గ్రీన్ టీలో ఉన్న 7 అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ..!!

గ్రీన్ టీ ఉబ్బిన కళ్ళు,మృత కణాలను తొలగించటం మరియు పొడిదనంను తగ్గిచటం,అలసట తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. వేడి వేడి గ్రీన్ టీ త్రాగితే మూడ్ మంచిగా మారుతుంది. గ్రీన్ టీని భూమి నుండి దొరికిన ఒక బంగా

Posted By:
Subscribe to Boldsky

గ్రీన్ టీ ఉబ్బిన కళ్ళు,మృత కణాలను తొలగించటం మరియు పొడిదనంను తగ్గిచటం,అలసట తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. వేడి వేడి గ్రీన్ టీ త్రాగితే మూడ్ మంచిగా మారుతుంది. గ్రీన్ టీని భూమి నుండి దొరికిన ఒక బంగారపు నిధి అని చెప్పవచ్చు. మీకు నమ్మకం కలగటం లేదా?


గ్రీన్ టీని అందం కోసం సులభంగా ఉపయోగించవచ్చు. మీరు ప్రయత్నించి చూడండి. ఉబ్బిన కళ్ళు,మృత కణాలను తొలగించటం మరియు పొడిదనంను తగ్గిచటం,అలసట తగ్గించటానికి గ్రీన్ టీని ఎప్పుడైనా వాడి మంచి ఫలితాలను సాధించవచ్చు. మీ చర్మ తత్వాన్ని బట్టి గ్రీన్ టీ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.


గ్రీన్ టీ చర్మాన్ని దెబ్బతీసే UV కిరణాల నుండి రక్షించటానికి చర్మం మీద రక్షిత పొరను ఏర్పరుస్తుంది. దెబ్బతిన్న చర్మ కణాలకు మరమత్తు చేయటం మరియు కొత్త చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. గ్రీన్ టీలో 40 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

చర్మం కొల్లాజెన్ స్థాయిలను ప్రోత్సహించి చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచి వృద్ధాప్య గుర్తులను తగ్గిస్తుంది. అంతేకాక మొటిమలకు కారణం అయిన వ్యాధి కారక బాక్టీరియా చంపడానికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా గ్రీన్ టీలో ఉంటాయి. చర్మ కాంతి కోసం మూలికా గ్రీన్ టీ ప్యాక్ లను ప్రయత్నించవచ్చు. గ్రీన్ టీతో విడివిడిగా మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

హైడ్రేట్ ప్యాక్

ఒక కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి. ఈ నీరు గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చేవరకు వేచి ఉండాలి. ఈ నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తర్వాత మీ ముఖం హైడ్రేడ్ గా ఉండటానికి ఒక ప్యాక్ వేయాలి.

రిలాక్స్ మాస్క్

ఒక బౌల్ లో రెండు గ్రీన్ టీ బ్యాగ్ లో ఉన్న పొడి ని తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ తేనే,కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి,మెడకు రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ గ్రీన్ టీ మాస్క్ చర్మ అలసటను తగ్గిస్తుంది.

ఐ జెల్ మాస్క్

ఒక స్పూన్ గ్రీన్ టీ పొడిలో ఒక స్పూన్ అగర్ అగర్, ఒక స్పూన్ నిమ్మరసం, 5 చుక్కల బాదాం నూనె, అరకప్పు వేడి నీరు కలపాలి. ఈ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రే లో పోసి రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. చల్లగా అయిన ఈ మిశ్రమాన్ని స్పూన్ సాయంతో కళ్ళ మీద పెట్టుకోవాలి. ఈ జెల్ నల్లటి వలయాలు,కళ్ళ ఉబ్బును తగ్గించటంలో సహాయపడుతుంది.

మొటిమలు

అరకప్పు గ్రీన్ టీలో కాటన్ బాల్ ని ముంచి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి. గ్రీన్ టీలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించటంలో సహాయపడతాయి.

యాంటీ ఏజింగ్ మాస్క్

గ్రీన్ టీ ఆకులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక స్పూన్ పాలమీగడ, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి,మెడకు రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పేస్ స్ప్రే

ఒక కప్పు నీటిని బాగా మరిగించి దానిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి 15 నిముషాలు ఉంచాలి. ఈ నీరు గోరువెచ్చగా అయ్యాక, ఆ నీటిలో 5 చుక్కల నిమ్మ ఎస్సేన్షియాల్ ఆయిల్, 5 చుక్కల లావెన్డేర్ నూనె, 1 విటమిన్ E గుళిక జెల్ వేసి బాగా కలిపి ఒక స్ప్రే సీసాలో పోయాలి. ఈ స్ప్రే సీసాను రిఫ్రిజిరేటర్ కొంచెం సేపు ఉంచాలి. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని ముఖంపై స్ప్రే చేస్తే ముఖ అలసట తగ్గుతుంది.

గ్రీన్ టీ బాడీ స్క్రబ్

తక్షణ రిఫ్రెష్ మరియు మృదుత్వం కావాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్క్రబ్ ఉపయోగించండి. ఒక కప్పు బ్రౌన్ షుగర్ లో ఒక స్పూన్ ఎండిన గ్రీన్ టీ ఆకులు, 2 స్పూన్ల తేనే,అరకప్పు ఆలివ్ ఆయిల్, 10 చుక్కల లవెందర్ నూనె వేసి అన్ని పదార్దాలు బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయాలి. ప్రతి రోజు శరీరాన్ని శుభ్రం చేసుకోవటానికి ఈ స్క్రబ్ ని ఉపయోగించవచ్చు.

English summary

7 Incredible Beauty Uses Of Green Tea You Will Thank Us For!

Piping hot flavorsome green tea can do more than just perk up your mood instantly, it is a treasure trove of beauty. Don't believe us? Give these easy beauty uses of green tea a try and see for yourself!
Please Wait while comments are loading...
Subscribe Newsletter