డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేయడానికి 8 ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు..!

జుట్టుకు ప్రోటీన్ మాస్క్ వేసుకోవడం వల్ల ఊహించని రీతిలో ఆరోగ్యకరమైన, షైనీ హెయిర్ ను అందిస్తుంది. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే కొన్ని అద్భుతమైన ప్రోటీన్ హెయిర్ మాస్కులు , ఇంట్లో స్వయంగా తయారుచేసుక

Posted By:
Subscribe to Boldsky

మన జుట్టు ఆరోగ్యానికి కారణం ప్రోటీన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా జుట్టుకు అందితేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది . జుట్టుు ప్రదానంగా ప్రోటీన్స్ అవసరం. ప్రోటీన్స్ ద్వారానే జుట్టు ఆరోగ్యంగా , అందంగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ..అందంగా మల్చుకోవడానికి ప్రోటీన్స్ ఉన్న ఆహారాలను తినడం మాత్రమే కాదు, ప్రోటీన్ హెయిర్ మాస్క్ వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ప్రోటీన్ హెయిర్ మాస్క్ తో జుట్టును నింపేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది. ప్రోటీన్ హెయిర్ మాస్క్ వల్ల ఎలాంటి జుట్టు సమస్యలైనా నివారించబడుతుంది. జుట్టు సంరక్షణ కోసం తీసుకునే జాగ్రత్తల్లో ప్రోటీన్స్ అధికంగా ఉండే సరైన పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి.

జుట్టుకు ప్రోటీన్ మాస్క్ వేసుకోవడం వల్ల ఊహించని రీతిలో ఆరోగ్యకరమైన, షైనీ హెయిర్ ను అందిస్తుంది. డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే కొన్ని అద్భుతమైన ప్రోటీన్ హెయిర్ మాస్కులు , ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే ప్రోటీన్ హెయిర్ మాస్క్ లు ఈ క్రింది విధంగా....

కొబ్బరి పాలుతో హెయిర్ ట్రీట్మెంట్ :

కొబ్బరి పాలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, ఇవి తలకు, జుట్టుకు మంచి బూస్టర్ వంటిది. రెగ్యులర్ గా కోకనట్ మిల్క్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టును మంచి షైనింగ్ తో స్ట్రాంగ్ గా మార్చుతుంది.

కొద్దిగా కోకనట్ మిల్క్ తీసుకుని, జుట్టుమొత్తానికి అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. కోకనట్ మిల్క్ ను రాత్రుల్లో కూడా అప్లై చేసి, ఉదయం తలస్నానం చేసుకోవచ్చు.

 

బనానా హెయిర్ మాస్క్ :

అరటిపండ్లలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. రెండు బాగా పండిన అరటిపండ్లను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను తలకు, జుట్టుకు పూర్తిగా అప్లై చేసి, అరగంట తర్వత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బనాన హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ స్ట్రక్చర్ మరియు హెయిర్ ఎలాసిటిని పెంచుతుంది.

పెరుగుప్రోటీన్ మాస్క్:

ఒక కప్పు పెరుగు తీసుకుని,అందులో కొద్దిగా శెనగిపిండి మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్తాలు బాగా కలగలిసే వరకూ మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు పొడవునా అప్లై చేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. అయితే ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు, షాంపు ఉపయోగించకూడదు. ఈ పెరుగు ప్రోటీన్ ప్యాక్ ను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మరియు జుట్టు వేగంగా పెరుగుతుంది.

గుడ్డు మరియు తేనెతో మాస్క్ :

ఈ రెండింటి కాబినేషన్ మాస్క్ జుట్టుకు ఒక ఉత్తమైన ట్రీట్మెంట్. గుడ్డు, తేనె తో వేసుకునే హెయిర్ మాస్క్ వల్ల జుట్టుకు మంచి షైనింగ్, వస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒక టీస్పూన్ తేనెను, రెండు గుడ్డు మిశ్రమంలో మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు పొడవునా అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. అవసరమైతే అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవచ్చు.

మయోనైజ్ ఎగ్ ప్యాక్ :

మయోనైజ్ గ్రేట్ కుకింగ్ పదార్తం మాత్రమే కాదు, హైప్రోటీన్ ప్రొడక్ట్ , రెండు స్పూన్ల మయోనైజ్ తీసుకుని, ఒక ఎగ్ వైట్ తో మిక్స్ చేయాలి. దీన్ని హెయిర్ రూట్స్ కు అప్లై చేయాలి. జుట్టు చివర్ల వరకూ అప్లై చేసి, ఈ ప్యాక్ ను రోజుకొకసారి జుట్టుకు అప్లై చేస్తే డ్యామేజ్ అయిన జుట్టు తిరిగి కొత్తగా మారుతుంది.

అవొకాడో, కొబ్బరి పాల ప్రోటీన్ ప్యాక్ :

కోకనట్ మిల్క్, అవొకాడో గుజ్జు అద్భుతమైన ప్రోటీన్ ప్యాక్ . ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలను అంధిస్తాయి. అవొకాడో పండును మెత్తగా చేసి, అందులో కొద్దిగా కోకనట్ మిల్క్ జోడించాలి. చిక్కటి పేస్ట్ లా తయారైన తర్వాత దీన్ని జుట్టుపొడవునా అప్లై చేయాలి. 40 నిముషాలు ఆగిన తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. హెయిర్ బ్రేకేజ్ సమస్యను ఎఫెక్టివ్ గా నివారించడంలో ఇది గ్రేట్ రెమెడీ.

గుడ్డు, పెరుగు ప్రోటీన్ ప్యాక్:

గుడ్డులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల , చాలా అద్భుతంగా సాయపడుతుంది. గుడ్డులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి, రెండూ బాగా కలిసిన తర్వాత , ఇప్పుడు దీన్ని తలకు అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో, షాంపు ఉపయోగించి తలస్నానం చేయాలి. గుడ్డు, పెరుగు కాంబినేషన్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తుంది.

శెనగపిండితో ప్రోటీన్ హెయిర్ ప్యాక్ :

3చెంచాల శీకాకాయ్ పౌడర్, 3చెంచాల శెనగపిండి తీసుకుని, కొద్దిగా నీళ్ళు లేదా, కొబ్బరి పాలు మిక్స్ చేసి, పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు, జుట్టు పొడవును అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒకటి, రెండు గంటల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.శీకాయ, శెనగపిండి కాంబినేషన్ ప్రోటీన్ రిచ్ కాంబినేషన్, ఇది జుట్టును కాంతివంతంగా మార్చుతుంది. మురికిలేకుండా చేస్తుంది.

English summary

8 Protein Hair Masks To Repair Damaged Hair That Show Results!

The role of protein hair mask recipes on the scalp is unparallel, as it helps to promote healthy and shiny hair. Check out some of the protein-rich hair packs if you're wondering on how to repair damaged hair naturally, which can be made at home easily.
Story first published: Thursday, November 17, 2016, 12:27 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter