చలికాలంలో చర్మం డ్రైగా మారడానికి అసలు కారణాలేంటి ?

చలికాలంలో ప్రతి ఒక్కరి చర్మం డ్రైగా మారుతుంది అనుకుంటాం. కానీ.. ఇది పొరపాటు. చలికాలంలో చర్మం పొడిబారడానికి చాలా కారణాలున్నాయి. మీ చర్మంలోపల ప్రభావాన్ని బట్టి ఇలా జరుగుతుంది.

Posted By:
Subscribe to Boldsky

చలికాలం వచ్చేసింది. చలి చలి అంటూ.. వణుకుతున్న సమయంలో.. సమస్యలు చాలా ఎదురవుతాయి. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లతో పాటు, చర్మ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మం చాలా డ్రైగా మారిపోతుంది.

dry skin

మీ చర్మం డ్రైగా మారడానికి చాలా కారణాలుంటాయి. చలికాలంలో ప్రతి ఒక్కరి చర్మం డ్రైగా మారుతుంది అనుకుంటాం. కానీ.. ఇది పొరపాటు. చలికాలంలో చర్మం పొడిబారడానికి చాలా కారణాలున్నాయి. మీ చర్మంలోపల ప్రభావాన్ని బట్టి ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చలికాలంలో డ్రై స్కిన్ సమస్య ఫేస్ చేయాల్సిన అవసరం లేదు.

మనం రోజూ చేసే పనులే.. మన సున్నితమైన చర్మానికి హాని చేస్తాయి. చర్మం డ్రైగా, పొడిబారకుండా ఉండాలంటే.. శరీరంలో వాటర్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేయాలి. హైడ్రేట్ గా ఉంటే..చర్మం గ్లోయింగ్ మారుతుంది. అలాగే.. చర్మం డ్రై అవడానికి కారణమయ్యే.. విషయాలను కూడా తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి.

వయసు

వయసు పెరిగే కొద్దీ.. హార్మోన్స్ లో మార్పులు వస్తాయి. హార్మోనల్ బ్యాలెన్స్ లో మార్పులు.. చర్మాన్ని డ్రైగా మారుస్తాయి.

వ్యాధులు

కొన్ని రకాల వ్యాధులు చర్మాన్ని పొడిబారిలా చేస్తాయి. డయాబెటిస్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా.. చర్మం డ్రైగా మారడానికి కారణమవుతాయి.

వారసత్వం

ఒకవేళ మీ పేరెంట్స్ లేదా మీ కుటుంబంలో ఎవరైనా.. డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతూ ఉంటే.. మీరు కూడా అదే సమస్య ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఫ్యామిలీలో ఎవరికైనా డ్రైస్కిన్ ప్రాబ్లమ్ ఉంటే.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కాస్మొటిక్స్

ఒకవేళ మీరు చాలా ఎక్కువగా కాస్మొటిక్స్ ఉపయోగిస్తే.. మీ చర్మం డ్రైగా మారుతుంది. కాస్మొటిక్స్ లో ఉండే కెమికల్స్.. చర్మంలోపలి అలాగే ఉండిపోయి.. చర్మ సమస్యలకు కారణమవుతాయి.

మెడిసిన్స్

కొన్ని రకాల మందులు చర్మాన్ని డ్రైగా మారుస్తాయి. క్యాన్సర్, కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ వాడేవాళ్ల చర్మం పొడిబారడమే కాకుండా.. పొట్టు రాలుతూ ఉంటుంది.

ఆల్కహాల్ ప్రొడక్ట్స్

సానిటైజర్స్, ఆయిల్ కంట్రోలింగ్ ప్రొడక్ట్స్, టోనర్స్ ని చలికాలంలో ఉపయోగిస్తే.. మీ చర్మం డ్రైగా మారుతుంది. ఇందులో ఆల్కహాల్ ఉపయోగించడం వల్ల మాయిశ్చరైజర్స్ తక్కువగా ఉంటాయి.

వేడినీటి స్నానం

చలికాలం వచ్చిందంటే.. పొగలు వచ్చే నీటితో స్నానం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. వేడినీటితో స్నానం చేయడం వల్ల.. మీ చర్మం.. చాలా డ్యామేజ్ అవుతుంది. చర్మంలోని న్యాచురల్ ఆయిల్స్ కోల్పోయి.. డ్రైగా మారుతుంది. కాబట్టి.. చర్మం డ్రైగా మారడానికి కారణమయ్యే వీటికి దూరంగా ఉండండి.

English summary

7 Reasons Why Your Skin Is Becoming Dry During Winters

7 Reasons Why Your Skin Is Becoming Dry During Winters. Here are top 7 reasons why your skin is not behaving properly with you.
Please Wait while comments are loading...
Subscribe Newsletter