For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనం రోజూ తినే పండ్లతొక్కల్లో దాగున్న చర్మ సౌందర్య రహస్యాలు..!

|

ఈ మోడ్రన్ యుగంలో ప్రతి ఒక్కరూ అందంగా కనబడాలని కోరుకుంటారు, అందుకోసం వాడని క్రీముల, ప్రయత్నించని చిట్కాలంటూ ఉండవు. ప్రస్తుతం టెక్నాలజికి తగ్గట్లు అందంగా కనబడుటకు ఎన్నో స్కిన్ ట్రీట్మెంట్స్, స్పాలు అందుబాటులోకి వాచ్చాయి. అయితే వీటన్నింటికంటే నేచురల్ పద్దతును ఎంపిక చేసుకోవడమే మంచిది. నేచర్ మనకు ప్రసాధించిన వరాల్లో ఒకటి పండ్లు. పండ్లను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు జరగుతుంది, అందానికి కూడా రెట్టింపు మేలు జరగుతుంది. పండ్లను మనం తినగా మిగిలిన తొక్కను ఫేస్ మాస్క్ గా వేసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పండ్లు తినగా మిగిలిన తొక్కను పడేయడానికి ముందు, వాటి గురించి కొన్ని ఫ్యాక్ట్ తెలుసుకోండి..

పండ్లు తినడం చర్మానికి హైడ్రేషన్ ను అందిస్తుంది. పండ్లలో విటమిన్స్, న్యూట్రీషియన్స్, ఎక్కువగా ఉంటాయి. వీటిని నేరుగా చర్మానికి అప్లై చేస్తే చర్మ సాప్ట్ గా సపెల్ గా మారతుంది. అందువల్ల , మన ఇంట్లో ఉండే పండ్లతో హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. పండ్ల తొక్కలు స్కిన్ టానింగ్, ఏజింగ్, డార్క్ స్పాట్స్ వంటి అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. ఎటువంటి చర్మ తత్వానికి ఎలాంటి ఫ్రూట్ పీల్ ను ఉపయోగించాల్న విషయంలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం ఫ్రూట్ ఫీల్స్ ఫేస్ ప్యాక్ లను పరిచయం చేస్తున్నాము. వీటిని మీ రెగ్యులర్ స్కిన్ బ్యూటీ రిమ్ జిమ్ లో జోడించి అందాన్ని మెరుగుపరుచుకోండి.

ఆరెంజ్ పీల్ మాస్క్:

ఆరెంజ్ పీల్ మాస్క్:

ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువ, కాబట్టి, దీన్ని పడేయకుండా తొక్కను మిక్సీలో వేసి, దీంతో పాటు, పెరుగు, తేనె కూడా జోడించి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల ఫ్రెష్ అండ్ యూత్ ఫుల్ స్కిన్ పొందుతారు.

బనానా ఫీల్ మాస్క్:

బనానా ఫీల్ మాస్క్:

అరటి తొక్కను మెత్తగా పేస్ట్ చేసి అందులో గుడ్డులోని పచ్చసొన మిక్స్ చేసి, మిక్సీలో వేసి బ్లెడ్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మాన్ని టైట్ గా మార్చుతుంది. ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వుదు.

మ్యాంగో పీల్:

మ్యాంగో పీల్:

మ్యాంగో పీల్ మాస్క్ కాదు, మామిడి తొక్కను నేరుగా చర్మం మీద అప్లై చేయొచ్చు. మామిడితొక్కకు మరే ఇతర పదార్థాలు అడిషనల్ గా జోడించకుండా నేరుగా ముఖానికి అప్లై చేయవచ్చు. మామిడిపండ్లలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఒక్కటి చర్మానికి అప్లై చేయొచ్చు . సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

లెమన్ పీల్ మాస్క్:

లెమన్ పీల్ మాస్క్:

లెమన్ పీల్, హనీ మిక్స్ లో గ్రేట్ బ్యూటిబెనిఫిట్స్ దాగున్నాయి, . ఈ మిశ్రమాన్నిబ్లెండర్ లో మిక్స్ చేయాలి. చర్మ రంగు మార్చుకోవాలనుకునే వారికి ఇది గ్రేట్ రెమెడీ . నిమ్మరసం గ్రేట్ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్.

ఆపిల్ పీల్ మాస్క్:

ఆపిల్ పీల్ మాస్క్:

ఆపిల్లో గొప్ప న్యూట్రీషియన్స్ ఉన్నాయి . అదే న్యూట్రీషియన్స్ ఆపిల్ తొక్కలో కూడా ఉన్నాయి. ఈ పీల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మంలోని మలినాలను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్ ముక్కలను బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత పెరుగు చేర్చి ముఖానికి ప్యాక్ వేసుకోవడంతో గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

బొప్పాయి పీల్ మాస్క్:

బొప్పాయి పీల్ మాస్క్:

బొప్పాయి తొక్కకు కొద్దిగా తేనెమిక్స్ చేసి బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే చర్మం వైట్ గా మారుతుంది, ఫేషియల్ హెయిర్ తొలగింపబడుతాయి. బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ హెయిర్ ఫోలిసెల్స్ ను బ్రేక్ చేస్తుంది.

గ్రేప్ పీల్ మాస్క్:

గ్రేప్ పీల్ మాస్క్:

గ్రేప్స్ కు తొక్క తియ్యడం నిజంగా కష్టమే, అయితే గ్రేప్ తో పాటు కొంత గుజ్జు ఉన్నా పర్వాలేదు, ఇందులోయాంటీ ఏజింగ్ లక్షణాలను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి .

English summary

7 Fruit Peel Face Masks For Glowing Skin

Everyone wants a glowing skin naturally, without having to spend all our money on it. We've all heard how good it is for our skin to eat fruits. But did you know that you can make fruit peel face masks at home for glowing skin? Yes, so remember this little fact before you throw away those fruit peels in the trash.
Story first published:Saturday, August 27, 2016, 15:49 [IST]
Desktop Bottom Promotion