For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటిపండుతో సొగుసూ, సోయగం రెట్టింపు

By Swathi
|

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి బ్యూటీ పార్లర్లకే ప్రతిసారీ వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగనీ.. బ్యూటీ కిట్ కోసమూ ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. అందరికీ అందుబాటు ధరలో.. చీప్ గా దొరికే అరటిపండు చాలు. మీ ముఖంపై పార్లర్ లాంటి మెరుపు తీసుకురావడానికి. అదెలా అంటారా ?

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు

అరటిపండులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అరటిపండు తినడానికి రుచిగానూ, తింటే ఆరోగ్యకరంగానూ ఉంటుంది. ఫేస్ ప్యాక్ లా అప్లై చేస్తే.. చర్మ కాంతి కూడా మెరుగవుతుంది. ఈ అరటిపండు ఫేస్ ప్యాక్ ని ఎవరైతే ఉపయోగింవచ్చు. టీనేజర్స్ నుంచి పెద్దవాళ్లు, అలాగే ఎలాంటి చర్మ తత్వం ఉన్నవాళ్లైనా.. అరటిపండు ఫేస్ ప్యాక్ లు వాడవచ్చు. అరటిపండు ఫేస్ ప్యాక్ ఉపయోగించే.. విభిన్న పద్ధతులేంటో చూద్దాం..

పింకిష్ గ్లో

పింకిష్ గ్లో

అరటిపండుని మెత్తగా గుజ్జులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ ముఖానికి పింకిష్ గ్లో వస్తుంది.

స్మూత్ స్కిన్

స్మూత్ స్కిన్

ఒక స్పూన్ పాలు, 2 స్పూన్ల నిమ్మరసం, అరటిపండు గుజ్జు తీసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ముఖానికి ఈ మిశ్రమాన్ని పట్టించి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మం స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది. ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ కి చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది.

గ్లోయింగ్ స్కిన్

గ్లోయింగ్ స్కిన్

ఒక స్పూన్ అరటి పండు గుజ్జు, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ గంధం తీసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే.. ముఖానికి న్యాచురల్ గ్లో వస్తుంది.

తేనె

తేనె

అరటిపండును గుజ్జుగా చేసి.. కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది.

ఫ్రెష్ లుక్

ఫ్రెష్ లుక్

అరటిపండు గుజ్జుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ తో చర్మానికి మసాజ్ చేస్తే.. చర్మం తాజాగా నిగారిస్తుంది.

మొటిమలకు

మొటిమలకు

బాగా పండిన అరటిపండు గుజ్జుకి అర టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ పసుపు కలపాలి. ఈ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ గానీ, క్రీమ్ గానీ రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ ని వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడాలి.

నిమ్మరసం

నిమ్మరసం

అరటిపండు గుజ్జుకి రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. మీ చర్మం మెరిసిపోతుంది.

పెరుగు

పెరుగు

అరటిపండు గుజ్జుకి ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ ఆరంజ్ జ్యూస్ కలపాలి. ఒకవేళ ఈ పేస్ట్ మందంగా అనిపిస్తే.. కాస్త ఆరంజ్ జ్యూస్ కలుపుకోవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసి.. కాస్త ఆరిన తర్వాత మరోసారి అప్లై చేయాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ చర్మం న్యూ లుక్ సొంతం చేసుకుంటుంది.

పంచదార

పంచదార

ఒక అరటిపండును మెత్తగా చేసి కొంచెం పంచదార కలిపి ఆ మిశ్రమంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఈ న్యాచురల్‌ స్క్రబ్‌ చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

ముడతలకు

ముడతలకు

అవకాడో, అరటిపండు రెండింటిని గుజ్జుగా చేసుకుని ముఖంపై ప్యాక్‌ లా అప్లై చేయాలి. అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మంపై ముడతలు అరికట్టవచ్చు. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల మీలో వయసు ఛాయలే కనిపించకుండా.. అరికట్టవచ్చు.

English summary

Best homemade banana face packs, face masks

Best homemade banana face packs, face masks. Bananas are a staple in every home’s fruit basket. Use it up to make one of these face packs according to your skin type or requirement and get glowing!
Story first published: Friday, February 12, 2016, 14:48 [IST]
Desktop Bottom Promotion