For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 డేస్ లో గార్జియస్ స్కిన్ కోసం ఫ్యాబులస్ కోకొనట్ ఆయిల్ ఫేస్ మాస్కులు..!!

|

అద్దం ముందు నిలబడి, క్లోజ్ గా గమనించినప్పుడు, మీ ముఖంలో ఏమి గమనిస్తారు ? చర్మంలో మొటిమలు, మచ్చలు, బ్లాక్ స్పాట్స్ చాలా అసహ్యంగా కనిపిస్తున్నాయా..?కొన్ని కారణాలు వల్ల, ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ వల్ల చర్మంలో మొటిమలకు కారణమవుతుంది. లేదా స్కిన్ లో డల్ నెస్ పెరుగుతుంది. వయస్సు రిత్యా కావచ్చు, లేదా వేరే ఇతర కారణాలు కావచ్చు ముఖంలో మొటిమలు మర్చలు ఏర్పడుతుంటాయి. అయితే ముఖం స్పాట్ లెస్ గా..ఒక క్లియర్ స్కిన్ చూడాలంటే అందుకు కొబ్బరి నూనెతో తయారుచేసే ఫేస్ మాస్క్ లు ఉన్నాయి.

కొబ్బరి నూనె కేవలం జుట్టుకు మాత్రమే కాదు, ఇది స్కిన్ కు కూడా చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఇది స్కిన్ క్యూటికల్స్ ను సీల్ చేస్తుంది. చర్మంలోని మలినాలు లేకుండా శుశ్రం చేస్తుంది. చార్మానికి కాంతిని, మంచి గ్లోను అందిస్తుంది.

కొబ్బరి నూనెలో యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ చర్మంలోనికి షోషింపబడి, చర్మంలోని మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ ను రిపేర్ చేస్తుంది. చర్మంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

అంతే కాదు, కొబ్బరి నూనెలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల, ఇది స్కిన్ కు ఎక్కువగా హైడ్రేషన్ అందిస్తుంది, చర్మానికి తేమను అందివ్వడంతో పాటు, చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే స్కిన్ ఎలాసిటిని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

కొబ్బరి నూనెకు ఇతర పదార్థాలను మిక్స్ చేయడం వల్ల ఇవి చర్మం మీద మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అటువంటి హోం మేడ్ కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్కులు ఏంటో , ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం..

కొబ్బరి నూనె + తేనె

కొబ్బరి నూనె + తేనె

కొబ్బరి నూనె, తేనె కాంబినేషన్ ఫేస్ మాస్క్ చర్మంలో మొటిమలను నివారిస్తుంది. ముడుతలను పోగొడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ తేనెలో 10 చుక్కల ఆర్గాన్నిక్ కోకనట్ ఆయిల్ మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. అప్లై చేసిన 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

గుడ్డు - నిమ్మరసం - కొబ్బరి నూనె :

గుడ్డు - నిమ్మరసం - కొబ్బరి నూనె :

ఈ కాంబినేషషన్ ఫేస్ మాస్క్ లో ప్రోటీన్స్, పొటాషియంలు చర్మంలోని టాక్సిటిని(మలినాలను)తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ మాస్క్ వల్ల స్కిన్ టిష్యులు రిపేర్ అవుతాయి. కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి.

ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ వైట్ వేసి, అందులో నిమ్మరసం, కొబ్బరి నూనెను జోడించి, బాగా మిక్స్ చేయాలి. ఒకదానితో ఒకటి మిక్స్ అయిన తర్వాత ముఖంకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడ - కొబ్బరి నూనె:

బేకింగ్ సోడ - కొబ్బరి నూనె:

ఈ రెండింటి కాంబినేషన్ లోని మాస్క్ , స్కిన్ ను ఎక్సఫ్లోయేట్ చేస్తుంది, డీప్ గా పనిచేసి, మురికిని తొలగిస్తుంది. చర్మంలో ఉండే మలినాలను తొలగిస్తుంది.

ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో ఒక టీస్పూన్ ఫ్యూర్ కోకనట్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 10 నిముషాలు డ్రైగా మారిన తర్వాత దీన్ని స్ర్కబ్ చేయాలి. తర్వాత శుభ్రం చేసి కడిగేసుకోవాలి.

కొబ్బరి నూనెతో మసాజ్

కొబ్బరి నూనెతో మసాజ్

అలసిపోయిన, నిర్జీవమైన చర్మంను ఉత్తేజపరచడంలో ఆర్గానిక్ కోకనట్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా కొబ్బరి నూనెను చేతిలోకి వేసుకుని, ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. కొన్ని నిముషాలు పాటు, మసాజ్ చేసి, రాత్రంతా అలాగే ఉండనిచ్చి, మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక వారంలో మీ ముఖ చర్మం కాంతివతంగా మారుతుంది.

కలబంద - కొబ్బరి నూనె:

కలబంద - కొబ్బరి నూనె:

ఈ ఆయుర్వేదిక్ కోకనట్ మాస్క్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది, టాన్ నివారిస్తుంది, చర్మంను స్మూత్ గా మార్చుతుంది.

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ తీసుకుని, అందులో పది చుక్కల కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

అవొకాడో - తేనె - కొబ్బరి నూనె

అవొకాడో - తేనె - కొబ్బరి నూనె

ఈ కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్క్ లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఇ మరియు విటమిన్ కెలు అధికంగా ఉన్నాయి. ఇది స్కిన్ డిటాక్సిఫై చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది, చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

ఒక టేబుల్ స్పూన్ అవొకాడో పేస్ట్ లో, ఒక టేబుల్ స్పూన్ తేనె, 5 డ్రాప్ కోకనట్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని సాప్ట్ గా పేస్ట్ చేయాలి. ముఖం శుభ్రం చేసుకుని, తడి లేకుండా తుడి, తర్వాతఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ జ్యూస్ - పెరుగు - కొబ్బరి నూనె

ఆరెంజ్ జ్యూస్ - పెరుగు - కొబ్బరి నూనె

కొబ్బరి ఫేస్ మాస్క్ లో ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి, ల్యాక్టిన్, అమినో యాసిడ్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది, చర్మంలో ఎలాసిటిని మెరుగుపరుస్తుంది. చర్మంలో స్కార్స్ తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.

ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్ లో అరటీస్పూన్ పెరుగు, మూడు చుక్కల కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. బాగా బీట్ చేసి, ఈమిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది.

పెరుగు - స్ట్రాబెర్రీ - బాదం ఆయిల్ - కొబ్బరి నూనె

పెరుగు - స్ట్రాబెర్రీ - బాదం ఆయిల్ - కొబ్బరి నూనె

ఈ ఫేస్ మాస్క్ లో ల్యాక్టిక్ యాసిడ్, విటమిన్ బి5 , యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది చర్మంలో స్కార్స్ కనబడనివ్వకుండా లైట్ గా మార్చేస్తుంది. నిర్జీవంగా ఉన్న చర్మంను కాంతివంతంగా మార్చుతుంది, చర్మం తేమగా మరియు క్లియర్ గా మార్చుతుంది.

ఒక టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 5 చుక్కల బాదం మరియు కొబ్బరి నూనె వేసి మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్ని బాగా మిక్స్ చేయాలి. తర్వాత చర్మానికి అప్లై చేసి, అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మేకప్ తొలగించడానికి ఆలివ్ ఆయిల్ - కొబ్బరి

మేకప్ తొలగించడానికి ఆలివ్ ఆయిల్ - కొబ్బరి

ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ మాస్క్ లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మేకప్ ను తొలగిస్తుంది, చర్మం రంద్రాలను తెరచుకునేలా చేసి, లోపలి నుండి శుభ్రం చేస్తుంది .

ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె రెండూ సమంగా తీసుకుని మిక్స్ చేసి, అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖానికి మర్దన చేయాలి. తర్వాత మన్నికైన క్లెన్సర్ మరియు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఐ లాష్ కండీషనర్ గా కొబ్బరి నూనె

ఐ లాష్ కండీషనర్ గా కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఐల్యాషెస్ పొడవుగా, థిక్ గా ఉండేందుకు సహాయపడుతుంది. కాటన్ తీసుకుని, కొబ్బరి నూనెలో డిప్ చేసి, ఐలాషెస్, ఐబ్రోస్ మీద అప్లై చేసి, రాత్రంతా అలాగే వదిలేయడం వల్ల ఐ ల్యాషెస్ పొడవుగా పెరుగుతాయి .

కొబ్బరి నూనె - ల్యావెండర్ ఆయిల్ :

కొబ్బరి నూనె - ల్యావెండర్ ఆయిల్ :

డ్రై స్కిన్ తో బాధపడే వారు, ఏజ్ స్పాట్స్ తో బాధపడే వారు, కొబ్బరి నూనె ఫేస్ మాస్క్ ను ఉపయోగించాలి. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో 5చుక్కల ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్నిరాత్రి నిద్రించే ముందు ముఖానికి అప్లై చేయాలి.

కొబ్బరి నూనె - నట్ మగ్

కొబ్బరి నూనె - నట్ మగ్

ఈ హోం మేడ్ కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్క్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మంలో మొటిమలు నివారించబడుతాయి. చీముతో ఉండే మొటిమలను నివారించడంలో, నల్ల మచ్చలను లైట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఒక టీస్పూన్ నట్ మగ్ పౌడర్ లో ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

12 Fabulous Coconut Oil Face Masks For Gorgeous Skin In 7 Days!

12 Fabulous Coconut Oil Face Masks For Gorgeous Skin In 7 Days!12 Fabulous Coconut Oil Face Masks For Gorgeous Skin In 7 Days!,Go to the mirror, take a good close look at your skin. What do you see? Is your skin riddled with black spots? Perhaps an angry zit slowly tearing your skin tissues to pop out, or dullness, making you look twice your age. Whatever the case may be
Desktop Bottom Promotion