడటం వల్ల చర్మలో ఎక్కడ సమస్య ఉన్నది తెలుస్తుంది. ఇలా చర్మాన్ని వేళ్లతో తాకినప్పుడు, మొటిమలు, లేదా బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశం తెలుస్తుంది. అలాగే డార్క్ స్పాట్స్ గుర్తించవచ్చు.

చర్మంలో ఎలాంటి సమస్యైనా ఒకసారి గుర్తించిన తర్వత, సమస్య ను పరిష్కరించుకోవడం సులభమౌతుంది. చర్మంలో ఏ సమస్యకు ఎలాంటి హెర్బ్స్ ఉపయోగించుకోవాలో తెలుస్తుంది . ఈ క్రింది సూచించిన 10 హెర్బల్ రెమెడీస్ మీ చర్మం సమస్యలను తీర్చడంలో గొప్పగా సహాయపడుతాయి. అవేంటో తెలుసుకుందాం.

ఏజ్ స్పాట్ ను తొలగించే పార్ల్సే లీవ్స్:

ఏజ్ స్పాట్ ను తొలగించే పార్ల్సే లీవ్స్:

గుప్పెడు పార్ల్సే లీవ్స్ ను తీసుకుని, వేడినీటిలో నానబెట్టాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి, మెత్తగా పేస్ట్ చేయాలి. కొన్ని చుక్కల నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

పుదీనా:

పుదీనా:

గుప్పెడు పుదీనా ఆకులను వేడినీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత వీటిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఒక టీస్పూన్ ముల్లానీ మట్టి, రోజ్ వాటర్ చేర్చి మొత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని స్మూత్ గా పేస్ట్ చేసి, దీన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది డ్రై అయ్యే వరకూ ఉండి, తర్వాత స్ర్కబ్ చేసి, కడిగేసుకోవాలి.

మొటిమలను నివారించుకోవడానికి నీమ్ ఫేస్ మాస్క్:

మొటిమలను నివారించుకోవడానికి నీమ్ ఫేస్ మాస్క్:

వేప ఆకులను ఎండలో ఎండబెట్టి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక టీస్పూన్ వేపాకు పొడికి,కొద్దిగా నీళ్ళు చేర్చి, పేస్ట్ లా తయారుచేసి, దీన్ని నేరుగా మొటిమల మీద అప్లై చేయాలి. రాత్రుల్లో అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తర్వాత ఉదయం శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ బ్రైట్ గా మార్చడానికి జామ ఆకులు:

స్కిన్ బ్రైట్ గా మార్చడానికి జామ ఆకులు:

ఎండిన జామ ఆకులను మెత్తగా పొడి చేసి, అందులో ఒక టీస్పూన్ ఎగ్ వైట్, ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. దీన్ని మెడ, ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి.

హైడ్రేటింగ్ మ్యాంగో మాస్క్:

హైడ్రేటింగ్ మ్యాంగో మాస్క్:

ఎండిన మామిడి ఆకులను మెత్తగా పౌడర్ చేసి, అందులో కొద్దిగా అవొకాడో గుజ్జు, పాలు మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి, అరగంట తర్వాత కడిగేయాలి.

క్లియర్ స్కిన్ పొందడానికి తొలసి ఆకులు:

క్లియర్ స్కిన్ పొందడానికి తొలసి ఆకులు:

ఒక టీస్పూన్ తులసి ఆకుల పొడిలో ఒక టీస్పూన్ శెనగపిండి, కొన్ని చుక్కల బాదం ఆయిల్ మిక్స్చేయాలి. కొద్దిగా పాలు చేర్చి స్మూత్ పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి. ఇది డ్రైగా మారిన తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి.

రేడియంట్ స్కిన్ పొందడానికి అలోవెర మాస్క్:

రేడియంట్ స్కిన్ పొందడానికి అలోవెర మాస్క్:

అలోవెర లీప్ నుండి జెల్ ను ఒక కప్పులోకి తీసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్చేయాలి.అరగంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.

చర్మం కాంతివంతంగా మారడానికి కొత్తిమీర:

చర్మం కాంతివంతంగా మారడానికి కొత్తిమీర:

వేడినీళ్ళలో కొత్తిమీరను వేసి , కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి, వడగట్టి ఆ నీళ్లలో ఒక టీస్పూన్ కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేయాలి. కాటన్ బాల్ డిప్చేసి, ముఖం,మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

మొటిమలను తొలగించుకోవడానికి మొరింగా లీవ్స్:

మొటిమలను తొలగించుకోవడానికి మొరింగా లీవ్స్:

మొర్గం ను మొత్తగా పౌడర్ చేసి, అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రంగా కడిగేసుకోవాలి.

గ్లోయింగ్ స్కిన్ కు గ్రీన్ టీ మాస్క్:

గ్లోయింగ్ స్కిన్ కు గ్రీన్ టీ మాస్క్:

ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్ ను కట్ చేసి,అందులోని పదార్థాన్ని ఒక కప్పులో తీసుకుని, తేనె మిక్స్ చేయాలి. స్మూత్ గా మారిన తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. దీన్ని ముఖానికి బాగా మర్ధ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

10 Ancient Indian Leaves Mask That Can Clear-Up Your Skin

Topical country like India that sees sunshine during most parts of the year is a literal treasure trove of therapeutic herbs and plants. From sap, bark, leaves to roots, every single part of these plants can be used for some medicinal purpose or the other. Which got us thinking, why not use Indian leaves in face masks!
Story first published: Thursday, October 20, 2016, 7:29 [IST]
Desktop Bottom Promotion