చలికాలంలో చర్మ సంరక్షణకు హోంమేడ్ ఫేస్ ప్యాక్స్..!

చలికాలం వచ్చిందంటే.. చర్మం బాగా పొడిబారిపోయి, పగిలి, పొట్టుపొట్టుగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలంలో చర్మం, శరీర సంరక్షణలో చాలా అలర్ట్ గా ఉండాలి.

Posted By:
Subscribe to Boldsky

చలికాలం వచ్చిందంటే.. చర్మం బాగా పొడిబారిపోయి, పగిలి, పొట్టుపొట్టుగా మారి నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలంలో చర్మం, శరీర సంరక్షణలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. మీ చర్మం మరింత నిర్జీవంగా మారుతుంది.

winter face packs

చలికాలంలో చర్మ సంరక్షణకు కాస్త ఓర్పు అవసరం. సమయం కేటాయించడం కూడా చాలా ముఖ్యం. పగిలిన, నొప్పి, మంట, దురదతో కూడిన చర్మాన్ని నివారించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పగుళ్ల వల్ల అసహ్యంగా కనిపించడమే కాదు.. నలుగురిలో ఉన్న తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది.

కాబట్టి చలికాలంలో ఈ సమస్య నుంచి బయటపడటానికి సింపుల్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలు, ఫ్రూట్స్ తో ఫేస్ ప్యాక్స్ అప్లై చేయడం వల్ల చర్మం నిగారింపు సొంతం చేసుకోవడమే కాకుండా.. పగలకుండా, డ్రై కాకుండా ఉంటుంది.

badam and milk

పాలు
ఒక టేబుల్‌ స్పూన్‌ బాదం పొడిలో 2 టేబుల్‌ స్పూన్ల పచ్చిపాలను కలిపి మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని స్మూత్ గా, పొడిబారకుండా చేస్తుంది.

lemon

నిమ్మ, తేనె
ఒక నిమ్మకాయలోని రసం తీయాలి. అందులో 2 టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి.. దూదితో ముఖానికి రాసుకోవాలి. నిమ్మలో ఉండే విటమిన్‌ సి, తేనెలో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం పగలకుండా, దురదపెట్టకుండా చేస్తాయి.

బొప్పాయి
బాగా పండిన బొప్పాయి గుజ్జు, అరటిపండు గుజ్జుని మిక్స్ చేసి.. ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేస్తే.. చర్మానికి కావాల్సిన మాయిశ్చరైజర్ అందుతుంది.

English summary

5 Secret Winter Face Packs Hiding in Your Kitchen

5 Secret Winter Face Packs Hiding in Your Kitchen. Here are our top 5 face pack for winter ideas that will give you bright, fresh and radiant skin all day long.
Please Wait while comments are loading...
Subscribe Newsletter