For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యూటిఫుల్ అండ్ క్లియర్ స్కిన్ పొందడానికి ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్

|

హెల్తీ స్కిన్ కేర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ ఎక్స్ఫ్లోయేటర్ చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించకోవచ్చు.

రెగ్యులర్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ వల్ల చర్మం ఫ్రెష్ గా, కాంతివంతంగా , తేమగా కనిపిస్తుంది. ముఖ్యంగా మొటిమలు మరియు మచ్చలకు కారణమయ్యే చర్మంలోని జిడ్డు మరియు మురికిని ను తొలగిస్తుంది.

స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడటంతో పాటు, చర్మం కాంతింతంగా మరియు ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. ఇంకా చర్మానికి అవసరమయ్యే బ్లడ్ సర్క్యులేషన్ అందించి , యంగ్ గా కనబడేలా చేస్తుంది.

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ ను స్కిప్ చేయడం వల్ల తిరిగి చర్మం నిర్జీవంగా డల్ గా కనబడుతుంది. ఇది చర్మం రంద్రాలను మూసుకొనేలా చేసి, మొటిమలకు కారణం అవుతుంది. స్కిన్ ఎక్స్ ఫ్లోయేషన్ కు మన వంటగదిలోని నేచురల్ పదార్థాలతోనే చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. మన వంటగదిలో ఉండే నేచురల్ పదార్థాలైన సీ సాల్ట్, తేనె, బేకింగ్ సోడా, ఇలాంటివి నేచురల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్స్ . ఇవీటితో పాటు మరికొన్ని స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి . వాటిని ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మరి వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం...

తేనె + బేకింగ్ సోడ:

తేనె + బేకింగ్ సోడ:

తేనె స్కిన్ బెస్ట్ ఫ్రెండ్ వంటింది. ఇందులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది మరియు

మరియు స్కిన్ రిపేర్ చేసి స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేయడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. తేనెలో బేకింగ్ సోడా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి ముఖం మెడకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 పంచదార ఎక్స ఫ్లోయేట్ మాస్క్ :

పంచదార ఎక్స ఫ్లోయేట్ మాస్క్ :

పంచదార మరో నేచురల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్. ఇందులో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ ప్రోటీన్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్ ను దూరం చేస్తుంది. ఇది కొత్త చర్మ కణాలను ఏర్పడేలా చేస్తుంది. చర్మంను సాప్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది.షుగర్ లో కొద్దిగా (ఆరెంజ్, లావెండర్, నిమ్మ )వంటి ఎసెన్సియల్ ఆయిల్స్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. రబ్ చేయాలి . తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు +ఓట్ మాస్క్:

పాలు +ఓట్ మాస్క్:

ఓట్ మీల్ కూడా నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అంతే కాదు ఇందులో ఉండే గొప్ప లక్షణాలు చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను నివారించి చర్మం జిడ్డుగా లేకుండా చేస్తుంది. ఓట్ మీల్లో కొద్దిగా పాలు, దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ లా అయిన తర్వత ముఖానికి అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత ముఖాన్ని మసాజ్ చేసి తర్వాత శుభ్రంగా కడిగితే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

కొబ్బరి నూనె + పంచదార:

కొబ్బరి నూనె + పంచదార:

పంచదారలో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి . పంచదారలో కొబ్బరి నూనె మిక్స్ చేసి ముఖం మరియు మెడకు అప్లై చేసి బాగా మర్ధన చేయాలి. 5నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ మరియు బియ్యం పిండి:

గ్రీన్ టీ మరియు బియ్యం పిండి:

గ్రీన్ టీ తయారుచేసి చల్లారిన తర్వాత అందులో బియ్యం పిండి కొద్దిగా వేసి, మెత్తగా పేస్ట్ చేయాలి., తర్వాత ముఖానికి అప్లై చేసి మాస్క్ వేసుకోవాలి. ఇది ముఖంలో మురికిని తొలగించడంతో పాటు, చర్మం లోపలి నుండి శుభ్రం చేస్తుంది.

చాక్లెట్ +షుగర్ మాస్క్:

చాక్లెట్ +షుగర్ మాస్క్:

బ్రౌన్ షుగర్, కోకపౌడర్ , వెనిలా ఎక్స్ ట్రాక్ట్ మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ జ్యూస్ + కాఫీ మాస్క్:

ఆరెంజ్ జ్యూస్ + కాఫీ మాస్క్:

ముఖంలో ఇన్ స్టాంట్ గ్లో రావాలంటే, ఈ ఫేస్ మాస్క్ ను అప్లై చేయాలి. ఆరెంజ్ జ్యూస్ మరియు కాఫీ పౌడర్ ను మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు అప్లై చేసి, కొన్ని నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకోవడానికి ముందు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇందులో ఉండే విటమిన్ సి, చర్మ కాంతిని పెంచుతుంది. కాఫీ పౌడర్ డెడ్ స్కిన్ సెల్స్, డస్ట్ ను నివారిస్తుంది.

బ్లూ బెర్రీ+ తేనె మాస్క్:

బ్లూ బెర్రీ+ తేనె మాస్క్:

ఇది కలర్ ఫుల్ మాస్క్. బ్లూ బెర్రీస్ ను మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె మరియు షుగర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో ముఖానికి స్ర్కబ్ చేయాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మానికి ఎలాంటి చీకాకు కలగకుండా దురద లేకుండా నివారించాలి.

పెరుగు + పంచదార:

పెరుగు + పంచదార:

పెరుగులో స్కిన్ ఎక్స్ ఫ్లోయేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. పెరుగులో ఉండే ఎసిడిక్ నేచరల్ చర్మానికి హైడ్రేషన్ తో పాటు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. మరియు ఇది స్కిన్ టోన్ కూడా మెరుగుపరుస్తుంది. పెరుగులో కొద్దిగా పంచదార మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇది ఫేస్ ప్యాక్ గా గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని చర్మానికి అప్లై చేస్తే చర్మం డ్రైగా మారుతుంది. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ స్కిన్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

బేకింగ్ సోడాను

బేకింగ్ సోడాను

బేకింగ్ సోడాను ఎక్కువగా స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ మరియు క్లెన్సింగ్ కోసం ఉపయోగిస్తుంటారు . బేకింగ్ సోడాను వాటర్ తో మిక్స్ చేసి స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాను చూపెడుతుంది.

English summary

Best Exfoliating Face Masks To Use

To clean your face from deep, applying face wash is not enough. You need to get rid of the dust and dead cell deposition to get a glowing and flawless skin.
Story first published:Wednesday, June 29, 2016, 13:09 [IST]
Desktop Bottom Promotion