ఒకే ఒక నెలలో బ్రైట్ స్కిన్ పొందే బంగాళదుంప ఫేస్ ప్యాక్స్..!

బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి.

Posted By:
Subscribe to Boldsky

కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్, ఎక్కువ సమయం ఎండలో తిరగడం, కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మ కణాలు చాలా డ్యామేజ్ అవుతున్నాయి. అందుకే మీ చర్మం నెమ్మదిగా ప్రకాశాన్ని కోల్పోతుంది. కాబట్టి.. కాస్త అలర్ట్ అవడం మంచిది.

Potato Face Mask

రెగ్యులర్ గా చేసే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనేది.. సరిపోదు. కోల్పోయిన చర్మ సౌందర్యాన్ని, గ్లోయింగ్ ని పొందడానికి కొంత ఎక్స్ ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. మీ సమస్యకు మా దగ్గర ఒక పరిష్కారం ఉంది. పొటాటొ ఫేస్ ప్యాక్.

బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి డ్యామేజ్ అయిన చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉన్న బంగాళదుంప స్కిన్ ట్యాన్ ని తొలగించి, పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది, డార్క్ స్పాట్స్ ని నివారిస్తుంది.

విటమిన్ బి కాంప్లెక్స్ చర్మంలో ఎలాస్టిసిటీని మెరుగుపరిచి.. స్కిన్ టోన్ ని టైట్ గా మారుస్తుంది. విటమిన్ సి.. చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది. ఊహించని విధంగా గ్లో అందిస్తుంది. మరి ఇంట్లోనే బంగాళదుంప ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

బ్రైట్ స్కిన్ మాస్క్

ఒక బంగాళదుంప తీసుకుని తొక్క తీసి, జ్యూస్ తీయాలి. ఈ రసంను ఫ్రిడ్జ్ లో పుట్టుకోవాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకుని కాటన్ బాల్ తో బంగాళదుంప రసంను ముఖానికి, మెడకు పట్టించాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే చర్మం బ్రైట్ గా మారుతుంది.

ముడతలు తొలగించడానికి

1 గుడ్డులోని తెల్లసొన తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ పొటాటొ జ్యూస్ కలపాలి. ఫోర్క్ తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పలుచగా ముఖానికి, మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. ప్రొటీన్స్ తో నిండిన ఈ ప్యాక్.. ముడతలను తొలగిస్తుంది.

ట్యాన్ తొలగించే మాస్క్

టమోటా, పొటాటో జ్యూస్ లను సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది ట్యాన్ తొలగించి చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది.

హైడ్రేటింగ్ మాస్క్

1 టేబుల్ స్పూన్ బంగాళదుంప రసం, 1 టీస్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలపాలి. అన్నింటినీ ఫోర్క్ తీసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల.. చర్మానికి కావాల్సిన తేమ అంది హైడ్రేట్ గా, గ్లోయింగ్ మారుతుంది.

టోనింగ్ మాస్క్

సగం బంగాళదుంపను తురుముకుని, కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు, కావాల్సినంత రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్లెన్స్ చేసిన తర్వాత చర్మానికి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

చర్మ రంధ్రాలకు

పొటాటో జ్యూస్, దోసకాయ రసం సమానంగా తీసుకుని.. ఐస్ క్యూబ్ ట్రేలో పోయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని గడ్డ కట్టనివ్వాలి. ఇప్పుడు ఆ ఐస్ క్యూబ్ తీసుకుని చర్మంపై రుద్దుకోవాలి. ఇది చర్మాన్ని స్మూత్ గా మార్చడంతో పాటు, చర్మ రంధ్రాలు సన్నగా మారడానికి సహాయపడుతుంది.

English summary

6 Potato Face Mask Recipes For 2 Shades Brighter Skin Tone In A Month!

6 Potato Face Mask Recipes For 2 Shades Brighter Skin Tone In A Month! Crystal clear glowing skin is just a potato face mask away!
Please Wait while comments are loading...
Subscribe Newsletter