రోజ్ వాటర్ తో బ్రిలియంట్ బ్యూటీ బెనిఫిట్స్ ..!!

6 Brilliant Beauty Uses Of Rose Water You Did Not Know!

Posted By:
Subscribe to Boldsky

పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. కాబట్టి దీన్ని సౌదర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

రోజ్ వాటర్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఈ సువాసనభరితమైన ద్రవంలో ఔషధ మరియు సౌందర్య గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ రోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.ఇందులో కూడా వివిధ రకాల విటమిన్స్ ఉన్నాయి. రోజ్ వాటర్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .

6 Brilliant Beauty Uses Of Rose Water You Did Not Know!

 రోజ్ వాటర్ లో ఇన్ని లక్షణాలుండటం వల్ల చాలా మంది చర్మ సౌందర్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . మరియు జుట్టు సంరక్షణకు కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. రోజ్ వాటర్ అన్ని రకాల చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. మీ చర్మం దురదగా ఉంటే ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు, ఇది ఆయిల్ స్కిన్ ను నివారిస్తుంది . ఇది చర్మాన్ని కాంతి వంతంగా మార్చుతుంది. కొంత మంది కళ్ళ ఉబ్బును నివారించడానికి కూడా రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారు. రోజు వాటర్ లోని మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం...

మేకప్ రిమూవ్ చేస్తుంది:

కాటన్ ప్యాడ్ ను రోజ్ వాటర్ లో డిప్ చేసి చర్మానికి అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మర్దన చేయాలి. మేకప్ కొద్దిగా వదులైనప్పుడు ఈ ప్రొసెస్ ను రిపీట్ చేయండి. ప్రతి సారి ఫ్రెష్ గా ఉండే కాటన్ ప్యాడ్ ను ఉపయోగించాలి.

స్కిన్ రిఫ్రెషనర్ :

ఒక బాటిల్లో రోజ్ వాటర్ నింపి, అందులో రెండు మూడు చుక్కల బాదం ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని రిఫ్రిజరేటర్లో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసి ఈ సొల్యూషన్ ను ముఖానికి స్ప్రే చేసి, నేచురల్ గా అబ్ సార్బ్ అయిన తర్వాత టిష్యు పేపర్ తో తుడిచేసుకోవాలి.

మేకప్ సెట్ చేసుకోవడానికి :

మేకప్ వేసుకున్నప్పుడు కరెక్ట్ గా ఉంటేనే అందంగా కనబడుతారు, చివరిలో టచ్ అప్ ఇస్తేనే చూడటానికి అందంగా కనబడుతారు. అందుకోసం ఒక కప్పు రోజ్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేసి స్ప్రే బాటిల్లోకి మార్చుకోవాలి. మేకప్ వేసుకున్న తర్వాత ఈ స్ప్రే బాటిల్లో మిశ్రమాన్ని ముఖం మీద స్ప్రే చేసుకోవాలి. పూర్తిగా డ్రై అయ్యే వరకూ ఉండాలని లేదంటే మేకప్ చెరిగిపోతుంది.

రేడియంట్ మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ ను అరకప్పు రోజ్ వాటర్ తో మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి, అరగంట తర్వాత స్కిన్ స్ట్రెచ్ అయ్యే సమయంలో వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ ను సూపర్ సాప్ట్ అండ్ రేడియంట్ గా మార్చుతుంది.

టోనర్ :

ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, అందులో కాటన్ బాల్ డిప్ చేసి, ఎక్సెస్ వాటర్ ను పిండేసి, ముఖం , మెడ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిముషాల తరవ్ాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, చర్మంలో డీప్ గా వెళ్ళి మలినాలను తొలగిస్తుంది. చర్మంను కొత్తగా , హైడ్రేషన్ లోకి మార్చుతుంది.

సన్ స్క్రీన్ లోషన్ :

రోజ్ వాటర్ లో ఉండే విటమిన్ సి , ఎక్స్ లెంట్ గా సన్ బ్లాకింగ్ లక్షణాలు కలది. ఒక టీస్పూన్ గ్లిజరిన్ , సమంగా రోజ్ వాటర్ తీసుకుని, దీనికి కీరదోస జ్యూస్ మిక్స్ చేసి, ముఖం మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే స్కిన్ రేడియంట్ గా మెరుస్తుంటుంది.

English summary

6 Brilliant Beauty Uses Of Rose Water You Did Not Know!

6 Brilliant Beauty Uses Of Rose Water You Did Not Know!, Rose water is one of the cheapest, yet effective, remedies you can find in your vanity box. So far, beauty use of rose water was pretty clear.
Please Wait while comments are loading...
Subscribe Newsletter