For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంలో మలినాలు తొలగించి, చర్మాన్ని బ్రైట్ గా మార్చే హెర్బల్ ప్యాక్స్..!

ఒకసారి దుమ్ము, ధూళి ఎఫెక్టివ్ గా తొలగిస్తే.. మీ చర్మం క్లియర్ గా మారడం మీరు గమనిస్తారు. అలాగే చర్మం స్మూత్, గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది.

By Swathi
|

మీ చర్మం మొటిమలు, మచ్చలతో నిండిపోయి ఉందా ? చలికాలంలో కూడా చర్మం జిడ్డుగా మారిపోయిందా ? ముక్కుపై చాలా ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉన్నాయా ? అయితే వీటన్నింటినీ తొలగించడం అసాధ్యమని ఢీలాపడిపోతున్నారా ? చర్మం నిర్జీవంగా కనిపిస్తోందని, ఎంత ఖరీదైన క్రీములు వాడినా.. ఫలితం కనిపించడం లేదా ?

herbal masks

చర్మంపై పేరుకున్న మలినాలు చర్మాన్ని మరింత నిర్జీవంగా, అసహ్యంగా మారుస్తాయి. వీటిని తొలగించడానికి హెర్బల్ మాస్క్ లు.. చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. ఈ ప్యాక్స్ చర్మంలో మలినాలు తొలగించి, టాక్సిన్స్ తొలగించి, డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగించి, చర్మ రంధ్రాలను సన్నగా మారుస్తాయి.

ఒకసారి దుమ్ము, ధూళి ఎఫెక్టివ్ గా తొలగిస్తే.. మీ చర్మం క్లియర్ గా మారడం మీరు గమనిస్తారు. అలాగే చర్మం స్మూత్, గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది. చాలా మెరుగైన ఫలితాలు చూడాలంటే.. జంక్ ఫుడ్ కి దూరంగా, ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. అప్పుడు చాలా త్వరగా ఫలితాలు చూస్తారు.

అలాగే స్మోకింగ్ మానేయాలి. ఎండలోకి వెళ్లేముందు సన్ స్క్రీన్ అప్లై చేయాలి. తరచుగా ముఖాన్ని ముట్టుకోకూడదు. మీ చర్మ తత్వానికి సరిపడని ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు. అలాగే చర్మంలో ఉన్న టాక్సిన్స్ ని తొలగించి, న్యాచురల్ గా బ్రైట్ గా మార్చే హెర్బల్ ఫేస్ ప్యాక్స్ మీకోసం.

నారింజ తొక్క

నారింజ తొక్క

నారింజ తొక్కలో సిట్రస్ యాసిడ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మంలో దుమ్ముని తొలగించి.. బ్రైట్ గా మారుస్తాయి. ఆరంజ్ పీల్ పౌడర్, పంచదారను సమానంగా తీసుకుని పాలు మిక్స్ చేస్తూ పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఆరిన తర్వాత స్క్రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి.

టమోటా

టమోటా

టమోటాలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇవి టాక్సిన్స్ ని వేగంగా తొలగిస్తాయి. ట్యాన్ తొలగించి చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తాయి. 1 టేబుల్ స్పూన్ టమోటా గుజ్జు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి తొలగించుకోవాలి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ చర్మాన్ని రిపేర్ చేసి, హైడ్రేట్ చేయడమే కాకుండా పోషణ అందిస్తుంది. ఒక టీస్పూన్ రోజ్ వాటర్ అంతే మోతాదులో గ్లిజరిన్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి చర్మానికి మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి.

క్యాబేజ్

క్యాబేజ్

క్యాబేజ్ లో విటమిన్ ఈ సల్ఫర్ ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లో పేరుకున్న దుమ్ముని తొలగించి స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తాయి. క్యాబేజ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, 2 కప్పుల నీటిలో ఉడికించాలి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత వడకట్టి.. చర్మాన్ని ఆ నీటితో శుభ్రం చేసుకుంటే స్కిన్ బ్రైట్ గా మారుతుంది.

బొప్పాయి

బొప్పాయి

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేసి.. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. బొప్పాయి తొక్క తీసుకుని చర్మంపై బాగా 5 నిమిషాలపాటు స్క్రబ్ చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే చర్మం క్లియర్ గా మారుతుంది.

English summary

5 DIY Herbal Masks To Remove Toxins From Skin!

5 DIY Herbal Masks To Remove Toxins From Skin! For clear, supple and smooth skin, try these perfect herbal masks.
Story first published: Friday, December 2, 2016, 10:51 [IST]
Desktop Bottom Promotion