For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అందంగా మార్చే అలోవెర ఫేస్ మాస్క్

అంతే కాదు అలోవెర జ్యూస్ లో చర్మానికి అవసరమయ్యే విటమిన్స్, మినిరల్స్ స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. ముడుతలను, ఫైన్ లైన్స్ ను నివారస్తుంది. అలోవెరలో ఉండే

|

ఎప్పుడు చూడని విధంగా మీ చర్మంలో మార్పులా, చర్మం డల్ గా, నిర్జీవంగా, డ్రైగా, మారిపోయిందా..అయితే మీకోసం ఒక అద్భుతమైన నేచురల్ అలోవెర ఫేస్ మాస్క్ ఉంది.

ఇది ఏం చేస్తుందని ఆలోచిస్తున్నారా, అలోవెరజెల్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మంలో నేచురల్ గా మార్పులను గమనిస్తుంటారు , అలోవెరలో స్కిన్ లవింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మంలోకి తప్పకుండా ట్రాన్సఫర్ అవుతాయి. చర్మంలో ఫైన్ లైన్స్, మొటిమలు, ఏజింగ్ స్పాట్స్ , అసాధరణ స్కిన్ టోన్, ఏసమస్యను సాల్వ్ చేడానికైనా అలోవెర గొప్పగా సహాయపడుతుంది.

 Aloe Vera Face Mask Recipes You Need To Try Today!

అద్భుతమైన అలోవెరలో ఫాలీశాచిరైడ్స్ , లెక్టిన్స్ మిరయు మన్నన్ కాంపౌండ్స్ అధికంగా ఉన్నాయి, ఇవి స్కిన్ లేయర్స్ లోకి డీప్ గా చొచ్చుకుని పోయి , స్కిన్ రిజువేయిట్ చేస్తుంది. స్కిన్ రీజనరేషన్ ప్రొసెస్ ను మెరగుపరుస్తుంది. ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

అంతే కాదు అలోవెర జ్యూస్ లో చర్మానికి అవసరమయ్యే విటమిన్స్, మినిరల్స్ స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. ముడుతలను, ఫైన్ లైన్స్ ను నివారస్తుంది. అలోవెరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చేతుల కాళ్ళ మీద ఉండే చర్మం ను కాంతింతంగా , తేమగా మార్చుతుంది, అంతే కాదు,అన్ని రకాల చర్మ తత్వాలకు ఇది సూట్ అవుతుంది.

మరి ఈ మ్యాజికల్ ప్లాంట్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి? అలోవెర ఫేస్ మాస్క్ రిసిపిలు ఏవిదంగా తయారుచేయాలి, ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం..

స్కిన్ లైటనింగ్ మాస్క్ :

స్కిన్ లైటనింగ్ మాస్క్ :

ఒకటేబుల్ స్పూన్ ఫ్రెష్ గా ఉండే అలోవెర జ్యూస్ తీసుకోవాలి. దీనికి అరటేబుల్ స్పూన్ నిమ్మరసంమిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసే వరకూ బీట్ చేసి, ముఖానికి మాస్క్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

స్మూతింగ్ యాంటీ ఏన్స్ మాస్క్:

స్మూతింగ్ యాంటీ ఏన్స్ మాస్క్:

ఫ్రెష్ గా ఉండే అలోవెర జెల్ ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని, సమంగా తేనె తీసి మిక్స్ చేసుకోవాలి. స్మూన్ తో బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ స్ట్రెచ్ అయిన తర్వాత ఆయుర్వేద అలోవెర మాస్క్ ను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నైట్ క్రీమ్:

నైట్ క్రీమ్:

మరో సింపుల్ స్కిన్ కేర్ మాస్క్, అలోవెర జెల్ ను ఒక టీస్పూన్ తీసుకుని, దీనికి 5 చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా మిక్స్ చేసి ముఖం మొత్తం అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను రాత్రుల్లో వేసుకుని ఉదయం శుభ్రం చేసుకోవచ్చు. యాంటీ ఏజింగ్ లక్షణాలను తొలగిస్తుంది.

హైడ్రేటింగ్ మాస్క్ :

హైడ్రేటింగ్ మాస్క్ :

ఒక టీస్పూన్ షుగర్ లో రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా ఉండే అలోవెర జెల్ మిక్స్ చేయాలి, రెండూ బాా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మర్దన చేయాలి. ఈ మాస్క్ ను అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాంటీ పింపుల్ మాస్క్:

యాంటీ పింపుల్ మాస్క్:

ఒక గుప్పెడు తులసి, మరియు మోర్గా లీవ్స్ తీసుకుని, కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి మెత్తగా పే్ట్ చేయాలి దీనికి ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకుని స్ర్కబ్ చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి,

డీటానింగ్ మాస్క్ :

డీటానింగ్ మాస్క్ :

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్క పౌడర్ ను వేసి అందులో అలోవెర జెల్ మిక్స్ చేసి, నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా తయారైన తర్వాత ముఖం మెడకు మాస్క్ వేసుకోవాలి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Aloe Vera Face Mask Recipes You Need To Try Today!

Aloe Vera Face Mask Recipes You Need To Try Today!,Succulent aloe vera contains polysaccharides, lectins and mannan compound, which penetrate deep into the skin layers, rejuvenate skin, promote the skin's regeneration process and help slow down the ageing process.
Story first published:Wednesday, December 7, 2016, 17:55 [IST]
Desktop Bottom Promotion